You Are Here: Home » ఇతర » స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ప్రధాత బకిం చంద్ర చటర్జీ

స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ప్రధాత బకిం చంద్ర చటర్జీ

ప్రొఫైల్‌

పూర్తి పేరు  : బకిం చంద్ర చటర్జీ
పుట్టిన తేది :1838 జూన్‌ 27
జస్మస్థలం :హైవతీ
విద్యాభ్యాసం : కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి
వృత్తి : కవి, రచయిత, వ్యాసకర్త, పాత్రికేయుడు
విశేషం : బెంగాలీ సాహిత్యం
కీర్తి : వందేమాతరం గీత కర్త
ఇతర రచనలు: ఆనందమఠ్‌

సాహిత్యంలో సరికొత్త ఒరవడి
flag1838 జూన్‌ 27న బెంగాల్‌లోని హైవతీలో జన్మించిన బకించంద్రకు చిన్న నాటి నుంచే సాహిత్యమంటే ఆసక్తి ఉండేది. భారత జాతి విదేశీయులు కబంధ హస్తాలలో ఉన్న సమయంలో దేశాన్ని సమైక్యపరిచి జాతి విముక్తి కలిగించడానికి ఆయన రచయి తగా, కవిగా, పాత్రీకేయుడిగా వివిధ బాధ్యతలను చేపట్టాడు. బెంగాలీ భాషలో ఆయన రచించి ఆనందమఠ్‌ అనే రచనలో ఆయన రాసిన వందే మాతరం గీతం ఉద్యమగీతంగా, తరువాత జాతీయ గీతంగా ఆవీర్భవించింది. ఆయన రచించిన 13 రచనలను ఇతర భాషల్లోకి కూడా అనువాదం చేశారు. బెంగాలీ సాహిత్యానికి సరికొత్త భాష్యం పలికి, కొత్త ఒరవడిని సృష్టించిన వ్యక్తిగా కూడా ఆయనను సాహిత్యకారులు కీర్తిస్తుంటారు. ఆయన రాసిన నవలల్లో, వ్యాసాలు, వ్యాఖ్యాలు అనాదిగా వస్తున్న మూస రచనా విధానాన్ని దాటి రచయితలకు సరికొత్త ప్రేరణనందించాయి.

బాల్యం- విద్యాభ్యాసం :
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బకిం చంద్ర కలకత్తాలోని ప్రెసిడెన్సీ, హూగ్లీ కళాశాలలో ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పట్టా సాధించిన తొలితరం వ్యక్తుల్లో ఆయన ఒకరు. విద్యాభ్యాసం పూర్తయ్యాక 1858 నుంచి 1891 మధ్యలో పదవీ విరమణ అయ్యేంత వరకు బ్రిటిష్‌ ప్రభుత్వం కోసం డిప్యూటి మెజిస్ట్రేట్‌, డిప్యూటి కలెక్టర్‌గా పనిచేశారు. వందేమాతరం పత్రి భారతీయుల్లో దేశ భక్తిని రగిలించేందుకు, ఉద్యమ స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 1906లో వందే మాతరం అనే పత్రికను ప్రారంభించారు. అనంతరం ఆ పత్రికను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోదుడు లాలా లజపతి రాయ్‌ కొనసాగించారు.

వందే మాతరం గీతం
వందే మాతరం- వందే మాతరం
సుజలాం సుఫలాం -మలయజ శీతలాం.
సస్యశ్యామలాం- మాతరం వందే
శుభ్రజ్రోత్స్నా పులకిత యామినీం
పుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుదాం వరదాం మాతరం వందే
భావం : భారత మాతకు వందనం. తియ్యని నీటితో కమ్మని పండ్లతో చల్లని గాలులతో పచ్చని పైరులతో విలసిల్లే భరతమాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నలలో పులకిస్తూ విరబూసిన చెట్లతో మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలనిచ్చే భరతమాతకు వందనం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top