You Are Here: Home » చిన్నారి » కవితలు » నీకు ఓ అద్భుత రూపం కల్పిస్తా..!

నీకు ఓ అద్భుత రూపం కల్పిస్తా..!

గార్మెంట్‌లో
సుతిమెత్తని బట్టవు నీవైతే
నేను కటింగ్‌ మాష్టరునై
నీకు మంచి రూపాన్ని కల్పిస్తాను…
టేపుతో లెక్కలు వేసి
నా కొలతకు
సమానమౌతావో లేదో చూస్తాను…
టైలరు నై
నీలో ప్రతి అంచును తాకుతూ
నాలో నేనే
నీ స్పర్శకు మైమరుస్తూ
నిన్ను ఫినిషింగ్‌ చేస్తాను…
ట్రిమ్మర్‌నై
నిన్ను అంటిపెట్టుకున్న
నూలి పోగుల్లాంటి వాళ్ళను కత్తిరించి
పూర్తిగా నాదాన్ని చేసుకుంటాను…
చెక్కర్‌నై నీ చుట్టూ చక్కర్లు కొట్టి
నీలో క్వాలిటీని కనిపెడతాను…
మాష్టర్‌నై ప్రతి కదలికలోనూ
నిన్నే గమనిస్తాను…
ఐరన్‌గా మారి నీ తనువుపై
సుతారంగా తాకుతూ
చితికిపోయిన నీ మేనుకు
సౌందర్యాన్ని ఇస్తాను…
నిన్ను తొడిగి నాలో కలిపేసుకుంటాను
గార్మెంటులో బట్టలా…
నీవు అలంకారివైతే
ప్రతి చూపు కదలిక
నీకోసం అన్వేషిస్తుంది…
అందులో నా చూపు
ప్రత్యేకంగా నిన్నే గమనిస్తుంది…

– నరెద్దుల రాజారెడ్డి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top