You Are Here: Home » భవిత » విద్య » TET-లాంగ్వేజ్-2(ఇంగ్లీష్)

TET-లాంగ్వేజ్-2(ఇంగ్లీష్)

TET-లాంగ్వేజ్-2(ఇంగ్లీష్)

TETటెట్ పరీక్షా విధానంలో ఇంగ్లీష్ విభాగానికి 30 ప్రశ్నలు కేటాయించడం జరిగింది. ఈ 30 ప్రశ్నలలో 24 ప్రశ్నలు లాంగ్వేజ్ స్కిల్స్ అంటే జనరల్ గ్రామర్ నుండి ప్రశ్నలు వస్తాయి. బోధన నైపుణ్యాలపై ఆరు ప్రశ్నలుంటాయి. రాష్ర్టంలో ఇప్పటికే రెండుసార్లు జరిగిన టెట్ పరీక్షా విధానం, ఎన్‌సిటిఇ నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా జరిగింది. పదవతరగతి స్థాయి వరకు గ్రామర్‌కు చెందిన అంశాలు ఉంటాయి. ఈ రెండు విభాగాల గురించి వివరంగా పరిశీలిద్దాం.

1.రీడింగ్ విభాగాలనుంచి నేరుగా ప్రశ్నలు.
2.Speaking, doing things తత్‌సంబంధ వర్క్‌బుక్ భాగా ల్లోని Functions, Structures మీద ప్రశ్నలు ఉంటాయి. కంటెంట్ విభాగానికి సంబంధించి ఈ విభాగాన్ని Grammar అని భావించినట్లయితే దాన్ని వ్యావహారి కంలో Practicalగా తీసుకుని మాత్రమే ప్రిపేర్‌కావాలి. నేరుగా పరీక్షకు ఉద్దేశించినప్పటికి అంతకుముందు తరగతుల్లోని Structures తెలుసుకోవడం మంచిది.
3.రైటింగ్ విభాగాల్లో ఇచ్చిన వేర్వేరు రాత ప్రక్రియలు : Dictation, Punctuation, అభ్యాసాల నుంచి ప్రశ్నలు వస్తాయి. Handwriting మీద కూడా ప్రశ్నలు రావచ్చు.
4.Vocabulary ప్రశ్నలు : అర్థాలు, వ్యతిరేక అర్ధాలు, Pronunciation, spelling మొదలైనవి.
5.Letter writing, composition skills పై ప్రశ్నలు ఉంటాయి.
6.Reading విభాగాల్లో ఉండే text (పాఠ్యాంశం) ను ఎక్కడి నుంచి సంగ్రహించారో తెలియజేసే సమాచారంపై ప్రశ్నలు వస్తాయి.

పై అంశాలనుంచి వచ్చే ప్రశ్నలు రెండు విధాలుగా అడిగే అవకాశం ఉంది. ప్రశ్నలను నేరుగా అడగటం మొదటిది. రెండోది ఆ అంశాల మీద అభ్యర్థి జ్ఞానం లేదా అనుభవాన్ని పరీక్షించే విధంగా లిజనింగ్ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. ఉపాధ్యాయుడు అనుసరించవలసిన సూచనల మీద Pronunciation of new words లేదా వాటి transcription పై మాత్రమే ప్రశ్నలు రావచ్చు తప్ప ఆ అంశాలపై వాటి సారాంశంపై ప్రశ్నలు అడగడానికి అవకాశం లేదు. ఎందుకంటే లిజనింగ్ విభాగం ఉద్దేశం అదికాదు. రీడర్స్‌లో మంచి exposure ఉందా లేదా అనేది చూడటమే పరీక్షకుని లక్ష్యం.
ఇక మెధడాలజీ విభాగాన్ని చూస్తే బి.ఎడ్.కోసం నిర్దేశించిన తెలుగు అకాడమి మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్‌ను ప్రామాణికంగా తీసుకోవచ్చు. మీకు ఆంగ్లబోధన అనుభవం (నిర్దేశించిన విధానంలో) ఉంటే మీరు పరీక్షకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని భావించవచ్చు. స్కూల్ అసిస్టెంట్ (English) లో నాలుగు భాగాల్లో విజేతలను నిర్ణయించేది ఈ భాగమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన బి.ఇడి కళాశాలల్లో ఛాత్రోపాధ్యాయులుగా పొందిన శిక్షణ అనుభవాన్ని ఇక్కడ పరీక్షిస్తారు. ఇందులో మొత్తం 6 అంశాలు ఉన్నాయి. వీటినుంచి వచ్చే ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయం – Methodology always includes prescribed class text books

