You Are Here: Home » విశేషం » హాలీవుడ్ ఐరన్‌ లేడీస్‌

హాలీవుడ్ ఐరన్‌ లేడీస్‌

హాలీవుడ్ ఐరన్‌ లేడీస్‌

 

ఒక గొప్ప వ్యక్తి జీవితం అనేక మందికి ప్రేరణగా నిలుస్తుంది. వారి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనుంటుంది. వారి గతం, ఉన్నత స్థారుుకి చేరుకోవడానికి వారెదుర్కొన్న సాధక బాధకాల గురించి తెలుసుకోవాలనుంటుంది. వారి ఆత్మకథను చదివి దృశ్యాలను ఊహించవచ్చు. కానీ వారి జీవితగాథను తెరపైనే చూడాలనుకునే వారు అనేకులు. అలాంటి వారి కలనే నెరవేర్చారు మెరిల్‌స్ట్రీప్‌,జూలియా రాబర్ట్స్‌, హెలెన్‌, మిర్రెన్‌లు. ప్రముఖుల జీవిత కథాంశంతో వచ్చిన చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు ఆస్కార్‌ అవార్డులను కూడా సాధించారు వీరు. వ్యక్తుల జీవితకథల ఆధారంగా చిత్రాలు వస్తున్న సందర్భంలో ధీర ప్రత్యేక కథనం.

మిరిల్‌స్ట్రీప్‌
qwఈ సంవత్సరానికి గాను అస్కార్‌ అవార్డును సాధించిన నటి మెరిల్‌ స్ట్రీప్‌. ఈ సారి ‘ద ఐరన్‌ లేడీ’ చిత్రానికి గాను నామినేషన్లు పొందారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినా మెరిల్‌ నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలో ఆమె యూకేకు చెందిన మాజీ ప్రధాన మంత్రి గా మార్గరెట్‌ థాచర్‌గా నటిచారు. పలువురు రాజకీయ నాయకుల హావభావాలు, ప్రవర్తనను క్షుణ్ణంగా పరిశీలించారట మెరిల్‌. ఈ పాత్రను ఆమె ఎంతో హుందాగా చేశారని హాలీవుడ్‌ ప్రేక్షకులు అభినందించారు. లండన్‌, న్యూయార్క్‌, నేషనల్‌ సొసైటీతో.. ఇలా పలు క్రియేటిక్‌ క్టిటిక్స్‌ అవార్డులు అందుకున్నారు. ఇదే పాత్రకుగాను ఆమెను మరికొన్ని అవార్డులు వరించాయి. ఇంకొన్ని ప్రతిష్టాత్మక అవార్డ్స్‌లో నామినేషన్‌ సంపాదించుకున్నారు
రికార్డు స్థాయిలో నామినేషన్‌
హాలీవుడ్‌ రికార్డ్‌ స్థాయిలో ఆస్కార్‌ నామినేషన్లు పొందిన తార మిరిల్‌స్ట్రీప్‌. మొత్తం 17 సార్లు ఆమె నామినేషన్‌ సాధించగా, ఒకసారి ఉత్తమ సహాయ నటిగా, మరోసారి ఉత్తమ నటిగా ఆస్కార్‌ సొంతం చేసుకున్నారు.

జూలియా రాబర్ట్స్‌
erఒక ప్రభుత్వ సంస్థ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా కార్యకలా పాలు సాగిస్తున్నప్పుడు చాలా మంది మౌనాభరణాన్ని ధరిస్తారు. కానీ అమెరికాకు చెందిన ఎరిన్‌ బ్రోకోవిచ్‌ మాత్రం అలా మౌనంగా ఉండలేదు. అమెరికా పశ్చిమ తీర ప్రాంతం లోని పాసిఫిక్‌ గ్యాస్‌ అండ్‌ ఎలెక్ట్రికల్‌ కంపెనీ కార్యకలాపాల కు వ్యతిరేకంగా పోరాడి. ప్రజామద్దతుతో మార్పుకు కృషి చేసింది. ఎరిన్‌ జీవితథ ఆధారంగా తెరకెక్కిన ఎరిన్‌ బ్రోకో విచ్‌ చిత్రంలో జూలియా నటించి అస్కార్‌ సాధించారు.
కెరీర్‌
హాలీవుడ్‌ రొమాంటిక్‌ క్వీన్‌గా ప్రఖ్యాతి చెందిన నటి జూలియా రాబర్ట్స్‌. రిచర్డ్‌ గేర్‌ కథానాయకుడిగా వచ్చిన ప్రిటివుమెన్‌ (1990) చిత్రంలో జూలియా నటనతో, అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. 1989లో వచ్చిన ‘స్టీల్‌ మాగ్నోలియాస్‌’ చిత్రానికి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతో పాటు, ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. అయితే ‘ఎరిన్‌ బ్రోక్‌విచ్‌’(2000) చిత్రానికి గాను అకాడమీ అవార్డును సొం తం చేసుకున్నారు. హాలీవడ్‌లోనే కమిర్షియల్‌గా అత్యంత విజయవంతమైన నటిగా రికార్దును సొంతం చేసుకున్నారు.

