You Are Here: Home » చిన్నారి » కవితలు » మందకోసం ప్రాణం

మందకోసం ప్రాణం

గుర్రా లోని చెరువు ఎండిపోయినా
తుమ్మ చెట్లు పచ్చగ నవ్వుతున్నాయి
జీవాలన్నీ సుట్టూచేరి
మోరలెత్తి ఆశగా ఆత్రంగా చూస్తున్నాయి
నాయన
మునివేళ్ళ మింద నిలబడి
బద్దె తీగల్ని తుమ్మ కొమ్మల్ని
చిలు క్కొడవలితో సిటుక్కున దుసపీకి
మందకు విందు పెట్టి నిమ్మల పడతాడు
అవి ఎప్పుడూ సల్లగుండల్లని
ప్రతిక్షణం
ఎంత తాపత్రయ పడతాడు
ఎన్ని దేవుళ్ళకు మొక్కుతాడు

మంద కడుపు నిండక పోతే
నీళ్ళైనా ముట్టడు
వాటి కడుపు నింపడంకోసం
మానం!
ప్రాణం!!
అన్నీ ధారపోయడానికైనా సిద్ధ పడతాడు

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top