You Are Here: Home » ఇతర » స్థిరాస్తి రంగం స్థిరం ఆసియా-పసిఫిక్‌లో పదో స్థానం

స్థిరాస్తి రంగం స్థిరం ఆసియా-పసిఫిక్‌లో పదో స్థానం

బెంగళూరు నగర పరిధి స్థిరాస్తిలో నమ్మకంగా మదుపు చేయవచ్చని మరోసారి తేలింది. నమ్మకమైన స్థిరాస్తి మదుపు విషయంలో ఆసియా – పసిఫిక్‌ పరిధిలో ఈ నగరం పదో స్థానాన్ని నిలబెట్టుకుంది. అర్బన్‌ ల్యాండ్‌ ఇనిస్టిట్యూట్‌తో కలిసి ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) సంస్థ ఆసియా – పసిఫిక్‌ పరిధి నగరాలలో స్థిరాస్తి రంగం తీరుతెన్నులను పరిశీలించింది. ఆయా నగరాలకు చెందిన మదుపరులు, వ్యాపారులు, స్థిరాస్తి రంగ సంస్థల ప్రతినిధులు, నాయకులు, బ్రోకర్లకు తోడు ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో నిపుణులయ్ని 360 మంది క్రోడీకరించిన తర్వాత నగరాలకు ర్యాంకులు ఇచ్చాయి.

Bangaaబెంగళూరు నగరం గల ఏడాది కూడా పదో స్థానంలోనే నిలవటం విశేషం. కనీస వసతులు, ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమల ద్వారా ఒనగూరుతోన్న ఆదాయాల కారణంగా బెంగళూరు నగరం స్థిరంగానూ, వేగం గానూ విస్తరించటంతో స్థిరాస్తి రంగం కూడా అదే తీరున నడుస్తోందని పీడబ్ల్యూసీ తన నివేదికలో అభిప్రాయ పడింది. మౌలిక సదుపాయాల కల్పనే బెంగళూరును స్థిరంగా అభివృద్ధి పథాన నడుపుతోంది. ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం, నమ్మ మెట్రో రైలు మార్గం, ఔటర్‌ రింగురోడ్డుకు సమీపంలోనూ స్థిరాస్తి కొనుగోళ్లు గణనీయంగా సాగుతున్న విషయాన్ని దీనికి ఉదాహర ణగా చూపుతున్నారు. అదే విధంగా రోడ్డు – రవాణా – విద్య – వైద్యం – వినోద కేంద్రాలు, చిల్లర దుకాణాలు అభివృద్ధి అయిన కనకపుర రోడ్డు, బన్నెర్‌ఘాట్‌ రోడ్డు, వైట్‌ ఫీల్డ్‌, దేవనహళ్లి, యశ్వంత్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో నివాస గృహాల కొనుగోళ్లు ఇతర ప్రాంతాలకన్నా పలు రెట్లు అధికంగా జరుగుతున్నాయి.

దిగజారిన ముంబాయి, ఢిల్లీ
స్థిరాస్తి రంగ వ్యవహారంలో బెంగళూరు నగరం తన పాత స్థానాన్ని నిలబెట్టుకోగా ముంబయి, ఢిల్లీ నగరాలు మాత్రం వాటి వాటి పాత స్థానాల నుంచి దిగజారాయి. గత ఏడాది ముంబయి మూడో స్థానంలోనూ, ఢిల్లీ ఐదో స్థానంలోనూ ఉండగా ఈ ఏడాది అవి వరుసగా 15 -12 స్థానాలకు దిగజారాయి. ద్రవ్యోల్బణం కారణంగానే ఈ నగరాలు తమ పాత స్థానాలను కోల్పోయినట్లు అంచనా వేశారు. ముంబయి నగరంలో నిర్మాణాలు ఏవీ ఖాళీగా లేకపోయినా అద్దెలు పెరగకపోవడంతో పాటు సకాలంలో వసూలు కాని సమస్య గణనీయంగా ఉన్నట్లు తేలింది. ఇక ఢిల్లీలో భవన నిర్మాణం నష్టదాయకంగా మారినట్లు లెక్కలు తెల్చి చెప్పాయి. అందువలన ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు భవనాల యజమానులు నిధుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు పరిశీలనలో వెల్లడయింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top