You Are Here: Home » సినిమా » పాటలు » హృదయాంజలి (1998)- మానసవీణ మౌన స్వరానా

హృదయాంజలి (1998)- మానసవీణ మౌన స్వరానా

పల్లవి :
మానసవీణ మౌన స్వరానా
ఝుమ్మని పాడే తొలి భూపాళం

పచ్చదనాలా పానుపు పైన
అమై్మ నేలా జో కొడుతుంటే (2)

చరణం : 1
పున్నమి నదిలో విహరించాలి
పువ్వుల ఒళ్లో పులకించాలి
పావురమల్లే పెకైగరాలి
తొలకరిజల్లై దిగిరావాలి
తారల పొదరింట రాతిరి మజిలీ
వేకువ వెనువెంట నేలకి తరలీ
కొత్త స్వేచ్ఛకందించాలి నా హృదయాంజలీ

వాగునా నేస్తం చేలరేగే వేగమే ఇష్టం అలలాగే
నింగికి నిత్యం ఎదురేగే పంతమే
ఎపుడూ నా సొంతం ॥

చరణం : 2
ఊహకు నీవే ఊపిరి పోసి
చూపవే దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకెల వేసి
కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి
దోసెడు ఊసులు తీసుకు వెళ్లి
పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలీ
॥॥

చిత్రం : హృదయాంజలి (1998)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : కె.ఎస్.చిత్ర, బృందం

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top