You Are Here: Home » Posts tagged "బాల కథలు"

బాలాజి

పూర్వం మాహారాష్ట్రలోని ఒక గ్రామంలో బాలాజీ అనే కుర్రాడు ఉండేవాడు. బీదవాళ్ళయినా అతని తల్లిదండ్రులు బాలాజీని బడికి పంపేవారు. అయితే బాలాజీకి కొంచెం మతిమరుపు ఉండేది. ఎంత ఎక్కువ చదివితే అంతే ఎక్కువగా మర్చిపోయేవాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేస్తున్నానని బాలాజీ చింతించేవాడు. ఒకరోజు బడిలో బాలాజీ ఒంటరిగా కూర్చుని ఆ రోజు మాస పరీక్షలో తనకు వచ్చిన తక్కువ మార్కుల గురించి చింతిస్తున్నాడు. సాంఘిక శాస్త్రాన్ని బోధించే ఉ ...

Read more

విద్య

ఒక ఊరిలో పూర్ణదత్తుడు అనే యువకుడు ఉండేవాడు. అతడికి చిన్నతనంలో చదువు అబ్బలేదు. తల్లిదండ్రులు అతడిని బడికి పంపించాలని ఎంత ప్రయత్నించినా పూర్ణదత్తుడు బడికి వెళ్ళేవాడు కాదు. దానితో అతనికి వయసు పెరిగిందే కానీ, వయసుకు తగ్గట్టుగా సరైన విద్య రాలేదు. పూర్ణదత్తుడిని అందరూ అజ్ఞానిగా, నిరక్షరాస్యుడిగా లెక్కగట్టేవారు. యుక్తవయసు వచ్చాక అతడికి పొరపాటు తెలిసి వచ్చింది. తోటివారు బుద్ధిగా చదువుకుని మంచి స్థాయిలో ఉండటం చూసి స ...

Read more

స్నేహితులు

ఒక అడవిలో ఒక జింక ఉండేది. ఒకసారి దానికి బాగా జబ్బు చేసి, బాగా నీరసించి, కదలలేని పరిస్థితి వచ్చింది. కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. అప్పటి వరకూ గడ్డికోసం నడవలేని ఆ జింక, కాస్త గడ్డి ఎక్కువగా ఉన్నచోటు వెతుక్కుని, అక్కడే విశ్రాంతిగా ఉంది. జింక అనారోగ్యంగా ఉందని అడవిలోని జంతువులన్నిటికీ తెలిసిపోయింది. జబ్బుతో విశ్రాంతి తీసుకుంటున్న జింకను చూసి పలకరించి పోదామని అడవిలోని జింకలు రాసాగాయి. తన కోసం జింకలు వచ్చినంద ...

Read more

స్నేహం

ఒక రైతు దగ్గర చాలా గాడిదలు ఉండేవి. మనుషుల్లాగే వాటిలో కొన్ని కష్టపడి పనిచేసేవి. మరికొన్ని సోమరిగా కాలం గడిపేవి. ఇంకొన్ని చిన్న చిన్న విషయాలకు చాలా భయపడేవి. మిగతావి ఎవరేమన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేవి. కొన్ని రోజుల తరువాత రైతు కొత్త గాడిదను కొనాలనుకున్నాడు. ఆ సంగతి తెలిసి అతని పొరుగున ఉన్న రామయ్య అనే అతను రైతు దగ్గరకు వచ్చాడు. ‘‘నువ్వు గాడిదను కొనబోతున్నావని విన్నాను. నా దగ్గర ఒక గాడిద ఉంది, కొంటా ...

Read more

మూడు చేపల కథ

ఒక చెరువులో మూడు చే పలుండేవి. ఇంకా చాలా చేపలున్నా అవి మూడు మాత్రం మంచి స్నేహితులు. వాటిలో ఒకటి జ్ఞాని. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి చేయడం దానికి అలవాటు. రెండవ చేప తెలివి గలది. తన తెలివితో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేసేది. మూడవది అన్నిటికన్నా చిన్న చేప. జరిగేవన్ని ఎలాగూ జరుగక మానవు కదా, మరి ఎందుకు మనం శ్రమ పడాలి అన్న వాదం ఆ చేపది. అందుకని, ఎటువంటి సమస్య వచ్చినా జరిగేది జరుగుతుందని, ఏ ప్రయత్నము చెయ్యకుండా ఉ ...

