You Are Here: Home » ఇతర » స్లమ్ అండ్గ స్లిమ్

స్లమ్ అండ్గ స్లిమ్

లావుపాటి అమ్మాయిలు కొందరు రోజురోజుకీ లావైపోతున్నామన్న దిగులుతో కూర్చున్న చోటు నుంచి కదలకుండా ‘జీవితం ఏమిటీ..వెలుతురు చీకటి’ అంటూ విషాధ గీతాలు పాడుకుంటూ ఉంటారు. అయితే ఈ 25 ఏళ్ళ వయసున్న హారియత్‌ జెంకిన్స్‌ మాత్రం తన బరువు 165 కిలోలైపోయిందని కంగారుపడి లబోదిబోమనలేదు.

bit1aసన్నబడాలనుకునే వారి బృందంలో చేరి, అక్కడ వాళ్ళు చెప్పిన పనులన్నీ తూ..చా.. తప్పకుండా పట్టువిడవకుండా 18 నెలలపాటు చేసింది. క్రమక్రమంగా బరువు తగ్గుతూ ఇప్పుడు 73 కిలోలకి చేరు కుంది. అంటే, నెలలో 92 కిలోల బరువు తగ్గించుకుందన్న మాట. ఇది చాలా పెద్ద రికార్డే! 5’.8 అడుగుల పొడవున్న ఈ అమ్మాయికి 73 కిలోల బరువు సమంజసమే అని ఫిట్‌నెస్‌ నిపుణులు తేల్చి చెప్పారు. దానితో ఇంతకాలం తనకు అవరోధంగా ఉన్న బరువు సమస్య తీరి తను కోరుకున్న టీచర్‌ ఉద్యోగం దొరికింది. అంతేకాక ‘‘స్లిమ్మింగ్‌ వరల్డ్‌ వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌’ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు చలాకీగా చేసుకుపోతోంది. ఈ ఫోటోలు చూస్తే ఆ తేడా మీకే తెలుస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top