You Are Here: Home » ఇతర » స్ర్తీ జనోద్ధరణేక జీవితం అకింతం చోడగం అమ్మన్నరాజా

స్ర్తీ జనోద్ధరణేక జీవితం అకింతం చోడగం అమ్మన్నరాజా

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌చేంజిలో స్ర్తీల పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిం చేందుకు కృషిచేసిన స్వాతం్త్ర్య సమర యోధురాలు చోడగం అమ్మన్నరాజా. వీరు 1909 జూన్‌ 6వ తేదీన బందరులో గంధం వీరయ్య నాయుడు, నాగరత్నమ్మకు ఏడవ సంతానంగా జన్మించారు. కృష్ణాజిల్లా బోర్డుస్కూల్లో టీచరుగా పనిచేస్తున్న వీరయ్యగారికి నెలజీతం తప్ప ఏ సంపాదనా లేదు.

11 మంది సంతానం ఆయన ఆస్తి. కైకలూరువంటి మారుమూల ఉన్న ఊళ్లో ఉంటూ చదువుకోవటానికి ఆమెపడిన యిబ్బందులు అన్ని ఇన్నీ కావు. ఆడ పిల్లలకు హైస్కూలు లేదు. బందరులో స్కూలు ఉంటే హాస్టలులేదు. నానా ఇబ్బందులుపడి, రాజమండ్రి హైస్కూలులో చేరి, ట్రెయినింగు స్కూలు హాస్టలులో ఉంటూ స్కూలు ఫెైనల్‌ ముగించారు. కంచుమర్తి రామచంద్రారావు అనే సంపన్న గృహస్థు తమ కుమార్తె పేర ఇచ్చిన స్కాలర్‌షిప అందకపోతే తనచదువు సాగేదేకాదని, అందుకు కృతజ్ఞత కనపరుస్తారు ఆమె.

Chodaకళాశాల చదువులకు మద్రాసు వెళ్లారు. గవర్నమెంటువారి ఉపకారవేత నం లభించింది. మిస్‌డిలాహే అనే బ్రిటిష్‌ వనిత అపడు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆమె నిజంగా ఎంతగానో కనిపెట్టి ఉండేవారు. సమయానికి ఇంటివద్ద నుండి డబ్బురాకపోతే బిల్లులు అన్నీ సకాలానికి స్వయంగా చెల్లించి ఆమెను ఎవరూ చిన్నబుచ్చ కుండా ఆదుకునేవారు. 1932లో పట్ట భద్రురాలయి ఆ ఊళ్లోనే లేడీ విల్లింగ్‌టన్‌ ట్రెయినింగు కాలేజీలో ఎల్‌.టి. అయినారు. సికింద్రాబాదు ఆడపిల్లల స్కూలులో కొంతకాలం ఉద్యోగం చేసి న మీదట బాపట్లలో వెలగపూడి సుబ్బారావుగారు నెలకొల్పిన ట్రెయినింగు స్కూలులో హెడ్గ మిస్ట్రెస్‌గా చేరారు. ఆ సమయంలో మాంట్‌ఫోర్డు సంస్కరణ (సవరణ) ఫలితంగా దేశంలో ఎన్ని కలు జరుపవలసి వచ్చింది. అప్పట్లో మద్రాసు ప్రెసిడెన్సీలో ఇమిడి ఉన్న ఆంధ్రదేశం తరపున స్ర్తీలకు రెండు స్థానాలు ప్రత్యేకించారు.

ఒకటి ఏలూ రు, రెండవది బళ్లారి. మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ పార్టీ చేతులలో చిక్కు కున్నది. ఆ ప్రభావం ఏలూరులోకి కూడా వ్యాపించింది. అందువల్ల ఏలూ రు నియోజక వర్గానికి పోటీచేయడానికి పాత కాంగ్రెసు స్ర్తీలు ఎవరూ ముం దుకు రాలేదు. ఆ పరిస్థితులలో అమ్మన్న రాజాను కాంగ్రెసు అభ్యర్థినిగా నిలబెట్టడం జరిగింది. సరోజినీనాయుడు, భూలాభాయిదేశాయి వంటి నాయకులువచ్చి తీవ్రప్రచారం చేశారు. ఆమె గెల్చారు. లేజ స్లేటివ్‌ అసెంబ్లీ మెంబరు అయినారు. నిజానికి అప్పటివరకు ఆమె ఖాదీ అమ్మకం, హార్తాల్‌ జరపటాలు, సైమన్‌ కమిషన్‌ నిరసన ప్రదర్శనలలో పాల్గొనటం వంటి చిన్న చిన్న సంఘట నలలో పాల్గొనటంతప్ప తీవ్రంగా ఏనాడు రాజకీయాలలో పాల్గొనలేదు.

