You Are Here: Home » చిన్నారి » కవితలు » ఒవిలికాగిెో!

ఒవిలికాగిెో!

టుక కంటినీరు
మానవాళి మనుగడను
ప్రశ్నార్ధకం చేసింది.

సస్యలక్ష్మి తాను చిగురించడానికి
కాంక్రీటు వనాలు అడ్డుగా ఉన్నాయని
మొర పెట్టుకుంటోంది.

కణ రూపంలో ఉన్న ఆడశిశువు
తాను కళ్లు తెరవకుండా
విషప్రయోగాలంటూ ఘోషిస్తోంది.

అజంతమైన ఆంధ్ర భాష
తన వర్ణాలు ఎ, బి, సి లుగా
మారిపోయాయని ఆవేదనచెందుతోంది.

ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ
స్ర్తీలకు సమాన హక్కులను కల్పించిన
ధ్రుతరాష్ట్ర సంతతి
మాయాజూదంలో వారిని
నామరూపాలు లేకుండా చేసింది.

అర్ధనారీశ్వరుడు మూడవకన్ను తెరిస్తే
ప్రళయమట
స్ర్తీ జాతి కన్ను మూస్తే కూడా ప్రళయమట.
చిగురుల్లేని చెట్లపైకి కోకిలలు రాలేక
తమ యుగాల గానానికి మంగళం పాడాయి
మానవాళి
పర్వదినాలను, పండుగలను మరచింది.

ఆడ కణాన్ని సైతం భూమి మీదకు
తీసుకు రావద్దని కంకణం కట్టుకున్న
దానవ సంతతి కీటక దశకు వెళ్లింది.
(కొన్ని మగ కీటకాలే గర్భం దాలుస్తాయి)

అ, ఆ లను, అమ్మని మరచి, మమ్మీ డాడీలకు
అలవాటు పడిన బిడ్డలు
చైత్రాన్ని మరచారు, చైతన్యాన్ని విడచారు.

బౌద్ధం పుట్టిన దేశంలో
బాంబు దాడులు, మందు పాతరలు
దేశాన్ని ముక్కలు చేసే రాష్ట్ర విభజనలు.
ప్రళయాన్ని రుచిచూసిన నర జాతి
పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని
ఇంటింటా మనిషికో మొక్కంటూ
చిగురాకుల తోరణాలు కడుతున్నారు.

ఆడబిడ్డల్ని బంగారు తల్లిగ భావించి
పుట్టక ముందే ఎన్నో రాయితీలు
పథకాలు ప్రవేశపెట్టారు.

వేదంలా గాన యోగ్యమైన
ప్రాచీన తెలుగు భాషను
ప్రపంచ భాషగా నిలుపుతామంటూ
ప్రతిజ్ఞ చేసింది.

ఇది మన యుగ ఆది
కొత్త భావాల నవ ఉగాది
జయ ఉగాది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top