You Are Here: Home » ఇతర » హక్కులు దక్కుతున్నాయా?

హక్కులు దక్కుతున్నాయా?

ప్రతి మనిషి మనిషిగా జీవించడానికి కొన్ని హక్కులు ఉండాలి. అందులో జాతి, భాష, కుల, మతాలకతీతంగా మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండడమే ప్రధాన ఉద్దేశ్యం. ఆ హక్కులు ఉన్నందునే మనం బతుకుతున్నాం. ఏ పనులైన మనకున్న మానవ హక్కులకు లోబడి చేయగలుగు తున్నాం. ఈ హక్కులు మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడతారుు. ఏ వ్యక్తులైనా మనపై దాడిచేసి, హింసించడం వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తారుు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు సుఖంగా, కలిసి మెలిసి జీవించడానికి ఈ హక్కులు ఉపయోగ పడుతున్నారుు. మనకు మెుత్తం 30 ఆర్టికల్స్‌ ఉన్నారుు. డిసెంబర్‌ 10 1948లో ఐక్య రాజ్యసమితి ఈ హక్కులను మానవాళికి ‘ప్రపంచ మానవ హక్కుల ప్రకటన’ ద్వారా అందించింది. ఐక్యరాజ్యసమితిలోని 192 సభ్య దేశాలు ఈ హక్కులకు కట్టుబడి ఉన్నారుు. అన్ని దేశాలు డిసెంబర్‌ 10న మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారుు. మానవ హక్కులు ప్రకటించి ఈ రోజుతో 64 సంవత్సరాలు నిండుతారుు. మానవ హక్కుల గురించి అవ గాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో చైతన్యం తీసుకువస్తారుు. మన మానవ హక్కులకు భంగం కలిగిం చకూడదనుకుంటే మన ఇతరుల హక్కుల పట్ల కూడా అంతే బాధ్యతతో మెలగాలి. మన దేశంలో 1993లో మానవ హక్కులకమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రాలలో రాష్ర్ట కమిషన్‌లు పనిచేస్తున్నారుు.

Untiaప్రస్తుతం ప్రపంచంలో, మానవ హక్కులకి తీవ్రమైన సమస్యగా పరిణమిస్తున్నవి పేదరికం. దారిద్య్ర నివారణ, నిరుపేదల సముద్దరణ, ఏ ఒక్కరి ఔదార్యానికి పరిమితమైన అంశం కాదు. సకల జీవరాసులలో అత్యుత్త మంగా అందరూ భావించే మానవ జాతి మౌలికమైన హక్కులని కూడా హరిస్తున్నాం. ఈ సమాజంలో ఇంకా బానిసత్వం, దమనకాండ కొనసాగుతున్నాయి. ఎందరో మహనీయులు మానవ హక్కుల పరిరక్షణ కోసం, తమ జీవితాలనే అంకితం చేశారు. వారి సంస్మరణతో పాటు మానవ హక్కుల మననం కోసం ఐక్యరాజ్య సమితి సాధారణ సభ రూపొందించిన రోజే మానవ హక్కుల దినోత్సవంగా ప్రతిసంవత్సరం డిసెంబర్‌ 10న ప్రపంచమంతా జరుపుకుంటోంది.

ఆమోదం
మానవ హక్కులను రక్షించేందుకు, మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అమెరికా 1945 నుండి ప్రయత్ని స్తోంది. ఆ దేశ జనరల్‌ అసెంబ్లీ అధికార ప్రకటనలను గౌరవించే ఉద్దేశ్యంతో 1948 డిసెంబర్‌ 10వ తేదీని డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రెైట్స్‌గా నిర్ణయించారు. మరి రెండేళ్ల తరువాత 1950 డిసెంబర్‌ 4న జరిగిన 317 జనరల్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మానవ హక్కుల దినోత్సవానికి సాధారణ ప్రణాళిక రచించి అమలు జరిపారు. ఆ రోజున అన్ని రాష్ట్రాల అధికార ప్రతినిధులనూ ఆహ్నాంచడమే కాకుండా ఆసక్తి ఉన్న సంస్థలు ఈ రోజున మానవ హక్కుల దినోత్సవం జరిపినట్లయితే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని జనరల్‌ అసెంబ్లీ సూచించింది.

హక్కులు దక్కుతున్నాయా?
ప్రతి మనిషికీ దక్కవలసిన హక్కులు దక్కుతున్నాయా?…. హక్కులు పరిరక్షించేందుకు మనమంతా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామా? మన హక్కులను కాపాడుకోగ లుగుతున్నామా? అంతా అనుకున్నట్లే జరిగితే అనుకోవాల్సిం దింకేముంది? అలా జరగడం లేదు కనుకనే కోట్లాదిమంది అశాఞతితో, అభద్రతాభావంతో తల్లడిల్లిపోతున్నారు. కనుక మాన హక్కుల దినోత్సవం అనేది పుట్టుకొచ్చింది. దీన్ని న్యూయార్క్‌ నగరంలో డిసెంబర్‌10ని హైలెైట్‌ చేసి మరీ కనిపి స్తుంది. 2006లో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించు కుని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం సలిపారు. నిజంగా తిండి, బట్ట, గూడు లాంటి కనీస అవసరాలు తీరకపోవడం ఎంత విషాదం? పేదరికాన్ని రూపుమాపాలని మేధావులు తీర్మానించారు. 2008లో ఇదే రోజున యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రెైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది.

