You Are Here: Home » ఇతర » 1896లో ఆధునిక రూపం

1896లో ఆధునిక రూపం

నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడల్ని ఒలింపియాడ్‌గా పిలిచేవారు. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్‌ క్రీడలుగా, కొంత విరామం తరువాత తిరిగి ప్రారంభం అయిన క్రీడలకు ఆధునిక ఒలింపిక్‌ క్రీడలుగా వ్యవహరించారు. ఇంతవరకూ 29 ఒలింపిక్‌ క్రీడలు జరుగగా, 30వ ఒలింపిక్‌ పోటీలు ఈ సంవత్సరం లండన్‌లో జరుగనున్నాయి. 1896 నుంచి ఒలింపిక్స్‌ జరుగుతున్న దేశాలు పాల్గొన్న క్రీడాకారులు వివరాలు ఓసారి చూద్దాం.

1896 ఎథెన్స్‌ ఒలింపిక్స్‌
1904a1896లో తొలి ఒలింపిక్స్‌ క్రీడలు గ్రీసు పట్టణమైన ఎథెన్స్‌లో జరిగాయి.సుమారు 1500 సంవత్స రాల తరావాత ఒలింపిక్‌ క్రీడలకు జీవం పోసిన ఘనత ఫ్రాన్స్‌కు చెందిన పియరీ డి క్యుబర్టీన్‌కు దక్కింది. తొలి క్రీడలు ఫ్రాన్స్‌లో జరగాలని క్యుబ ర్టీన్‌ పట్టు పట్టిన ప్రాచీన ఒలింపిక్‌ క్రీడలు జరిగిన గ్రీసులోనే జరగాలని ఒత్తిడి రావడంతో అతని కోరిక నెరవే రలేదు. ఏప్రిల్‌ 6, 1896న జార్జియస్‌ ఎవెరాఫ్‌ విగ్రహాన్ని గ్రీసుకు చెందిన రాజు కింగ్‌ జార్జి1 ఆవి ష్కరించడంతో క్రీడోత్సవాలు ప్రారంభమ య్యాయి. ఇందులో 311 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అందులో 230 మంది క్రీడాకారులు గ్రీసుకు చెందినవారే. కానీ విజయాలలో అమెరికా పైచేయి సాధించింది.

1900 పారిస్‌ ఒలింపిక్స్‌
ఆధునిక ఒలింపిక్‌ క్రీడల పితామహుడైన క్యూబర్టీన్‌ స్వంత దేశంలో ఈ క్రీడలు జరిగిననూ… నిర్వ హణపరమైన లోపాలు తలెత్తాయి. భవిష్యత్తు క్రీడలన్నీ ఎథెన్స్‌లో జరగాలని గ్రీసు రాజు అభిలషిం చినా క్యూబర్టీన్‌ చొరవతో పారిస్‌ వేదికగా నిలిచింది. అంతేకాకుండా 1897లో టర్కీతో యుద్ధం, ఆర్థిక సంక్షోభంతో కూడా గ్రీసు ఈ క్రీడల పట్ల ఆశక్తత చూపింది. దీంతో ఫ్రాన్స్‌కు మార్గం సుగమ మయింది. 1900, మే 20న పారిస్‌లో రెండో ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి.

1904 సెయింట్‌ లూరుూస్‌ ఒలింపిక్స్‌
whiteaమొదటి ఒలింపిక్‌ క్రీడలు జరగడానికి ముందే మూడో ఒలిం పిక్‌ అమెరికాలో జరగాలని నిర్ణయించా రు. వేదిక మాత్రం 1901లో ఖరారైంది. అవి పేరుకు ఒలింపిక్‌ క్రీడలైనా అమెరి కా జాతీయ క్రీడ లు మాదిరిగా జరిగాయి. పాల్గొన్న 625 క్రీడా కారుల లో 533 మంది అమెరికా దేశస్థులే. మిగిలిన వారిలో అత్యధికులు పొరుగున ఉన్న కెనడా దేశ స్థులు. సహజంగానే ఈ పోటీల్లో అమెరికానే అధి పత్యం కొనసాగించింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top