You Are Here: Home » ఇతర » ‘‘హైస్కూల్‌’’కు యునిసెఫ్‌ అవార్డ్‌

‘‘హైస్కూల్‌’’కు యునిసెఫ్‌ అవార్డ్‌

DSCaaచదువుకునే పిల్లల మనస్త త్వంలోని వైవిధ్యాలు చాలా సున్ని తంగా తెరరూపం ఇచ్చింది ‘‘హైస్కూల్‌’’ సీరియల్‌. రొటీన్‌ టివి సీరియల్స్‌ మధ్య పసిపిల్లల భావో ద్వేగాలను, వారి అమాయ కత్వాన్ని, అల్లరిని, వివిధ కోణాల్లో సృ్వశించిన ధారావాహికగా వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకో బోతున్న సీరియల్‌ ‘‘హైస్కూల్‌ ’’ జెమినీ టివిలో సాయంత్రం 6:30 కి ప్రసారమౌతుంది. ఈ సీరియల్‌కు ప్రతిష్టాత్మ కమైన ‘యునిసెఫ్‌ ’’ అవార్డు దక్కించుకుంది. ఆడపిల్లల ప్రాముఖ్యాన్ని, వాళ్లకు చదువు యెడల ప్రాధా న్యాన్ని చక్కగా చూపిం చినందుకు ఈ సీరియల్‌కు ఈ అవార్డును అందు కున్నారు సీరియల్‌ నిర్మాత డి.వై.చౌదరి. ఈ అవార్డును గవర్నర్‌ నరసింహన్‌ అందచేశారు. డి.వై. చౌదరి స్థాపించిన సంస్థ ద్వారా జెమినీ టివిలో ‘‘చి.ల.సౌ. స్రవంతి’’ మెగా సీరియల్‌ ఇప్పటికే తెలుగునాట సంచలనం సృష్టించింది.

ఆ సంస్థ ద్వారా వస్తున్న మరో ఆణిముత్యమే ఈ ‘‘హైస్కూల్‌’’. ఈ సీరియల్‌లో నటించిన అస్మిత, సాయినాథ్‌, పావని, తాహెర్‌, సాయితేజ, దుర్గ, దత్తు, ఆర్మాన్‌, పవన్‌ కల్యాణ్‌, ప్రియాంక, … యామిని, అనిత, సాయి హరీష్‌, ప్రేమ్‌కు మార్‌, లక్ష్మీ నర సింహ, శ్రీనివాస్‌ కళ్యాణ్‌, సాజిద్‌, షహ రీష్‌, తాజుద్దీన్‌, కృష్ణమోహన్‌, కె.ఎస్‌. కుమార్‌, అమ్మ రమేష్‌, తిరు పతిదొరైలు మనలాగే.. మన తో పాటు చదువుకుంటున్న పిల్లలే. వీరి నటనతో మన లాంటి పిల్ల లు పాఠ శాలలో జరిగే సంఘట నలు, ఇంట్లో పరిస్థితులపై చక్కగా అభిన యించి… తమ నటన ద్వారా మన లాంటి పిల్లలకు ఆదర్శంగా మారారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top