1.English In India : (An introduction) భారత దేశంలో ఇంగ్లీష్ బోధన చరిత్ర, ప్రస్తుత స్థాయి, ద్వితీయ భాషగా ఇంగ్లీష్ బోధన, అభ్యసన సూత్రాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ బోధన యూరప్‌లో ఎలా అభివృద్ధి చెందింది? ఇతర సబ్జెక్టులు/భాషల ప్రభావం ఇంగ్లీష్‌పై ఏ మేరకు పడింది? ఇంగ్లీష్ అభ్యసనం అవసరం ఎందుకు ఏర్పడింది? అనే ప్రశ్నలకు సంబంధించిన కొన్ని కొటేషన్లు, కాలానుగతంగా వచ్చిన భావనలు (e.g: good speech) మార్పులు, కమిషన్లు, కమిటీలు, వాటి సిఫారసులు (e.g: Basic English), భారతదేశంలో ఇంగ్లీష్ బోధన లక్ష్యాలు, వాటి వైయుక్తిక స్పష్టీకరణలు (Aims and individual specifications), L,L,L లలోని తేడాలు అడగవచ్చు. ఇక Nature of Language అనే విభాగం నుంచి విస్తృతంగా ప్రశ్నలు రావచ్చు. ఉదా : నిర్వచనాలు, ఇతర వ్యవస్థలు (eg. Phonology, syntax, semantics), వేర్వేరు Schools of Psychology, Schools of Linguistics వాటి లక్షణాలు మొదలైనవి. భాషా బోధనల్లో ఇమిడి ఉండే అంశాలు (Implications in teaching)ను సమగ్రంగా పరిశీలించ వచ్చు. భాషాబోధనలో ఉండే ఇబ్బందులకు పరిష్కార మార్గాలను సూచించమనవచ్చు.
2. Teaching English Language Skills: L,S, R,W. అంటే మీకు తెలుసు వీటి ప్రాముఖ్యం, బోధన విధానాలు, వైయుక్తిక ఉపయోగాలు, లోపాలు, వాడుకస్థాయి, రకాలపై ప్రశ్నలు ఉండవచ్చు. ప్రతి Skill పై కొందరు చేసిన పరిశోధనలపై కూడా ప్రశ్నలు రావచ్చు. comprehensionపై ప్రశ్నలకు కూడా సిద్ధమవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా Readerలోcomprehension పై ఇచ్చే సూచనలను ప్రస్తావించవచ్చు. Skill పై నిర్వహించే Tasks (కృత్యాలు)తో మీకున్న అవగాహనను పరీక్షించ డానికి Thought provoking ప్రశ్నలు రావచ్చు. Skills of writing లోని వేర్వేరు అంశాలు చాల ముఖ్యమైనవి. ఒక మెథడాలజీ ఈ చాప్టర్ విశ్లేషణాత్మకంగా చదవాలి. ఎందుకంటే Readerలోని అంశాలకు Reflections ఈ చాప్టర్‌లో ఉండటమే కారణం. పరీక్షాపత్రం క్లిష్టంగా ఉందంటే దానికి ఈ చాప్టర్ నుంచి అడిగే ప్రశ్నల విశ్లేషణాత్మక స్థాయి ఎక్కువగా ఉంటుందని భావించాలి. ఉద్యోగార్ధులు ఈ చాప్టర్‌కింద ఎక్కువ ప్రశ్నలు ఆశించవచ్చు.
3.Different approaches and Methods of teaching English : ప్రశ్నలు నేరుగా ఉంటాయి. Approaches, Methods లక్షణాలు, ఉపయోగాలు, లోపాలు, భారతీయ తరగతి పరిస్థితులకు సంబంధించిన సాధక బాధకాలు ఇవన్నీ పరీక్షాంశాలే. మైక్రోటీచింగ్‌లోని Skills, వేర్వేరు Sub-skills తెలుసుకోవాలి. వివిధ Approaches, Methods లోని సారూప్యాలను కూడా ప్రశ్నాంశాలుగా భావించవచ్చు. Supplementary skills నుంచి Dictionary (వాడుక, arrangement of words వివిధ నిర్వచనాలు, డిక్షనరీల్లో వాడే abbreviations, Punctuation marks) మీద ప్రశ్నలు అడగవచ్చు.
4.Curriculum : కరికులమ్ నిర్మాణం అంటే ఏమిటి? టెక్ట్స్‌బుక్ లక్షణాలపై ప్రశ్నలు వస్తాయి.
5.The Methodology of Teaching a Text : రెండో చాప్టర్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ అధ్యాయాన్ని చదవాలి. ముఖ్యంగా Vocabulary, structure లను వేర్వేరు దృక్పథంలో చూడాలి. Vocubularyకి సంబంధించి కొన్ని పదాలనిచ్చి correct wordsగా గుర్తించమనవచ్చు. structural words ఇచ్చి వాక్యనిర్మాణం చేయమనవచ్చు. prose లక్ష్యాలు, స్పష్టీకరణలు, Poetry లక్ష్యాల మీద ప్రశ్నలు అడగవచ్చు. Lesson plan తయారీలో మెళకువలు తెలిసి ఉండాలి. Readers లో ఉండే పాఠ్యాంశాలను స్పృశిస్తూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. Prose గాని Poetry గాని అంశం పేరు ఇచ్చి దాని style పేర్కొనమనవచ్చు. ఉదా : Narration, smile, Audio-Visual Aids పాత్రను, వాటి వాడుక విధానంపై అవగాహన ప్రశ్నలకు సమాధానమి వ్వడానికి కనీస భాషా పరిజ్ఞానం వినియోగిస్తే సరిపోతుంది.
6.Evaluation: మూల్యాంకనం నుంచి సులభమైన విషయగ్రాహ్యక ప్రశ్నలు మెదడుకు పదును పెడతాయి. నికషనిర్మాణాలు ఇమిడి ఉండే వేర్వేరు సూత్రాల ప్రాధాన్యంపై ప్రశ్నలు రావచ్చు. Blue printలో వేర్వేరు లక్ష్యాల ప్రాతిపదికను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. బోధన అభ్యసన ప్రక్రియ తరువాత దానిలో భాగమైన పరీక్ష ఫలితాలను వ్యాఖానించేందుకు, లోపాలను సరిచేసేందుకు ఉపయోగపడే సాంఖ్యక పద్ధతుల విద్యా ప్రాముఖ్యం మీద కూడా ప్రశ్నలు వస్తాయి.

