You Are Here: Home » సఖి » రుచి » నవరతన్‌ కూర్మా

నవరతన్‌ కూర్మా

కావలసిన పదార్ధాలు:
navarathankurmaఉడకబెట్టిన కూరగాయ ముక్కలు – 3 కప్పులు
(ఆలూ, కారెట్‌, పచ్చి బఠాణీ, బీన్స్‌, కాలిఫ్లవర్‌, కాప్సికమ్‌, కాబేజ్‌, గోరు చిక్కుడు, సొరకాయ)
పనీర్‌ – 150 గ్రా. (తురిమినది)
టమాటాలు – 3
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగి)
అల్లం పేస్ట్‌ – 1 1/2 టీ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్‌ – 1 1/2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
పసుపు – 1 టీ స్పూను
కారం – 1 1/2 టీ స్పూన్లు
ధనియాలపొడి – 1 టీ స్పూను
గరం మసాలా పొడి – 2 టీ స్పూన్లు
మీగడ – 2 టేబుల్‌ స్పూన్లు
నూనె – 6 టేబుల్‌ స్పూన్లు
నెయ్యి – 1 టేబుల్‌ స్పూన్‌
పాలు/ నీళ్ళు – 1 కప్పు
డ్రై ఫ్రూట్స్‌ – 1/4 కప్పు
కొత్తిమీర – అలంకరణకి
తయారు చేసే విధానం:
టమాటాలను మృదువుగా అయ్యేవరకూ ఉడకించాలి. తర్వాత చల్లారనిచ్చి దాని తొక్కు తీసేసి దానితో గుజు తయారు చేసుకోవాలి. లేదా రెడీమేడ్‌గా దొరికే టమాటా ప్యూరీని కూడా వినియోగించవచ్చు. తర్వాత ఒక స్పూన్‌ నేతిని బాణలిలో వేసి డ్రైఫ్రూట్స్‌ను ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేయించాలి. వాటిని తీసేసి నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయిం చాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వా త అందులో టమాటా ప్యూరీని, డ్రై ఫ్రూట్స్‌ని వేయాలి. గరిటతో తిప్పుతూ దానిని నాలుగు నిమిషాల పాటు ఉడకించాలి. బాణలికి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఇందులో పాలు, కాసిని నీళ్ళు పోస్తూ పొంగురానివ్వాలి. తర్వాత మంట తగ్గించి గ్రేవీ చిక్కగా అయ్యే వరకూ ఉంచాలి. తర్వాత అందులో పనీర్‌ వేసి గరిటతో తిప్పాలి. చివరగా ఉడకబెట్టుకున్న కూరగాయల ముక్కలను గ్రేవీలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. సర్వ్‌ చేసే మందు దానిపై మీగడ, కొత్తమీర ఆకులతో అలంకరించి సర్వ్‌ చేయాలి. ఇది చపాతీలలోకి, నాన్‌లలోకి అధరవుగా బాగుంటుంది.

స్టఫ్డ్‌ కాప్సికమ్‌

కావలసిన పదార్ధాలు:
capsicamకాప్సికమ్‌ (సిమ్లా మిర్చి) – 5-6
ఉడకబెట్టిన ఆలూ – 2
ఉడకబెట్టిన పచ్చి బఠాణి-2 టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
పసుపు – 1/4 టీ స్పూను
కారం – తగినంత
గరం మసాలా – 1/4 స్పూను
ఆమ్‌చూర్‌ – 1/4 టీ స్పూను
ఉప్పు – తగినంత
నూనె – తగినంత
తయారు చేసే విధానం:
కాప్సికమ్‌ను శుభ్రంగా కడిగి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. తర్వాత అందులో నీటిని వంచేసి చల్లారనివ్వాలి. ఉడకబెట్టి ఉంచుకున్న ఆలుగడ్డను చిదమాలి. బాణలిలో రెండు టీ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. ఇందులో మసాలా దినుసులు, ఆలుగడ్డ చిదుము, బఠాణీలు వేసి కొద్ది నిమిషాలు వేయించాలి. చాకుతో కాప్సికమ్‌ తొడిమను, లోపల ఉన్న గింజలను తొలిగించాలి. తర్వాత చేసి వేయించిన స్టఫిం గ్‌ను అందులో జాగ్రత్తగా పెట్టాలి. మరొక బాణలి పొయ్యి మీద పెట్టి తగినంత నూనె పోసి స్టఫ్‌ చేసుకున్న కాప్సికమ్‌ను అందులో వేసి అన్ని వైపుల నుంచి వేయిం చాలి. వేగిన కాప్సికమ్‌ మీద పనీర్‌ తురుము, కొత్తిమీర ఆకులు, గుండ్రంగా తరిగిన టమాటాలతో అలంకరించి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

స్టఫ్డ్‌ టమాటా

కావలసిన పదార్ధాలు:
stafftomotaమీడియం సైజ్‌ టమాటాలు – 5-6
పనీరు తురుము – 100-150 గ్రా.
ఉల్లిపాయ – 1 సన్నగా తరిగి
కొత్తిమీర – సన్నగా తరిగి
పచ్చి మిర్చి – 2 సన్నగా తరగాలి
ఉప్పు – తగినంత
కారం – తగినంత
గరం మసాలా – తగినంత
పసుపు – 1/4 టీ స్పూన్‌
చీజ్‌ తురుము – 1 టేబుల్‌ స్పూన్‌
నూనె – 1 టేబుల్‌ స్పూన్‌
తయారు చేసే విధానం:
టమాటాలను శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. తర్వాత టమాటా పై భాగంలో తొడిమ దగ్గర గుండ్రంగా కత్తిరించాలి. తర్వాత మధ్యలో ఉన్న పదార్ధాన్ని జాగ్రత్తగా బయటకు తీయాలి. దీనిని ఒక పక్కన పెట్టి పైన తీసేసిన భాగాన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కొద్ది నూనె వేసి వేడి చేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకొని మెత్తగా అయ్యే వరకూ వేయించాలి. ఇప్పుడు టమాటోలో తీసిన గుజ్జును, టమాటా ముక్కలను వేసి ఒక నిమిషం వేయించి అందులో మసాలాలు వేసి మరొక నిమిషం వేగనివ్వాలి. తర్వాత అందులో పనీర్‌ వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి. తర్వాత దానిని పక్కకి తీసి ఈ మిశ్రమాన్ని టమాటాల్లో నింపాలి. దానిపై తురిమి పెట్టుకున్న చీజ్‌, కొత్తిమీరను వేయాలి. తర్వాత ప్రెషర్‌ కుక్కర్‌ ప్లేట్‌లో పెట్టి దాని పై వెన్న వేసి ఒక విజిల్‌ వచ్చే వరకూ ఉడకనివ్వాలి. లేకుంటే దానిని ఒవెన్‌లో 200 డిగ్రీల వేడితో ఒక ఇరవై నిమిషాల పాటు బేక్‌ చేసుకోవచ్చు. దీనిని వేడి వేడిగా సర్వ్‌ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top