You Are Here: Home » చిన్నారి » తెలుసా...!! » హెయిర్‌ స్టైల్‌తో మీ వ్యక్తిత్వం

హెయిర్‌ స్టైల్‌తో మీ వ్యక్తిత్వం

హెయిర్‌ స్టైల్‌తో మీ వ్యక్తిత్వం

 

చాలామంది మహిళలు డ్రెస్సింగ్‌ స్టైల్‌పై చూపే శ్రద్ధ తమ హెయిర్‌స్టైల్‌పై చూపరు. దీంతో వీరు ఎంత విలువైన దుస్తులు ధరించినా ఎక్కడో లోటు కనపడుతుంటుంది. అదే హెయిర్‌ స్టైల్‌పై ప్రత్యేకదృష్టి సారిస్తే మరింత అందంగా ఉంటారు. అంతేకాదు హెయిర్‌స్టైల్‌తో పర్సనాలిటీ కూడా పెరుగుతుందని ఒక పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు.
haఎవరింటికైనా, ఏదై నా ఫంక్షన్‌ లేదా ఎక్కడి కైనా వెళ్లేటప్పుడు మీ డ్రెస్సింగ్‌స్టైల్‌పై చూ పే శ్రద్ధతో పాటు హెయిర్‌స్టైల్‌పై కూడా చూపిస్తే మరింత అం దంగా కనపడతారని బ్యూటీ ఎక్స్‌పర్ట్‌లు అంటున్నారు. విలువై న, అందమై న దుస్తులు ధరించినా మీ హెయిర్‌స్టైల్‌ సరిగా లేకపోతే వాటికి విలువ పోతుందట. దీంతోపాటు మీ అందం కూడా కాస్తా తగ్గుతుందని వారంటున్నారు. మీ హెయిర్‌స్టైల్‌ మీ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుందనడంలో సందే హం లేదంటున్నారు బ్యూటీషియన్లు.
బాలికలు, మహిళల హెయిర్‌స్టైల్‌లో చాలా తే డా లుంటాయి.

హెయిర్‌స్టైల్‌ వయసుకు తగ్గ ట్టు, మీరు ధరించే దుస్తులకు తగ్గట్టుండాలి. దీ నికిగాను మహిళల హెయిర్‌స్టైల్‌ వారి వ్యక్తిత్వా లకున్న అనుబంధాలను తెలిపేందుకు యేల్‌ యూనివర్సిటీ చెందిన పలువురు పరిశోధకు లు ఓ సర్వే నిర్వహించారు. తల వెంట్రుకలు పొట్టిగా ఉన్న మహిళల్లో ఆత్మ విశ్వాసం మెం డుగా ఉంటుందని, అదే పొడవైన వెంట్రు లు న్న మహిళలు స్మార్ట్‌గా ఉండేందుకు ఇష్ట పడ తారని తమ పరిశోధనల్లో తేలినట్లు పరిశో దకులు తెలిపారు.

హెయిర్‌స్టైల్‌ అనేది వాతావరణాన్ని బట్టి మార్చా ల్సి ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలంలో వె ంట్రుకలను ముడి వేయకుండా గాలికి వదిలేస్తే మీరు మీ వ్యక్తిత్వంలో నిలకడలేనివారిగా, న లుగురిలో తక్కువగా చూడబడతారట. ప్రస్తు తం మళ్లీ పొడవాటి వెంట్రుకల ఫ్యాషన్‌ వచ్చిం ది. మీ ముఖం గుండ్రని ముఖమైతే పొడవాటి వెంట్రులపై దృష్టి సారిం చండి. వీటిని ముడి వేయకండి. అదే కోలముఖం కలిగిన వా రైతే మీ పొడవైన వెంట్రుకలను సగానికి ముడివేసి మిగిలిన భాగాన్ని వదిలి వేయండి. దీంతో మీ వ్యక్తిత్వం, అందం మరింత ద్విగుణీకృత మౌతుందంటున్నారు పరిశోధకులు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top