You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు » హైదర్‌ ఆలీని కటిక్షించిన రంగనాథుడు

హైదర్‌ ఆలీని కటిక్షించిన రంగనాథుడు

హైదర్‌ ఆలీని కటిక్షించిన రంగనాథుడు

 

కావేరీ నదీతీరంలో శ్రీరంగపట్నంలో కొలువుదీరిన శ్రీరంగనాథుడు మహిమాన్వితుడని ప్రతీతి. అన్యమతాలకు చెందిన వారు సైతం ఆయనను ప్రార్థించినట్లు, ఆయన వారిని కాపాడినట్లు భక్తులు విశ్వసిస్తారు. కావేరి నదీమాతకు ఇచ్చిన వరం మేరకు ఆయన అక్కడ వెలసినట్లు స్థలపురాణం చెబుతోంది. దక్షిణ భారతదేశ యాత్రలో తప్పనిసరిగా చూడవలసిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రధానమైంది శ్రీరంగపట్నమంటే అతిశయోక్తి కాదు.
sri5మునిశ్రేష్ఠుడైన గౌతమ మహర్షి ఒక శ్రీరంగంలోని వైకుంఠవాసియైన శ్రీరంగనాథస్వామిని పూజించాడు. మహర్షి పూజలకు ప్రసన్నుడైన రంగ నాథుడు, ఆయన ముందు ప్రత్యక్షమై ‘మహర్షీ! ఈ కావేరి నదీ తీరాన పడ మటి దిక్కుగా ఇంకొంచెం ముందుకు వెళితే, అక్కడ కూడ నేను ఉన్నాను. అక్కడికొచ్చి నన్ను దర్శించుకోగలవు’ అని చెప్పి అదృశ్యమయ్యాడు. స్వామి ఆనతి ప్రకారం కావేరీ నదీ ఒడ్డున పడమటి దిక్కుగా ముందుకు నడిచిన గౌతమ మహర్షి స్వామి చెప్పిన ప్రాంతానికి చేరుకుని ఆశ్రమాన్ని నిర్మించుకుని పూజాదికాలు చేయసాగాడు. ఈలోపు గౌతమ మహర్షి ఆశ్రమానికి అత్రి, బోధాయనుడు, యాజ్ఞవల్క్యుడు, కణ్వ మహర్షి, శుకు డు, పరాశరుడు వేంచేయగా, వారికి అతిథి సత్కారాలను చేసిన గౌతము డు, శ్రీరంగనాథుని మహిమలను సవివరంగా వివరించాడు.

గౌతముడు చెప్పిన స్వామిలీలలను విన్న మహర్షులు పరమానందభరితులై, ఆయన నేతృత్వంలో శ్రీరంగనాథుని కరుణకోసం ఓ యాగాన్ని చేసారు. వారు చేసి న యాగానికి ప్రసన్నుడైన స్వామివారు ప్రత్యక్షమై, ఆ యాగస్థలానికి దగ్గ ర్లోనున్న చీమలపుట్టలో తాను శిలారూపంలోనున్నట్లు తెలిపాడు. మును లు అక్కడకు చేరుకోగా, అప్పటికే ఆ ప్రాంతానికి దేవతలు, కామధేనువు చేరుకున్నారు. అందరూ స్వామి నామస్మరణను చేస్తుండగా, కామధేనువు చీమలపుట్ట వద్దకు వెళ్ళి పాలను ధారగా కురిపించింది.
అంతా బాగానే ఉంది. కానీ, శ్రీరంగనాథుని పాదాల చెంత కావేరి నదీ మాత ఉండటం ఏమిటి? అని కొంత మంది అడుగవచ్చు. దీని వెనుక ఓ ఉదంతం ఉంది.

కావేరి నదీ మాత ఒకసారి శ్రీరంగపట్టణంలో రంగనాథుని వేడుకుంటూ తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె తపస్సును మెచ్చి స్వామి వారు మూడు వరాలను అనుగ్రహించారు. మొదటి వరం ప్రకారం, కావేరి నది గంగా నది కంటే పుణ్యప్రదమైనదిగా భావించబడుతుంది. రెండవ వరం ప్రకా రం, ఆ నంది ఒడ్డున శ్రీరంగపట్నం గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగొందు తుంది. మూడవ వరం ప్రకారం, తానే అక్కడ వెలిసి, భక్తులను అనుగ్రహి స్తానని చెప్పాడు. ఆయన సేవలో తన జన్మను ధన్యం చేసుకోవాలనుకున్న కావేరి మాత, ఆయన పాదాల దగ్గరే కూర్చుండిపోయింది.

