You Are Here: Home » ఇతర » 3డిలో ఫెైండింగ్‌ నీమో!

3డిలో ఫెైండింగ్‌ నీమో!

geawతప్పిపోయిన తన పిల్ల చేపను వెదకడానికి తండ్రి చేప పడే కష్టాలను అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ‘ఫెైండింగ్‌ నీమో’. చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ సినిమా త్వరలో 3డీ రూపంలో భారతీయ భాషల్లోకి కూడా రానుంది. దేశదేశాల్లో ఈ సినిమాని ఇష్టపడని పిల్లలు కానీ, పెద్దలు కానీ ఉండరని కచ్చితంగా చెప్పవచ్చు. అందుకు ఆ సినిమా సృష్టించిన సంచలనమే రుజువు. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం డిస్నీ, పిక్సార్‌ యానిమేషన్‌ వాళ్లు తీసిన ఇది ఇప్పుడు మళ్లీ మన ముందుకు రాబోతోంది. సినిమా మొత్తాన్ని త్రీడీగా మార్చారు. ఇక థియేటర్‌లోకి వెళితే అందాల సముద్రగర్భంలో ఈదులాడినట్టే అంటున్నారు నిర్మాతలు.

ఫెైండింగ్‌ నిమో’ను 2003లో 94 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ. 450 కోట్లకుపెైగా వెచ్చించి తీస్తే, అది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 8000 కోట్లకుపెైగా వసూలు చేసింది. దీనికి ఆస్కార్‌ అవార్డు కూడా లభించింది. సినిమా డీవీడీ విడుదల చేస్తే మూడేళ్లలోనే 4 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ప్రఖ్యాత అమెరికన్‌ ఫిల్‌‌మ ఇన్‌స్టిట్యూట్‌ వాళ్లు మేటి పది అత్యద్భుత యానిమేషన్‌ సినిమాల పట్టికలో ఒకటిగా దీన్ని గుర్తించారు.కథ విషయానికి వస్తే… సముద్రంలోని అందాల పగడాల తోటలో మార్లిన్‌, కోరల్‌ అనే చేపల జంట తమకు అప్పుడే పుట్టిన గుడ్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే షార్క్‌ దాడి చేస్తుంది. దాని నోట పడి తల్లి కోరల్‌తో పాటు, ఒక్కటి తప్ప గుడ్లన్నీ నాశనమైపోతాయి. ఆ ఒక్క గుడ్డూ పిల్లగా మారితే తండ్రి మార్లిన్‌ దానికి ‘నిమో’ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు.

ఓసారి నిమో నాన్న వద్దంటున్నా పెైకంటా ఈదుకుంటూ పోవడం, అక్కడ అక్వేరియాల్లోకి చేపల్ని అమ్మే వాళ్లు పట్టేసుకోవడం జరుగుతాయి. అలా నిమో ఓ నగరంలోని అక్వేరియంలోకి చేరితే, తండ్రి మార్లిన్‌ కొడుకును వెతికే పనిలో పడతాడు. చివరికి తండ్రీకొడుకులిద్దరూ ఎలా కలిశారనేదే సినిమా.సముద్ర గర్భంలో కనిపించే అద్భుతమైన దృశ్యాలను, జలచరాలను ఇందులో ఎంతో చక్కగా చిత్రీకరించారు. ఇప్పుడా దృశ్యాలన్నీ త్రీడీలో మరింతగా అలరించనున్నాయి. సముద్రంలో స్కూబా డెైవింగ్‌ చేస్తుంటే చేపలు, షార్క్‌లు మన మధ్యనే ఈదుతున్న అనుభూతి ఈ సినిమా కలిగిస్తుందని చెబుతున్నారు. ఇక్కడ కూడా బాగా వర్కవుట్‌ అవుతుందని భావిస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top