సాల్మా
uiకోయాకాన్‌ ప్రాంతంలో తన చిత్రకళతో కళాభిమానులను అలరించిన మహిళా పెయింటర్‌ ఫ్రిదా కాహ్లో. ప్రతి కళాకారుడి జీవితంలో పైపైన కనిపించే మెరుగుల కన్నా.. లోలోపల దాగున్న బాధలు అనేకం ఉంటాయి. వాటిని తమ కళద్వారా వెలువరిస్తారు వారు . ఫ్రిదా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని మంచి కళాకారిణిగా గుర్తింపు సాధించారు. ఆమె జీవితగాథను జూలియా టేమోర్‌ ఫ్రిదాగా చిత్రీరించారు. ఇందులో ప్రముఖ హాలీవుడ్‌ కథానాయిక సాల్మా ెహక్‌ ఫ్రిదా పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి గాను ఆమె అస్కా ర్‌ అవార్డును సాధించారు. ఫ్రిదా పాత్రలో సాల్మా ఇట్టే ఇమిడి పోయింది. సందర్భోచితంగా, పాత్రౌచితంగా నటించి అటు సినీ అభిమానులను, ఇటు కళాప్రేమికులను అలరించింది.
కెరీర్‌
సాల్మా మెక్సికోకు చెందిన సాల్మా 1993లో మి విదా లోకా అనే చిత్రంతో హాలీవుడ్‌ కథానాయికగా కెరీర్‌ ప్రారంభిం చింది. వైల్డ్‌ వైల్డ్‌ వెస్ట్‌, వన్స్‌ అపాన్‌ అ టైమ్‌ ఇన్‌ ముంబై చిత్రాలలో నటించి మెప్పించింది.

హెలెన్‌ మిర్రెన్‌
tyఒక దేశ మహారాణి జీవితం ప్రజలకు తెలియని రహస్యం గా ఉంటుంది. అందంగా కనిపించే రాణివాసంలో.. నిజంగా మహారాణి అంత సంతోషంగా ఉంటుందా ? మామూలు మనుషులకు ఉండే బాధలు మహారాణుకు కూడా ఉంటాయా? ప్రేమ, అనురాగం, ఆప్యాయత వంటి భావాలకు వారు కూడా చలిస్తారా అనేది చాలా మందికి వచ్చే సమాధానం. వారి సందేహాలు ది క్వీన్‌ అనే చిత్రం తీర్చింది. బ్రిటన్‌ మహారాణి రెండవ ఎలిజబెత్‌ ప్రస్థానం ది క్వీన్‌ అనే చిత్రంలో తెరకెక్కించారు దర్శకుడు స్టిఫెన్‌ ప్రియర్స్‌. ఈ చిత్రంలో హెలెన్‌ మిర్రెన్‌ మహారాణి పాత్రలో కనిపించింది. ప్రిన్సెస్‌ వేల్స్‌లో యువరాణి డయానా ప్రమాదంలో మరణిం చిన తరువాత ఎలిజబెత్‌-2 జీవితంలో చోటు చేసుకునే అంశాలను ఇందులో చూపించాడు దర్శకుడు.
కెరీర్‌
1967లో వచ్చిన హెరోస్ట్రాటస్‌ చిత్రంతో కెరీర్‌ ప్రారంభించిన హెలెన్‌ తన సినీ జీవితంలో అనేక చిత్రాలలో నటించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఆమె మంచి పాపులారిటీని సంపాదించారు. ది క్వీన్‌ చిత్రానికి గాను ఆమె ఆస్కార్‌ అవార్డును సాధించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top