You Are Here: Home » ఇతర » స్ట్రోక్‌ ఎందుకొస్తుంది

స్ట్రోక్‌ ఎందుకొస్తుంది

ఆధునిక యుగంలో జీవనశైలి మార్పుతో స్థూలకాయం పెరగడంతో పాటు మధు మేహం, కొలెస్ట్రాల్‌, రక్తపోటు సమస్యలు కూడా పెరిగి బ్రెరుున్‌ స్ట్రోక్‌తో మరణాలు ఎక్కువున్నారుు . మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, ఎంబలిజం, రక్తనాళాలు చిట్లడం వల్ల బ్రెరుున్‌ స్ట్రోక్‌ వస్తుంది . బ్రెరుున్‌ స్ట్రోక్‌ ఎక్కువగా వయసు మళ్ళిన వారిలో అధికంగా వస్తుంది. బ్రెరుున్‌ స్ట్రోక్‌ కొంద రిలో పుట్టు కతోనే రక్తనాళాల్లోని ఎన్యూరిజం వంటి లోపం ఉండి, అవి పగలడం వల్ల ప్రమాదం వాటిల్లుతుంది.

Strokaసాధారణంగా మెదడులో సంభవించిన బరస్ట్‌, ఒక రక్తనాళ్లం లో కలిగిన అవరోధం. అలా అవరోధం కలిగినప్పుడు స్ట్రోక్‌ అని పిలువబడుతుంది. అకాల మరణాలకు కారణా లలో స్ట్రోక్‌ మరణం మూడవ ప్రధాన కారణంగా ఉంటుంది. దీనికి సత్వర చికిత్స అందించకుంటే మెదడులో కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. ఫలితంగా తీవ్రమైన వైకల్యం లేదా కొన్ని సందర్బాలలో మరణంసబంభవించవచ్చు. ఎరిథీమి యాన్‌ గుండె జబ్బు ఉన్న వాళ్ళలో కూడా బ్రెయన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాలు చిట్లడం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన వారిలో ప్రాణా పాయం కలుగుతుంది. మరికొందరిలో అతి తేలకపాటి బ్రెయిన్‌ స్ట్రోక్‌ పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ట్రాన్సియంట్‌ ఇష్కిమిక్‌ ఎటా క్‌ అనే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన వాళ్ళలో తాత్కాలికంగాకాలు, చేయి బలహీన మవ్వడం, మూతి వంకరపోవడం, మాట స్పష్టత లేక పోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం జరిగినప్పటికీ కొద్ది గంటల్లో తిరిగి పూర్తిగా కోలుకుంటారు. ఇటువంటి వారు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడానికి మూల కారణాన్ని గుర్తించి చికిత్స పొందకపోతే పూర్తి స్థాయిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి శాశ్వతంగా పక్షవాతంతో బాధపడే అవకాశం ఉంది. ఈ స్ట్రోక్‌ లక్షణాలు కలిగి ఉంటే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సదుపాయాన్ని తీసుకోవడం ఉత్తమం.

స్ట్రోక్‌ పరీక్షలు
స్ట్రోక్‌ అని అనుమాన కలిగినప్పుడు చిన్నపాటి పరీక్ష దీనిని నిర్థారించడానికి ఉపయోగపడుతుంది.
1. ముఖంపై చిరునవ్వుకు ప్రయత్నించటం. దీని ద్వారా ఒక వైపు ముఖంలో నువ్వు కనపడక శుష్కించుచూ ఉండటం.
2. రెండు చేతులు పైకి ఎత్తడం, ఒకవేళ ఒకవైపు చేయి పూర్తిగా పైకి లేవ లేక పోవటం.
3. ఒక వాక్యాన్ని చెప్పడం, ఈ ప్రయత్నంలో పదాలు సక్రమంగా పలకలేకపోవడం.
ఇందులో ఏ ఒక్క లక్షణం కనిపించినా, పరిస్థితి తీవ్రంగా ఉందని భావితీంచాలి.

స్ట్రోక్‌ సంభవించినప్పుడు ప్రతి సెకండ్గ సమయం చాలా విలువైనది. మెదడులో ఆక్సిజన్‌ క్షీణిస్తున్నపప్పుడు క్రమక్రమంగా కణాలు మరణించటం ఆరంభమవుతాయి. కణాల రక్తం గడ్డలను కరిగించేందుకు మందులు ఉన్నాయి. కానీ ఈ మందులు స్ట్రోక్‌ సంభవించిన 3 గంటల లోపు వాడాలి. ఒక్కసారి మెదడులో ఒక్క క్షణం మరణించినదో ఆ కణానికి సంబంధించిన అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. దీనితో దీర్ఘకాలిక
అంగవైకల్యం సంభవించే అవకాశం ఉంది. స్ట్రోక్‌ లక్షణాలు రెండు విధాలుగా ఉంటాయి. వీటికి ఒకే విధంగా చికిత్స అందించలేరు. సిటిస్కాన్‌ ద్వారా

Strokeస్ట్రోక్‌ రక్తనాళాలు బ్లాక్‌ అవటం వలన లేదా రక్తనాళాలు చిట్లడం వలన సంభవించిందా అనేది కనుగొన వచ్చు. ఇతర పరీక్షల ద్వారా ఈ డామేజ్‌ శరీరంలో ఏ ప్రాంతంలో జరిగింది అనేది గుర్తించవచ్చు.అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, మధుమేహ వ్యాధి, స్థూలకాయం, ధూమ పానం, వ్యాయామం చేయకపోవడం, మద్యం సేవించటం, ఉప్పును అధికంగా తినడం వల్ల రక్తపోటు పెరగడం. కొన్ని కారణాలు స్ట్రోక్‌ రావడాన్ని నివారించలేవు. వీటిలో వయస్సు మీదపడటం, వంశపారం పర్యంగా అలాగే పురుషూలలో ఎక్కువగా స్ట్రోక్‌ కలిగే అవకాశం ఉంది. స్ట్రోక్‌ వచ్చిన 3 గంటలలోపు రక్త సరఫరాను పురుద్దరించేందుకు తగిన వైద్య సదుపాయాలు కలిగించటం ద్వారా మరణాన్ని నివారించవచ్చు.

స్ట్రోక్‌ నివారణకు ధూమపానాన్ని ఆపేయడం, సాధ్యమైనంత వరకూ కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం, ఉప్పు వాడకం తగ్గించాలి. వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. మధుమేహాన్ని, రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలి. మద్యానికి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. వైద్యులు సూచించిన ప్రకారం మందులు తీసుకుంటూ, సూచనలు పాటిస్తూ ఉంటే స్ట్రోక్‌ను నివారించవచ్చు.

స్ట్రోక్‌ లక్షణాలు
Untita

1. అకస్మాత్తుగా ఒకవైపు శరీరం మొద్దుబారుట లేదా శరీరంలో బలహీనత ఏర్పడుట. 
2. అకస్మాత్తుగా కంటి చూపు ఒకవైపుగాని, లేదా రెండు కళ్ళలోగాని సన్నగిల్లుట.
3. ఆహారం లేదా మరేదైనా మింగటంలో బాధ కలుగుట.
4. ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి సంభవించుట.
5. ఆకస్మికంగా గందరగోళం లేదా ఇతరుల మాటలను అర్థం చేసుకోలేకపోవడం.

డాక్టర్‌ నవీన్‌ కుమార్‌,
న్యూరాలజిస్ట్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డీకాపూల్‌
హైదరాబాద్‌, సెల్‌ నెం.92472 59479

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top