You Are Here: Home » ఇతర » స్త్రీ జీవితంలో ఆరు ముఖ్య దశలు

స్త్రీ జీవితంలో ఆరు ముఖ్య దశలు

3idiots త్రీ ఇడియట్స్‌ – అమీర్‌ ఖాన్‌
Untaప్రతి వ్యక్తిలో ఒక ఇడియట్‌ ఉంటాడు… మంచి పనులు చేసి ఈ ఇడియట్‌ ప్రపంచానికి ఆదర్శవంతమవు తాడని జాన్‌ లెనన్‌ అనే సంగీత కారుడంటాడు. త్రీ ఇడియట్స్‌ విషయంలో ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. ఈ చిత్రంలో అమీర్‌ ఖాన్‌ ప్రపంచానికి కావాల్సింది పుస్తకాల్లో నిక్షిప్తమైన అద్వితీయమైన జ్ఞానం కాదు.. బయటి ప్రపంచంలో బ్రతికేందుకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ కావాలనడంతో కాలేజ్‌ ప్రొఫెసర్‌ బోమన్‌ ఇరానీకి ఇడియ ట్‌లా కనిపిస్తాడు. ఈ పోటీ ప్రపంచంలో గుడ్డులోంచి పక్షి బయటికి రావాలన్నా చాలా కష్టమని.. ప్రపంచంతో పోటీపడి అందరిని ఓడించి నంబర్‌ వన్‌గా ఉండాలని చెప్పడంతో ఆమీర్‌ ఖాన్‌ దృష్టిలో ప్రొఫెసర్‌ ఇడియట్‌లా కనిపిస్తాడు.

నిజానికి ఇక్కడ ఈ రెండు పాత్రలు మనకు నేర్పే పాఠాలు అనేకం. ఒకరు విద్య వ్యవస్థ తీరు మారాలంటే .. మరొకరు పోటీలో పోరు కావాలంటారు. విజయం వెనక పరుగెత్త వద్దు.. (వి)జ్ఞానం వెనుక పరు గెత్తాలి. విజయం దానంతట అదే వరిస్తుందంటూ ముగిసే ఈ చిత్రం నేటికీ భారత చలన చిత్రం చరిత్రలోనే అత్యధికంగా కలెక్షన్‌ సాధించిన చిత్రం.

స్వాతి ముత్యం – కమల్‌హాసన్‌
sws1985కె. విశ్వనాథ్‌ కళా సృష్టికి కమల్‌హాసన్‌ నటన తోడై వెండితెరపై అద్భుతా కళాఖండంగా వచ్చిన చిత్రం స్వాతి ముత్యం. ఇందులో కమల్‌ ముత్యమంత స్వచ్ఛ మైన వ్యక్తి పాత్రలో కనిపిస్తాడు. ప్రపంచం పోకడ తెలియని అమాయకుడిగా.. అమ్మమ్మ మాటలే వేదంగా అనుకుంటాడు. చర్చ్‌లో ప్రేయర్‌ చేసినా, గుడిలో మొక్కినా, మసీద్‌లో నమాజు చేసి దేవుడిని దర్శించుకునేందుకు అవి మార్గాలని భావిస్తాడు. తాళికడితే రాధికా కష్టాలు పోతాయని తెలిసిన వెంటనే శ్రీరామనవమి రోజు కళ్యాణానికి తెచ్చిన తాళిని ఆమె మెడలో కడతాడు. ఆమె జీవితంలో మంచి రోజులో కాంక్షించే ఇలా చేస్తాడు. రాధికా కూడా అతడిని భర్తగా ఒప్పుకొని అతడిలోని అమాయకత్వాన్ని తొలగించి బాధ్యతాయుతంగా, తెలివిగా బ్రతకడం ఎలాగో నేర్పిస్తుంది. ఇక్కడ భార్య గురువు అవతారమెత్తి భర్తకు ప్రపంచంలో జీవించడం ఎలాగో నేర్పిస్తుంది. ముత్యాన్ని స్వాతి ముత్యంలా తీర్చిదిద్దుతుంది.B

