You Are Here: Home » ఇతర » హియా’లో జ్యుయలరీ ఎగ్జిబిషన్‌

హియా’లో జ్యుయలరీ ఎగ్జిబిషన్‌

Jeaబంగారం ధర ఎంత పెరుగుతున్నప్పటికీ మగువలకు మాత్రం వెరైటీ డిజైన్లతో సరికొత్త ఆభరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. జ్యుయలరీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో కొత్త డిజన్లను అందించేందుకు ప్రముఖ డిజైనర్‌ శ్వేతారెడ్డి జ్యుయలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌ సోమాజిగుడలోని హియా స్టోర్‌లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అరవింద్‌ చిత్ర ఫేమ్‌ నటి పలోని చక్రవర్తి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హియా డిజైనర్స్‌ నిర్వాహకురాలు శ్వేతారెడ్డి మాట్లాడుతూ టెంపుల్‌, కుందన్‌, డైమండ్‌, బ్రైడల్‌ జ్యుయలరీని ఈ దీపావళి కోసం ప్రత్యేకంగా అందిస్తున్నట్లు చెప్పారు. సోమాజిగుడ కపాడియా లేన్‌లో ఉన్న నెస్ట్‌ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నెంబర్‌ 302లో ఈ ప్రదర్శన అందుబాటులో ఉందని వెల్లడించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top