sri1ఆ విధంగా రంగనాథుని పాదాల వద్ద కావేరిని దర్శించుకుంటున్నాం. గంగానదీ తీరం లో మూడు రోజులు పాటు, యమునా నదీ తీరంలో ఐదురోజుల పాటు వసించి స్నానం చేస్తే లభించే పుణ్యఫలం, కావేరీ నదిలో ఒకే ఒక్కసారి స్నానం చేస్తే లభిస్తుందని ప్రతీతి. అసలు కావేరి నది పైనుంచి వీచే గాలే, మన శరీరాలకు తాకితే చాలు.. పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.ఇలా కావేరి నదీ తీరానున్న ఈ శ్రీరంగ పట్టణానికి చెందిన మహిమలను చెప్పుకుంటూ పోవచ్చు. ఒకసారి గంధర్వ రాజులైన చంద్రసేనుడు, సిద్ధిర దుడు ఇంద్రుని భార్యయైన శచీదేవి పట్ట మోహావేశాఏనికి గురై, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించబోయారు. ఈ సంగతిని గ్రహించిన ఇంద్రుడు వారిని రాక్షసులుగా మారమని శపించాడు.

వారు శ్రీరంగపట్నానికి వచ్చి, అక్కడ కావేరి నదిలో స్నానం చేసి, స్వామిని దర్శించుకోగానే శాపవిము క్తులయ్యారని కథనం. ఇక్కడ స్వామి వారు అవతరించి గౌతమ మహర్షి స్వామివారిని పూజించిన రోజునే ఇప్పటికీ ‘శ్రీరంగ జయంతి’ అంటూ వైభ వోపేతంగా జరుపుతున్నారు. అప్పుడు స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతారు. ఈ శ్రీరంగపట్టణాన్ని కావేరి నది చుట్టి ఉండటం వలన, ఇదొక దీవిలా గోచరిస్తుంటుంది. ఈ పట్టణంలో ఇంకా లక్ష్మీ నరసింభస్వా మి వారి ఆలయం, జ్యోతిర్మయ స్వామి వారి ఆలయం, గంగాధరేశ్వరుని ఆలయం అంటూ పలు ఆలయాలున్నాయి.

ఒకసారి తిరుమల రాయలవారికి వీపుపై రాచపుండు లేచి విపరీతంగా బాధించసాగింది. ఎన్ని రకాలైన వైద్యాలు చేసినప్పటికీ ఫలితం కనిపించ లేదు. బాధను తట్టుకోలేక పోయిన రాయలు, ఆలయ పనుల నుంచి తప్పు కుని మైసూరు మహారాజు శ్రీరాజ ఉడైయారుకు ఆ బాధ్యతను అప్పగించా రు. తలైక్కాడు అనే ప్రదేశంలో కొలువైయున్న వైదీశ్వరుని మొక్కితే ఫలితం ఉంటుందని ఎవరో చెప్పగా, ఆ స్వామి దర్శనానికి వెళ్ళిన తిరుమల రాయలు తిరిగిరాలేదు. ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయాయి. ఇక్కడ శ్రీరంగపట్టణంలో వున్న తిరుమలరాయల భార్య అలమేలమ్మ, భర్త చనిపోయిన తర్వాత కూడ అమ్మవారికి అలంకారాలు చేయడం మానుకోలేదు. ఒకసారి ఈ విషయాన్ని చూసిన రాజు, ఆ నగల న్నింటినీ అలమేలమ్మ దగ్గర్నుంచి తీసుకుని, రాజలాంఛనాలతో అమ్మవారి కి అలంకారాలు చేయించమన్నాడు.

sri3ఈ రాజాజ్ఞ అలమేలమ్మకు రుచించక పోవడంతో నగలతో తలైక్కాడుకు బయలుదేరింది. భటులు ఆమెను వెం బడించారు. ఆ రాజ భటులకు చిక్కకూడదన్న ఉద్దేశంతో అలమేలమ్మ నగలతో పాటు కావేరి నదిలోకి దూకింది. ఆమె అలా కావేరిలో దూకుతు న్నప్పుడు ఆ ప్రాంతమంతా ఎడారిగా మారిపోవాలని శపించింది. కొన్నాళ్ళ తర్వాత ఆమె శాపం ఫలించింది. ఆ ప్రాంతమంతా బీటలువారి పోయింది. ఆమె శాపం గురించి విన్న రాజు వ్యధ చెంది, అలమేలమ్మ మనసు శాం తించేందుకు అంతఃపురంలో ఆమె శిలను ప్రతిష్ఠించి పూజించడం ప్రారం భించాడు.

