You Are Here: Home » ఇతర » హెచ్‌పి నుండి విండోస్‌8 ల్యాప్‌టాప్‌లు

హెచ్‌పి నుండి విండోస్‌8 ల్యాప్‌టాప్‌లు

ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ హెచ్‌పి సరికొత్త విండోస్‌8 ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఎన్వీ ఎక్స్‌2 హైబ్రిడ్‌, ఎన్నీ టచ్‌స్మార్ట్‌ ఆల్ట్రాబుక్‌4, ఎన్వీ 23 ఏఐవో శ్రేణిలలో మూడు సరికొత్త గాడ్జెట్‌లను ఇండియాలో విడుదల చేసింది. ఇవి గురువారం నుంటి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా ఇలా ఉన్నాయి.
హెచ్‌పి ఎన్నీ ఎక్స్‌2 హైబ్రీడ్‌ పీసీ
windowsఈ డివైజ్‌ను ట్యాబ్లెట్‌ అలానే ల్యాప్‌టాప్‌లా ఉపయోగించు కోవచ్చు. ఇంటెల్‌ ఆటమ్‌ డ్యూయల్‌ కోర్‌ జడ్‌ 2760 ప్రాసె సర్‌, 2జీబి ఎల్‌పీడీడీఆర్‌2 మెమరీ, 64జీబి ఈఎమ్‌ఎమ్‌సీఎన్‌ ఏఎన్‌డి ప్లాష్‌ డ్రైవ్‌ (ఎస్‌డిహెచ్‌సీ కార్డ్‌), 11.6 అంగుళాల డిస్‌ప్లే, హెచ్‌డిఎమ్‌ఐపోర్ట్‌, యూఎస్బీ పోర్ట్‌‌స2 1080 ఫిక్సల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, 8 మెగా ఫిక్సల్‌ రేర్‌ కెమెరా ఉన్న ఈ హైబ్రీడ్‌ పీసీ బరువు 1.39 కిలోగ్రాములు (కీబోర్డ్‌ డాక్‌తో), 690 గ్రాములు (ట్యాబ్లెట్‌).
హెచ్‌పి ఎన్వీటచ్‌ స్మార్ట్‌ ఆల్ట్రాబుక్‌4
window-3ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌, 4జీబి ర్యామ్‌, 500జీబి హార్డ్‌డిస్క్‌ డ్రైవ్‌, 32జీబి ఎస్‌ఎస్‌డి, ఇంటెల్‌ హైడెఫినిషన్‌ 4000 గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, 14 అంగుళాల డిస్‌ప్లే, యూఎస్బీ 3.0 పోర్ట్‌‌స రెండు, యూఎస్బీ 2.0 పోర్ట్‌ ఒకటి, హెచ్‌డిఎమ్‌ఐ అవుట్‌, 720 పిక్సల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ బరువు 2.11 కిలో గ్రాములు.

హెచ్‌పి ఎన్వీ 23 ఏఐవో
ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌, 4జీబి ర్యామ్‌, 1 టాబ్‌ హార్డ్‌డిస్క్‌ డ్రైవ్‌, ఎన్‌విడియా జీటి 630ఎమ్‌ గ్రాఫిక్స్‌ కార్డ్‌, 2జీబి డెడికేటెడ్‌ గ్రాఫిక్‌ మెమెరీ, 23 అంగుళాల స్క్రీన్‌, యూఎస్బీ 3.0 పోర్ట్‌‌స రెండు, యూఎస్బీ 2.0 పోర్స్‌‌ట నాలుగు, హెచ్‌డిఎమ్‌ఐ అవుట్‌ ఉన్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top