ఇంతలో రెండవ ప్రపంచ సంగ్రామం వచ్చిం ది. ఎటువంటి సంప్రదింపులు భారతదేశంతో జరపకుండానే బ్రిటిష్‌ ప్రభుత్వం మనదేశాన్ని యుద్ధరంగంలోకి ఈడ్చింది. అది అవమానంగా భావించింది కాంగ్రెసు. అందువల్ల 1939లో కాంగ్రెసు అభ్యర్థులెైన అసెంబ్లీ మెంబర్లందరూ రాజీనామా యిచ్చి బయకు వచ్చారు. వారిని అమ్మన్న రాజా అనుసరించారు. 1940 ఆగస్టు 27 న పొల్లాచిలో మునిసిపల్‌ ఇంజనీరుగా ఉంటున్న చోడగం జనార్థనరావుతో ఆమె వివాహం జరిగిం ది. గృహిణిగా పొల్లాచి వెళ్లారు. రెండునెలలు అయింది. బ్రిటిష్‌ ప్రభుత్వ నిరంకుశ విధానంపట్ల అసమ్మతి సూచకం గా వ్యష్టి సత్యాగ్రహం జరపమంటూ కాంగ్రెసునుంచి శ్రీము ఖం వచ్చింది. 1940 నవంబరులో స్వస్థలమైన కైకలూరులో సత్యాగ్రహం చేశారు. అనుకున్నంత అయింది. ఒక సంవ త్సరం కఠినశిక్ష, రూ.500 జరిమానాతో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమెను సత్కరించింది.

ఏ కట్నం కానుకలు స్వీకరించకపో యినా ఆమె భర్తగారు రూ.500 జరిమానా కట్టక తప్పలేదని బంధుమి్త్రులందరూ ఆమెను పరిహసించారు. రాయవేలూరు జెైలుకు చేరుకున్నారు. అదే సమయంలో ఆ జెైలులో రుక్మీణీ లక్షీ ్మపతి, రాధాబాయి సుబ్బరాయన్‌, కృష్ణాబాయి నీంబ్‌కర్‌, ఉప్పల మెల్లీ షోలింగరు అనే స్విస్‌ యువతి, బెజవాడ లక్ష్మీ కాంతమ్మ గోపాలరెడ్డి, వల్లభనేని సీతామహలక్ష ్మమ్మ, కుట్టి మాలు అమ్మగార్లవంటి సత్యాగ్రహం చేసిన స్ర్తీలు దాదాపు 80 మంది ఉన్నారు. ఒకసారి మద్రాసునుండి ఇన్‌స్పెక్టర్‌ జన రల్‌ జెైళ్ల తనిఖీచేయటానికి వచ్చారు. అపడు ఆమె ‘‘మేము సాధారణ నేరస్తులం కాదుకదా, కోరి మా దేశంకోసం జెైలుశిక్షను ఆహ్వానించి వచ్చాము. మీరు పొమ్మన్నా మేమే పారిపోబోము. అనవసరంగా ర్త్రాంతా తాళాలువేసి గదులలో బంధించడం ఎందుకని’’ ప్రశ్నించారు.

ఆయనకది సబబని నమ్మకం కలిగింది. వెంటనే ర్త్రాంతా గదులకు తాళాలువేసి బంధించనవసరం లేదని ఉత్తరువు జారీచేశారు. అంతటితో ఆ బాధ విరగడ అయిపోయింది. ఒక కొత్త సత్యాగ్రహి జెైలుకువచ్చినా, ఒకరు గడువుతీరివెళ్లిపోయినా అదొక పెద్ద హడావిడి. దాదాపు అందరూ విడుదల అయినారు. కాని సంవత్సరం శిక్షపడిన కారణంగా రుక్మిణి లక్షీ ్మపతి, కుట్టిమాలు అమ్మలతో ఈమె మిగిలిపోయినారు. అక్టోబరు 1941లో విడుదల అయినారు. 1946 లో ఎన్నికలు వచ్చినవి. కాంగ్రెసు అభ్యర్థినిగా ఆమె ఏలూరు నియోజక వర్గంనుంచి స్ర్తీల ప్రత్యేక స్థానానికి డాక్ట రు కొమఱ్ఱాజు అచ్చమాంబ గారి ప్రత్యర్థిగా పోటీచేశారు. గెలవటమేకాక ఈసారి ఆమె అసెంబ్లీకి డిప్యూటీ స్పీకరుగా కూడ ఎన్నికయినారు. 1952 వరకు ఆ హోదాలో ఉండి ఆంధ్ర స్ర్తీల సామర్థాన్ని వెల్లడించారు.

డాక్టరు ముత్తులక్షీ ్మరెడ్డి తోడ్పాటుతో ఆమె దేవదాసీ విధానాన్ని గర్హించుతు, ఆ విధాన నిర్మూలనకు ఒకచట్టం ప్రవేశపెట్టారు. ఎంతో సమర్థవంతంగా దానిని సాధించి డాక్టరు ముత్తులక్షీ ్మరెడ్డి గారి బహుకాల కృషిని సఫలం చేశారు. 1947 మద్రాసు దేవదాసీ విధానరద్దు బిల్లుగా అది చార్త్రిక ప్రఖ్యాతి పొందింది. మరి 11 సంవత్సరాలకు 1950లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వరదక్షణ నిరోధక చట్టం ప్రవేశపెట్టి సాధించారు.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top