You Are Here: Home » ఇతర » స్లిమ్ కంప్యూటింగ్‌

స్లిమ్ కంప్యూటింగ్‌

ఆపిల్‌ ఇండియా, ఐఫోన్‌5ను ఈనెల 26న దేశీయ విపణిలో ఆవిష్కరించ నుంది. నవంబర్‌ మొదటి వారం నుంచి విక్ర యాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైలర్‌ ఇన్ఫీబీమ్‌ ఐఫోన్‌5 ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానిస్తుంది.

పాంటెల్‌ టెక్నాలజీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ప్రభు త్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ ఎల్‌) భాగస్వామ్యంతో సరికొత్త టాబ్లెట్‌ పీసీని దేశీయ విపణిలో ఆవిష్కరించింది. టాబ్లె ట్‌ పేరు ‘‘పెంటా టీ’’ ప్యాడ్‌ డబ్ల్యూఎస్‌702సీ, దీని ధర మాత్రం రూ.7,499లు. 3డీ వ్యవస్థను డివైజ్‌ సపోర్ట్‌ చేస్తుంది. 2జీ వాయిస్‌ కాలింగ్‌ నిర్వహించుకోవచ్చు. డాంగిల్‌ సపోర్ట్‌తో 3జీ సేవలను పొందవచ్చు.

BSNLవైఫై సపోర్ట్‌ మరో ప్రత్యేకత. దీంట్లో 7 అంగుళాల మల్టీటచ్‌ కెపాసిటివ్‌ టచ్‌స్క్రీన్‌, ఆండ్రాయిడ్‌ 4.0.3 ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 1.2 గిగాహెడ్జ్‌ కార్టెక్స్‌ ఏ8 ప్రాసెసర్‌, మాలీ 400 గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూని ట్‌, 1జీబి డీడీఆర్‌ 3 ర్యామ్‌, 8జీబి ఇంటర్నల్‌ మెమెరీ, మైక్రీఎస్డీ కార్డ్‌స్లాట్‌ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగిం చుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్‌ రేర్‌ కెమెరా, వీజీఏ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియో జాక్‌, మల్టీ ఫార్మాట్‌ ఆడియో ఇంకా వీడియో ప్లేయర్‌, ఈబు క్‌ రీడర్‌, 2జీ సిమ్‌కార్డ్‌ స్లాట్‌, 3జీ కనెక్టువిటీ వయూ డాంగిల్‌, వైఫై 802.11 బిజిఎన్‌, యూఎస్బీ, మీనీ యూఎస్బీ, హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌, బ్యాటర్‌ బ్యాకప్‌ మాత్రం 6 గంటలు వస్తుంది.

పాంటెల్‌ టెక్నాలజీస్‌ అత్యుత్తమ కంప్యూటింగ్‌ టెక్నాల జీని ఈ తక్కువ ధర టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. 3డి యాక్సిలరేషన్‌ గ్రాఫిక్‌ వ్యవస్థతో మొట్టమొదటిగా విడుదలవుతున్న టాబ్లెట్‌ తమదేనని సింగ్‌ స్పష్టం చేశారు. ఈ పీసీ కొనుగోలుపై బీఎస్‌ఎన్‌ ఎల్‌ వివిధ డాటా ప్లాన్‌లను ఆఫర్‌ చేస్తోంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top