You Are Here: Home » ఇతర » 3జి టెక్నాలజీతో ప్రాణాంతక వ్యాధులు

3జి టెక్నాలజీతో ప్రాణాంతక వ్యాధులు

టెలికాం టెక్నాలజీ పెరుగుదలతో ప్రజలకు రాబోయే ప్రమాదాల గురించి నిజాలు బయటపడ్డాయి. 3జి టెలికాం సెల్‌ ఫోన్‌ టవర్స్‌ నుండి విడుదలయ్యే రేడియేషన్‌ కారణంగా భారతదేశంలో రాబోయే 2 సంవత్సరాల్లో కోటి మందికి పైగా క్యాన్సర్‌, నరాల బలహీనత ఏర్పడే మానసిక వ్యాధిగ్రస్థులు అవుతారట. మనందరినీ భయపెట్టే ఈ నిజాన్ని ముంబైలోని ఐ.ఐ.టి. విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ గిరీష్‌ కుమార్‌ జరిపిన పరిశోధనలో వెల్లడయ్యింది.

mtaఇప్పటికే 5 లక్షల సెల్‌ ఫోన్‌ టవర్స్‌ నుండి విడుదలవు తున్న రేడియేషన్‌ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే, 3జి టెలికాం సేవలకు మరో 2 లక్షల టవర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెల్‌ ఫోన్‌ టవర్స్‌ నుండి విడుద లయ్యే రేడియేషన్‌తో ఎక్కువగా బాధపడేది 16 సంవత్స రాల లోపు వయస్సు వారే. వీరిలో కార్నియర్‌ బోన్స్‌ సన్నగాను, మెత్తగా ఉంటాయి.2జి టెలికాం టెక్నా లజీ కంటే 3జి సెల్‌ టవర్స్‌ విడుదల చేసే రేడియేషన్‌ మరింత హాని అని తేలింది. ఈ సెల్‌ టవర్స్‌కు 5 మీటర్ల దరిదాపుల్లో నివసించే వారు అధిక సంఖ్యలో ఈ వ్యాధులకు గురౌతారని గిరీష్‌ కుమార్‌ చెబుతు న్నారు. 3జి సెల్‌ రేడియేషన్‌తో తలనొప్పి, మతిమరపు, తలతిప్పుట, వణుకు, కండరాల నొప్పులు, డిప్రె షన్‌తో పాటు కలత నిద్ర బాధలు కులుగు తాయట.

వీటికంటే ఎక్కువ బాధ కలిగించే ఫిట్స్‌, పక్షవాతం లాంటి పెద్ద వ్యాధులు కూడా వస్తాయంటున్నారు. ఈ పరిశోధనా ఫలితాలు వచ్చాక బెల్జియం, ఫ్రాన్స్‌, ఫిన్లాండ్గ, జర్మనీ, రష్యా మరియు ఇస్రాయిల్‌ దేశాలలో వీటి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నాయి. ఇక ఈ వ్యాధులను నిర్ధారించే డాక్టర్లు గానీ ఈ వ్యాధులకు సెల్‌ ఫోన్‌ టవర్స్‌ నుండి వెలువడే రేడియేషన్‌ కారణమని ఊహించలేకపోతు న్నారు. దీనిపై పరిశోధనా వివరాల రిపోర్టును టెలికాం డిపార్ట్‌మెంటుకు అందజేశారు. టవర్స్‌ నుండి వెలువడే రేడియేషన్‌ కంట్రోల్‌ చేసే నివారణ పనులు చేపట్టాలని కోరారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top