Read more

యుద్ధం

ఒక నది ఒడ్డున రెండు కొండజాతులు నివసించేవి. నీటిప్రవాహానికి ఎగువ భాగంలో ఉన్న కొండజాతులు చేపలు పట్టుకోవడానికి నదిలో వలలు వేసేవారు. చేపలు వలలోకి రావడానికి పెద్దపెద్ద మొద్దులతో నీళ్ళను కొట్టేవారు. దానితో నీళ్ళు బురదగా మారేవి. నీటి ప్రవాహానికి దిగువ భాగంలోని కొండజాతులకు నీళ్లు పాడవడంతో కోపం వచ్చింది. ‘‘మేము తాగే నీటిని మీరు పాడు చేస్తున్నారు. మేము ఎలా బతకాలి? వెంటనే మీరు చేపలు పట్టడం మానెయ్యండి’’ అన్నారు. ‘‘చేపల ...

Read more

అసూయ

ఒక రైతు దగ్గర ఒక గాడిద, మేక ఉండేవి. గాడిద రోజంతా పొలంలో కష్టపడి పనిచేసేది. గాడిద తినడానికి రైతు ఆహారం ఇచ్చేవాడు. మేకకు తన ఆహారం తాను వెతుక్కోవలసి వచ్చేది. పైగా యజమాని రోజూ గాడిదను మెచ్చుకోవడం విని మేకకు అసూయ కలిగింది. ‘ఒకవేళ గాడిద పనిచేయడం మానేస్తే యజమాని దాన్ని మెచ్చుకోవడం, ఆహారం పెట్టడం మానేస్తాడు’ అని అనుకుంది. ఒకరోజు అవకాశం చూసుకుని గాడిదను ఒక పెద్ద గుంతలోకి తోసేసింది. దానితో గాడిద గాయపడింది. రైతు వైద్య ...

Read more

కష్టానికి ఫలితం

ఒక ఊళ్ళో ఒక రైతు దగ్గర కోడి, బాతు, కుక్క, పంది ఉండేవి. అవి స్నేహంగా ఉంటూ కలిసి మెలసి తిరిగేవి. కోడి కష్టపడి పనిచేస్తే మిగతావి మాత్రం సోమరితనంతో కాలం గడిపేవి. ఒకరోజు కోడికి కొన్ని మొక్కజొన్న గింజలు కనబడ్డాయి. ‘‘వీటిని ఎవరు నాటుతారు?’’ అని అడిగింది. ‘‘నేను కాదు. నేను కాదు’’ అని బాతు, కుక్క, పంది... అన్నాయి. కొన్నిరోజుల తరువాత కోడి ‘‘మొక్కలకు నీళ్లు ఎవరు పెడతారు?’’ అని అడిగింది. ‘‘నేను పెట్టలేను. నేను పెట్టలేన ...

Read more

అందం కన్నా నైపుణ్యం మిన్న

ఒకరోజు వికారరూపుడైన ఒక యువకుడు విష్ణుశర్మ ఆశ్రమానికి వచ్చి ఆయనను కలిసాడు. ‘‘స్వామీ, ఈ కురూపితన్నాని భరించలేక పోతున్నాను. నన్ను అందంగా మార్చండి. లేకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ కన్నీళ్ళతో ప్రాధేయపడ్డాడు. ‘‘తప్పకుండా మారుస్తాను. అయితే నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండాలి. నువ్వు మీ ఊళ్ళో ఏ పని చేసేవాడివి’’ అని అడిగాడు విష్ణుశర్మ. ‘‘నేను చదువుకోలేదు. అయితే చెక్కతో బొమ్మలు చేయడం మా నాన్న దగ్గర నుండి నేర్చుకున్నాన ...

Read more

కోడిపెట్ట – నక్క

ఒక అడవిలో ఒక నక్క నివసించేది. ఒకరోజు నక్కకు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడిపెట్ట కనిపించింది. కోడిని చూడగానే నక్కకు నోట్లో నీళ్ళూరాయి. ‘ఈ అడవిలో కోళ్ళు బొత్తిగా కరువైపోయాయి. కోడిమాంసం తిని ఎన్ని రోజులయ్యిందో! ఎలాగైనా ఈ రోజు దీన్ని రుచి చూడాలి’ అనుకుని కోడితో ఎంతో ప్రేమగా మాటలు కలిపింది. ‘‘నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. నువ్వు ఈ అడవికి కొత్తా?’’ అని కోడిని అడిగింది. ‘‘అవును. మా యజమాని మమ్మల్ని పొరుగూరు స ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top