You Are Here: Home » సినిమా » పాటలు » స్వర్ణకమలం (1988)- అందెల రవమిది పదములదా ఆ…

స్వర్ణకమలం (1988)- అందెల రవమిది పదములదా ఆ…

ఆలాపన :
గురుబ్రహ్మ ఆ… గురుర్విష్ణుః ఆ…
గురుదేవో ఆ… మహేశ్వరః ఆ…
గురు సాక్షాత్పరబ్రహ్మ (2)
తస్మైశ్రీ గురవేనమః
ఓం నమో నమో నమఃశివాయ
మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ
గంగయా తరంగితోత్తమాంగతే నమఃశివాయ
ఓం నమో నమో నమఃశివాయ
శూలినే నమో నమః కపాలినే నమఃశివాయ
పాలినే విరంచి తుండ మాలినే నమఃశివాయ
పల్లవి : అందెల రవమిది పదములదా ఆ… (2)
అంబరమంటిన హృదయముదా…॥
అమృత గానమిది పెదవులదా
అమితానందపు ఎద సడిదా…
సాగిన సాధన సార్థకమందగ
యోగ బలముగా యాగ ఫలముగా (2)
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా
అందెల రవమిది పదములదా ఆ…

చరణం : 1
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై ॥
మేను హర్ష వర్ష మేఘమై… ఆ…
వేణి విసురు వాయు వేగమై… ఆ..
అంగ భంగిమలు గంగపొంగులై
హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే రీల రసఝరులు జాలువారేలా
జంగమమై జడమాడగా
జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసరించిన
పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా ఆ…

చరణం : 2
నయన తేజమే… ‘న’కారమై ఆ…
మనో నిశ్చయం… ‘మ’కారమై ఆ…
శ్వాస చలనమే… ‘శి’కారమై ఆ…
వాంఛితార్థమే… ‘వ’ కారమై ఆ…
యోచన సకలము… ‘య’ కారమై ఆ…
నాదం ‘న’కారం మంత్రం ‘మ’కారం
స్తోత్రం ‘శి’కారం వేదం ‘వ’కారం
యజ్ఞం ‘య’కారం ఓం నమఃశ్శివాయ…
భావమె భవునకు భావ్యము కాగా
భరతమె నిరతము భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళా
ప్రాణ పంచకమె పంచాక్షరిగా
పరమపదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకిణులై
పది దిక్కుల ధూర్జటి ఆర్భటిరేగా ॥

చిత్రం : స్వర్ణకమలం (1988)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, వాణీజయరాం, బృందం

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top