You Are Here: Home » ఇతర » 2013 ఫిబ్రవరిలో గెలాక్సీ ఎస్‌4

2013 ఫిబ్రవరిలో గెలాక్సీ ఎస్‌4

దిగ్గజ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌ మరో బృహత్తరమైన ఆవిష్కరణకు ముహుర్తం ఖరారు చేసింది. తన ఖ్యాతిని మరింత రెట్టింపు చేసిన గెలాక్సీ ఎస్‌3 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్‌గా గెలాక్సీ ఎస్‌4 ను 2013 ప్రధమాంకంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

samsuaఈ కొత్త తరం స్మార్ట్‌ఫోన్‌ను ఈ వింటర్‌లో జరిగే యూరోపియార్‌ టెక్నాలజీ ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశముం దని నివేదికలు చెబుతున్నాయి. ఈ డివైజ్‌లో వినియోగించిన కార్టక్స్‌ ఏ15 డిజైన్‌తో కూడిన క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ను ‘ఆడోనిస్‌’ కోడ్‌ నేమ్‌తో పిలుస్తున్నారు. గెలాక్సీ ఎస్‌4ను వచ్చే ఏడాది ఆరం భంలో నిర్వహించే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ వేదికపై ఆవిష్కరించేందుకు సామ్‌సంగ్‌ సిద్ధంగా ఉంది. పలు నివేదికలు ఆధారంగా సేకరించిన గెలాక్సీ ఎస్‌4 ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఇందులో 5 అఞగుళాల వోఎల్‌ఈడి డిస్‌ప్లే, మెమరీ వేరియంట్స్‌ 16జీబి, 32జీబి, 64జీబి, 128 జీబి ఉంటాయి. 3జీబి ర్యామ్‌, 3200ఎమ్‌హెచ్‌ బ్యాటరీ, 1.9మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ సపోర్ట్‌ చేస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top