తారే జమీన్‌పర్‌ – నందకిషోర్‌ …..
Uaaఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? బట్టీ విధానాన్ని పాటించాలా.. లేదా స్వేచ్ఛగా జ్ఞానాన్ని దరి చేరనివ్వాలా? అనే సందేహాలు తారే జమీన్‌పర్‌ అనే చిత్రంతో నివృత్తి అవుతాయి. ఎనిమిదేళ్ల ఇషాన్‌ నందకిషోర్‌ అవస్తికి మార్కులు సరిగ్గారావడం లేదని. తండ్రి హాస్టల్‌లో వేస్తాడు. ఎనిమిదేళ్ల పిల్లాడు తల్లి ఒడి నుంచి దూరంగా హాస్టల్‌లో తనతో ఏం జరుగతుందో అర్థం చేసుకోలేక మౌనంగా ఉంటాడు. ఇది గమనించిన ఆర్ట్‌ టీచర్‌ రామ్‌ శంకర్‌ నికుంబ్‌ (ఆమీర్‌ ఖాన్‌) ఇషాన్‌ డిస్లెక్సి యా అనే సమస్యతో బాధపడుతున్నాడని గమని స్తాడు. డిస్లెక్సియా ఉన్న పిల్లలు పదాలు, అక్షరాలు గుర్తుపట్టడం, వేగం అంచనా వేయడంలో సమస్యలను ఎదుర్కొంటారు.

ఇషాన్‌కు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి అతనిలో మార్పు తీసుకురావడంతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో మార్పు తీసుకు వస్తాడు నికుంబ్‌. విషయాలను అర్థం చేసుకోవడంలో ప్రతి విద్యార్థి వేగం ఒకేలా ఉండదు.. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలనేది తారే జమీన్‌ పర్‌ సారాంశం.

పా – అమితాబ్‌ బచ్చన్‌
బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు దేశంలోని వివిధ భాషల ప్రేక్షకులను హృదయాలను దోచుకున్న చిత్రం పా. ఇందులో ఔరా అనే పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ కని పిస్తాడు. ఔరాకు ప్రొగేరియా అనే అరుదైన వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు వయస్సుకన్నా పెద్దవారిగా కనిపిస్తారు. ఎక్కువ కాలం జీవించే అవకాశాలు తక్కువ. ఆ విషయం తెలిసినా సంతోషంగా బ్రతడానికి ఔరా చేసే ప్రయత్నం ప్రేక్షకులను ఆలోచించేలా చేశాయి. ఇంకా కొంతకాలమే జీవిస్తాననే విషయం తెలిసినా ఔరా అంత సంతోషంలో ఉండగలిగినప్పుడు..మనకు ఎదురయ్యే సమస్యలను దాటి మనమెంత సంతోషంగా ఉండాలి అని సగటు ప్రేక్షకుడు ఆలోచించాడు. ఔరా పాత్రలో కనిపించిన అమి తాబ్‌కు తండ్రిగా అభిషేక్‌ బచ్చన్‌ నటించాడు. మరణానికి చేరువౌతున్నా విడిపోయిన తన తల్లి దండ్రును కలిపేందుకు ఔరా ప్రయత్నం అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు.

సై – నితిన్‌
waaజయం చిత్రం నితిన్‌కు నటుడిగా గుర్తింపు తీసుకొచ్చినా స్టార్‌డమ్‌ను తీసుకొచ్చిన చిత్రం మాత్రం సై. బేస్‌బాల్‌ పోటీ వృత్తాంతంలో సాగే ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల.. నితిన్‌ ఉన్న టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తుంటాడు. తమ కాలేజీని రౌడీల చేతిలోకి వెళ్లనీయ కుండా ఉండాలంటే నితిన్‌ చదువుతున్న కళాశాల టీమ్‌ రౌడీలతో జరిగే మ్యాచ్‌ను గెలవాల్సిందే. కాలేజీలో బద్ధ శత్రువులుగా ఉండే రెండు గ్యాంగ్‌లను కలిపి ప్రాక్టీస్‌ చేయించడం నుంచి మ్యాచ్‌ గెలిచేంత వరకు రాజీవ్‌ కనకాల పడిన శ్రమ అంతా ఇంత కాదు. చివరికి హోరా హరు పోరులో విజయం హీరో టీమ్‌దే. ఇది సినిమా కథే అయినప్పటికీ ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుల్లో ఏదో సాధించాలనే తపనను కలిగించడంలో విజయం సాధించింది. నితిన్‌, రాజీవ్‌ కనకాల నటనకు పదికి పది మార్కులు పడ్డాయి.

ఇక్బాల్‌ – శ్రెయాస్‌ తల్పాడే
Un69
ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమ్‌ను గెలిపిస్తాడు. ఇక్బాల్‌ బౌలింగ్‌ను గమనించిన మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ (అతిథి పాత్ర) అతని చోటు జాతీయ జట్టులో అని నిర్ణయించుకుని భారత జట్టులో అవకాశం ఇస్తాడు. సంకల్పం ఉంటే వైకల్యాన్ని కూడా జయించవచ్చనే సందేశం ఇచ్చే ఇక్బాల్‌లు మనచుట్టూరా అనేకం ఉన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top