కీలక అంశాలు
awwనేరస్థులను, నిందితులను విచారించే సమయంలో థర్డ్‌ డిగ్రీ టార్చర్‌ విధానాలు ఉపయోగించి, మానవ జాతి గౌరవాన్ని కించ పరిచే పోలీసు యంత్రాంగం మీద ‘ఫేక్‌ ఎన్‌కౌంటర్స్‌’కి అమా యక ప్రజలని సైతం బలిచేసే రక్షకభటుల మీద మర్డర్‌ కేసులు పెట్టడం. క్రూరమైన, కఠినమైన చర్యలకి పాల్పడే వ్యక్తులని పోలీస్‌ సర్వీస్‌లనుంచి తొలిగించి, వారికి గ్రాడ్యుటీ, పెన్షన్‌ వం టి సౌకర్యాలు ఇవ్వకుండా చేయడం, ఎన్‌కౌంటర్స్‌లో మరణిం చిన వారి కుటుంబాలకు తగినంత నష్టపరిహారం ఇవ్వడం, బల వంతంగా నిందుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, వాళ్లని థర్డ్‌ డిగ్రీ టార్చర్‌కి గురి చేసిన సంఘటలని మళ్ళీ సమిక్ష జరపడం లాంటివి ఉన్నాయి.

పుస్తకాలకే పరిమితం
ఇలాంటివి షల్ఫ్‌లోని పుస్తకాలకే పరిమితమవుతున్నాయి. నానా టికీ దేశంలో కూడా కుటుంబ హింసలు, భ్రూణ హత్యలూ, మానభంగాలు, పట్టపగలే అత్యాచారాలు, రౌడీషీటర్స్‌ పాశవిక ప్రవృత్తులు కొనసాగుతూ, మన సమాజాన్ని నేర వ్యవహారాల తో కలుషిత చేస్తున్నది అందరం చూస్తూనే ఉన్నాం.

మానవ హక్కులు
HRaaమనుష్యూలు అందరికీ సమాన హక్కులు, గౌరవం ఉంటాయి. జాతి,వర్ణం, లింగం, మతం, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఎటువంటి వివక్ష వంటి ఏ విధమైన భేద భావాలు లేకుండా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రత కలిగి ఉన్నాయి. బానిసలుగా పట్టుకోవడం, చ్త్రిహింసలు చేయకుండా ఉండటం, చట్టపరంగా అందరికీ గుర్తింపు, చట్టం దృష్టిలో అందరూ సమానంగా ఉండేలా చూడటం, కారణం లేకుండా నిర్భంధించడం, పక్షపాత రహిత విచారణ, నేరస్తులుగా అనుమానిస్తున్నా…నిందితులని తేలే వరకూ నిరపరాధులే.

ఏకాంతంగా జీవించే హక్కు, స్వేచ్ఛగా తన రాష్ర్టంలో, సొంత దేశం లేదా విదేశాలలో తిరిగే హక్కు నివసిం చే హక్కు జాతీయత హక్కు, వివాహం, కుటుంబం ఏర్పాటు చేసుకునే హక్కు, వ్యక్తిగతంగా, ఇతరులతో కలిసి సంయుక్తంగా ఆస్తిని పొందే హక్కు, మతస్వేచ్ఛ, భావస్వాతం్త్ర్య హక్కు, శాంతియుతంగా బహిరంగ సమావేశం, సభను ఏర్పాటు చేయడం, సంస్థలో చేరమని బలవంతపెట్టకూడదు.

ప్రజాస్వామ్యం హక్కు, పౌరలందరికీ ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండే హక్కు, సాంఘిక భద్రత హక్కు, పనిచేసే హక్కు, కార్మికుల హక్కులు, ఆడుకునే హక్కు, కుటుంబంలో అందరూ ఆరోగ్యంతో జీవించడం, ఆహారం, నీడ, విద్య హక్కు, కాపీరెైట్‌ హక్కు, మానవ హక్కులను ప్రకటించిన విధంగా అమలు చేయడం, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం, సమాజం పట్ల బాధ్యతలు, ప్రకటించిన మానవ హక్కులను ఏ రూపంలోనెైనా కాలరాచే అధికారం ఎవరికీ లేదు. మన హక్కులు, మన పక్కవారి హక్కులు రక్షించుకుందాం.

మన దేశంలో…
ప్రజాస్వామ్యబద్దమైన మనదేశంలోని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కూడా మానవ హక్కుల పరిరక్షణ కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మానవ హక్కుల విషయంలో ఆచరణలో పెట్టి, అమలు చేస్తున్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top