హిప్పోపొటమస్
హిప్పోపొటమస్లు అంటే ఏంటో మీకు తెలుసా..? పెద్ద పెద్ద ఆకారాలతో ఉండే నీటి గుర్రాలనే హిప్పోపొటమస్ లు అంటారు. ఇవి ఆఫ్రికా దేశానికి చెందిన ఉభయచర జీవులు. అంటే నీటిలోనూ, భూమిపైన నివసించగలిగే జంతువులన్నమాట…! ఈ హిప్పోపొటమస్లు రాక్షసాకారంతో, చూడగానే మనం భయప డేటట్లుగా ఉంటాయి. ఇవి ఎక్కువకాలం నీటిలోనే గడుపు తాయి. కేవలం ఒక ముక్కు మాత్రమే బయటకు కనిపించేలా ఉంచుకుని ఇవి నీటిలో గంటలు, గంటలు అలా తేలుతూనే గడిపేస్తాయి. అయితే… చూసేందుకు భయపెట్టేలా ఉన్నప్పటికీ ఇవి శాకాహారం మాత్రమే తీసుకుంటాయి. కాకపోతే…
ఎప్పుడూ నీటిలో ఉండే హిప్పోపొట మస్లు రాత్రిపూట నీటినుంచి బయటకు వచ్చి పచ్చికను మేస్తాయి. మగ హిప్పోపొట మస్లు దాదాపు నాలుగు టన్నుల బరువు ఉంటాయి. భారీ శరీరం కలిగినప్పటికీ వీటి కాళ్ళు చాలా పొట్టిగా ఉంటాయి. వీటి సహాయంతో అవి సునాయాసంగా నీటిలో ఈదుతూ ఉండిపోతాయి. హిప్పోపొటమస్లు నీటిలోనే పిల్లలను కంటాయి కూడా. అన్నింటికంటే విశేషం ఏంటంటే… వీటి పిల్లలు నడక నేర్వడం కంటే ముందుగా… నీటిలో ఈదటాన్ని నేర్చుకుంటాయట..!