You Are Here: Home » చిన్నారి » కవితలు » ఒక సంచలిత రాగం

ఒక సంచలిత రాగం

ప్రియురాలి మనసు
చూరగొనలేకపోవడం నిరాశ…
ఆమె కంటికి రెప్పలా
అతుక్కుపోవాలనుకోవడం అత్యాశ…
పండువెన్నెల్లో ఆమెకి మధువుతాగించి
క్రీడించాలనుకోవడం దురాశ…
అతని ఆశ చావదు
ఆరాటం ఆగదు
ఏనాటికైనా ఆమె మనసు గెలుస్తానని
అతని గట్టి నమ్మకం!
ఆశ, నమ్మకం కాళ్లీడ్చుకుంటూ
అతణ్ణి దేశ దిమ్మరిని చేశాయి…
మనిషినుంచి మనసుని మాయం చేశాయి…
అతని దృష్టిలో
భూమ్యాకాశాలు
ఝరులు సాగరులు
సృష్టియావత్తూ ప్రేమమయమే!
నక్షత్రాలను చూపుడువేలుతో లెక్కపెడుతూ
రాత్రిని ఒక్క గుటకలో మింగేస్తాడు…
సూర్యుడు అస్తమిస్తాడు
చంద్రుడూ అస్తమిస్తాడు
అతను మాత్రం-
రేయింబవళ్ళు ఉదయిస్తూనే వుంటాడు…
ప్రేమకు సుప్రభాతం పాడుతూనే వుంటాడు…

– సాహిత్యప్రకాశ్‌
సెల్‌: 9492530542

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top