You Are Here: Home » దైవత్వం » స్వధర్మం – పరదర్మం

స్వధర్మం – పరదర్మం

2శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేస్తున్నప్పుడు ‘ధర్మపూరితమైన పరధర్మం కంటే, అధర్మపూరితమైన స్వధర్మమే మేలు’ అని చెబుతాడు. దీనిని కొంత మంది, శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ స్వార్తపూరితులుగా ఉండమంటున్నాడా ఏమిటి? అని నొసలు ఎగరేస్తుంటారు. అలా అన్నా రంటే వారు గీతను సరిగా అర్థం చేసుకోలేదన్న మాటే! ఇలాంటి అపోహను తొలగించడానికే, గీతో పదేశ సందర్భంలోనే శ్రీకృష్ణపరమాత్మ ఇందుకైన వివరణను ఇచ్చాడు. తను ఉంటున్న సమాజం అను సరిస్తున్న ధర్మం, మనకు గుణం లేనిదిగా కనబడినా, అది స్వభావం చేత కలిగిన కర్మ కాబట్టి ఎటువంటి పాపం అంటదు. స్వభావం వల్ల కలిగిన కర్మను దోషం కలిగినదైనప్పటికీ, విడిచి పెట్టకూడదు.

లోకం దృష్టిలో దోషం ఉన్నట్లుగా కనిపించినా, అది ఒట్టి భ్రమ తప్ప దోషం కాదు. జీవహింస పాపమే అయి నప్పటికీ, దానిని జీవనోపాధిగా గల వేటగానికి అది తప్పు కాదు. కౌశికుడనే బ్రాహ్మణుడు ఎన్నో వేదాలు, తపస్సులు చేసినవాడు. తల్లిదండ్రుల సేవలో తన జన్మను పునీతం చేసుకుంటున్నవాడు. అయితే, అత నికి కలగని ధర్మజ్ఞానం తన స్వధర్మమై మాంసాన్ని విక్రయిస్తూ ఉన్న ధర్మవ్యాధునికి కలిగింది. పొగ ఉన్నదని అగ్నిలో హోమం చేయడం వంటి పనులను ఎలా వదిలేయడం లేదో, అలాగే ఇతరులకు పాపపు కర్మ అనిపించినప్పటికీ మన స్వధర్మాన్ని వదలకూడదనేది శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన సత్యం.
ఇలా గీతలో జీవితానికి ఉపయుక్తమయిన విషయాలెన్నో ఉన్నాయి. ఆ అమృతసారాన్ని ఆస్వాదించుదాం.
-జి. రాణి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top