మోడల్ ప్రశ్నలు
1.What did the Romans study in second century B.C ? ( )
l) Latin 2) Greek
3) French 4) English
2. What did Webbe dispense altogether ? ( )
1) sentences 2) letter-writing
3) grammar 4) words
3. When did the broad mass of English vocabulary evolve a conventionalized spelling? ( )
1) middle of 15th century
2) middle of 16th century
3) middle of 1th century
4) middle of 17th century
4. Which subject influenced the changes in the teaching of English during 19th and 20th century? ( )
1) English and Latin
2) Psychology and Applied Lingusitics
3) Psychology and English
4) English and Applied lingusitics
5. When did the change occur in the Indian Education ? ( )
1) 20th century 2) 19th century
3) 15th century 4) 1th century
answers6. Who appointed University Commission?
l) Lord Curzon 2) Michael Sadler
3) British Government 4) Climax ( )
7. What did the patriotic feeling encourage? ( )
1) English language 2) Regional language
3) Latin language 4) American language
8. Who preferred a University Degree ( )
1) The Indian parents
2) The University students
3) The American parents
4) The college students
9. What was an important exercise in
the training of teaching writing ?
( )
1) grammar 2) reading
3) dictation 4) writing skills

TET PAPER – I 2011
1. She saw me. The negative form of the sentence is …………… ( 4 )
1) She don’t see me 2) She is not seen me 3) She doesn’t see me 4) She didn’t see me
2. Abdulla has bought a story book. The part of speech of the underlined word is
1) an adverb 2) a verb
3) a noun 4) an adjective ( 4 )
3. Wheat and rice are mere grass seeds. The word ‘mere’ means ( 2 )
1) cheap 2) only
3) best 4) costly
4. The hotel was surprisingly cheap. I expected it to be……….. (expensive).
[Complete the sentence choosing the suitable alternative].
( 4 )
1) the most expensive 2) so expensive
3) most expensive 4) more expensive
5. ‘The heading’ in writing a letter includes
1) the greeting
2) the writer’s address
3) the address of the person to whom you are writing
4) the writer’s address and the date ( 4 )
6. You can borrow the money …………. Complete the sentence choosing the correct answer. ( 3 )
1) however you pay it back as soon as possible
2) while you pay it back as soon as possible
3) if you pay it back as soon as possible
4) unless you pay it back as soon as possible
7. Choose the word with the correct spelling.
1) happenned 2) hapenned
3) happened 4) hapened ( 3 )

TET PAPER – II 2012
1. Choose the grammatically correct sentence.
1) III see you next Friday.
( 1 )
2) III see you on the next Friday
3) III see you on next Friday
4) Ill see you the next Friday
2. He gave her many advices. ( 2 )
This sentence may be edited as…
1) He gave her many pieces of advice
2) He gave her much advice
3) He offered her many advices
4) He gave her some advices
3. Identify the part of the sentence that has an error. ( 4 )
A) It is not the urge
B) to take revenge that
C) terrifies Hamlet,
D) but the gravitation of this nature
1) B 2) C
3) A 4) D
4. Where…….? In a village near Vijayawada.
Fill in the blank, choosing the correct answer

1) your uncle lives ( 2 )
2) does your uncle live
3) lives your uncle live
4) do your uncle live
5. Of all the words given below, one is given entry in the dictionaries Identify it. ( 1 )
1) lieutenant 2) lieutinent
3) leutenent 4) leiutenant
6. Kamals exhilarating performance left the audience awestruck.Here exhilarati ng means…. ( 4 )
1) exhausting 2) exhaustive
3) boring 4) exciting

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top