మైసూరు ప్రాంతాన్ని పరిపాలించిన ముస్లిం పరిపాలకులలో హైదర్‌ ఆలీ, అతని కుమారుడు టిప్పుసుల్తాన్‌లు శ్రీరంగనాథస్వామి పట్ల భక్తిభావంతో ఉండేవారు. ఒకసారి మైసూరు రాజ్యంపైకి శత్రువులు దండెత్తి వచ్చి నప్పుడు, హైదర్‌ఆలీ ఎదరుదాడికి బయలుదేరాడు, తన బలం కంటే శత్రువుల బలం అధికమని తెలిసిన తదనంతరం అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే రంగనాథుని ధ్యానించాడు. వెంటనే గోదావరి ఒక్క సారిగా ఉప్పొంగడంతో శత్రుసేనలు వెనక్కి తగ్గాయి. హైదర్‌ఆలీ శ్రీరంగప ట్టణానికి వచ్చి రంగనాథునికి కృతజ్ఞతా సూచకంగా మొక్కి, మరలా ఎక్కువ సైనంతో వెళ్లి శత్రుసేనలను తరమగొట్టాడని చెబుతారు.
శ్రీరంగపట్టణంలో ప్రతి సంవత్సరం ‘గోదావరోత్సవము’ అనే ఉత్సవం జరుపబడుతుంటుంది. ఈ ఉత్సవానికి హైదర్‌ఆలీ తన రాణులతో సహా వచ్చేవాడట.శ్రీరంగపట్టణం మైసూరు పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి మైసూరు నుంచి విరివిగా బస్సు సౌక ర్యాలు ఉన్నాయి. శ్రీరంగపట్టణ క్షేత్ర దర్శనం జీవితంలో ఓ మరపురాని అనుభూ తిగా మిగిలిపోతుం దన్నది నిజం.

మైసూరు ప్రాంతాన్ని పరిపాలించిన పలు రాజవంశాల వారు శ్రీరంగపట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించారు. ఫలితంగా ఈ పట్టణంలోని ఆలయాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందాయి. రంగనాథ ఆలయం క్రీ.శ. 817వ సంవత్సరంలో ఒక దాసీ చేత నిర్మింతమైందని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో అధ్వాన్నస్థితికి చేరుకున్న కట్టడాలు పునర్నిర్మితమయ్యాయి. తిరుమలరాయలవారి పర్యవేక్షణలో రంగనాథుని ఆలయ పనులు సక్రమంగా నిర్వహించబడ్డాయి. లోపలి ప్రాకారం, సింహద్వారానికి మెట్లు, ద్వారానికి రెండు పక్కలా ఏనుగులు అంటూ తిరుమలరాయలు ఆలయాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. తిరుమల రాయలవారి భార్య రంగనాథస్వామి వారి భక్తురాలు. ఆమె రంగనాయకి అమ్మ వారికి సేవలు చేస్తూ సంతోషపడుతుండేది. అమ్మవారికి ముక్కుపుడకలు, చెవులకు కమ్మలు అంటూ ప్రత్యేకంగా చేయించి అలంకరించి సంతోషపడుతుండేది.

sriఫలితంగా చీమలపుట్ట కరిగిపోయి, స్వామివారు శిలారూపంలో ప్రత్యక్షమయ్యాడు. శ్రీరంగనాథుడు శేషపాన్పుపై పవళించి, కుడిచేయిని తలక్రింద పెట్టుకుని, ఎడమ చేయిని చాచి పెట్టుకుని, హృదయభాగంలో మహాలక్ష్మీతో, ఆయన పాదాల వద్ద కావేరి నదీమాత కూర్చుని ఉండగా, చీర్నగవులు చిందిస్తూ దర్శనమిచ్చాడు. రంగనాథుడు అక్కడున్న సమస్త దేవతలు, ఋషిపుంగవులతో, ‘ఇకపై ఈ క్షేత్రం గౌతమ క్షేత్రమని, ఆలయ విమానం బ్రహ్మానంద విమానమని పిలువబడుతుంది’ని చెప్పి మాయమయ్యాడు. అదే, నేడు కర్నాటక రాష్ట్రంలో శ్రీరంగపట్టణంగా ప్రసిద్ధి కెక్కిన పుణ్యక్షేత్రం.

హైదర్‌ఆలీ తదనంతరం ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్‌ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఆంగ్లేయులను ఎదిరించి నాలుగుసార్లు యుద్ధాలు చేసిన టిప్పు సుల్తాన్‌, మూడవ యుద్ధ సమయంలో ఆంగ్లేయులతో సామరస్య పూర్వకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ఒకసారి టిప్పుసుల్తాన్‌ కుమారులను యుద్ధఖైదీలుగా పట్టుకున్న ఆంగ్లేయులు, టిప్పు సుల్తాన్‌ను సగం రాజ్యాన్ని, నగలు, మూడు కోట్ల నగదుని ఇమ్మని అడిగారు. టిప్పు సుల్తాన్‌ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో నగలను అమ్మి డబ్బు ఇచ్చాడని చరిత్ర చెబుతోంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top