You Are Here: Home » ఇతర » స్వాతంత్య్ర భారత తొలి గవర్నర్‌ జనరల్‌ రాజాజీ

స్వాతంత్య్ర భారత తొలి గవర్నర్‌ జనరల్‌ రాజాజీ

rajajరాజగోపాలాచారి అంటే ఎవరికైనా తెలియకపోవచ్చు. కానీ ‘రాజాజీ’ అంటే తెలియనివారు దాదాపుగా ఉండరు. స్వతం్త్ర భారతదేశానికి తొలి గవర్నర్‌ జనరల్‌గా చక్రవర్తుల రాజగోపాలాచారి బాధ్యతలు నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ అందించిన సమర్థవంతమైన నాయకులలో రాజాజీ ఒకరు.

హోసూర్‌ తాలుకాలోని తొరాపల్లిలో 1878లో ఇదే రోజున చక్రవ ర్తుల అయ్యంగార్‌, సింగారమ్మ దంపతులకు రాజగోపాలాచారి జన్మించారు. మద్రాస్‌ నగరంలో గ్రాడ్యుయేషన్‌, లా పూర్తి చేసిన తరు వాత, పాలెంలో 1900 సంవత్సరం నుంచి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. దాదాపుగా రాజాజీగారు వాధించిన కేసులన్నీ గెలవడంతో ఆయన పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయాయి. రాజాజీ 1919వ సంవత్సరంలో గాంధీజిని కలవడం కుదిరింది. తరువాతి కాలంలో వారి మధ్య సాన్ని హిత్యం పెరిగి, దక్షిణాది నాయకుల్లో గాంధీజీ అమితంగా అభిమా నించి ఆదరించే నాయకునిగా రాజాజీని పరిగణించే స్థాయికి చేరింది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో దక్షిణాదికి సంబంధించి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారిలో, పలు ఉద్యమాలకు సమర్థవంతంగా నాయకత్వం వహించిన రాజాజీ, ఆ కారణంగానే పలుసార్లు జైలు శి ను అనుభవించారు.

1923వ సంవత్సరంలో ‘జెండా సత్యాగ్రహం’ ను సమర్థంగా నిర్వహించిన రాజాజీ ఉప్పు సత్యాగ్రహం సమయంలో తిరుచ్చి నుండి వేదారణ్యం వరకూ దాదాపు 150 మైళ్ళ దూరం 98 మంది సత్యాగ్రహిలతో కలసి పాదయాత్ర జరిపారు. హిందూముస్లిం మధ్య విభేదాలు తొలగించడానికి రాజాజీ చాలా కృషి చేశారు. ఆ కృషి కారణంగానే రాజాజీ స్వతంత్ర భారతదేశంలోని పశ్చిమ బెంగా ల్‌కు గవర్నర్‌గా నియమించబడ్డారు.

రాజాజీ అత్యంత సరళమైన భాషలో, సులువుగా అందరికీ అర్థమయ్యే తరహాలో రచించిన రాజాజీ మహాభారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత, మన సంస్కృతి వంటి పలు రచనలు పలువురు మేథావుల, విమర్శకుల ప్రశంసలు పొంది సామాన్య జనంలో కూడా ఆదరణ పొందాయి. లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ పదవీకాలం పూర్తయిన తర్వాత, స్వతంత్య్ర భారతదేశానికి తొలిగవర్న్‌ర్‌ జనరల్‌గా రాజాజీ బాధ్యతలు స్వీకరిం చారు. తనకు లభించిన ప్రతి అవకాశాన్ని దేశసేవకే వినియోగించిన రాజాజీ 1972లో పరమపదించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top