You Are Here: Home » ఇతర » స్ట్రాబెర్రీతో సొగసు

స్ట్రాబెర్రీతో సొగసు

ఎర్రని రంగులో చిరు పులుపుతో నోరూరించే స్ట్రాబెర్రీలను అప్పుడప్పుడు తినడానికి మాత్రమే కాకుండా, సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. స్ట్రాబెర్రీల్లో ఉండే అల్ఫాహైడ్రాక్సీ యాసిడ్‌ మృతకణాల్ని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

 

  • ఓ స్ట్రాబెర్రీని తీసుకుని మధ్యకు కోసి ఓ ముక్కను ముఖానికి రుద్దుకొని, కాసేపయ్యాక కడిగేస్తే మృత చర్మం తొలగి నిగారించే చర్మం మీ సొంతమ వుతుంది.
  • తేనే, పాలక్రీం నాలుగు టేబుల్‌ స్పూన్ల చొప్పున తీసుకుని ఒక స్ట్రాబెర్రీని గుజ్జుగా చేసి అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పూతలా వేసుకొని పది నిమిషాలయ్యాక కడిగేసుకుంటే చర్మం ఎంతో మృదువుగా మారుతుంది.
  • స్లైసుల్లా తరిగిన స్ట్రాబెర్రీలను కొన్ని తీసుకుని అం దులో ఒక టేబుల్‌స్పూన్‌ క్రీం కలిపి, ఆ ముఖానికి రాసుకుని పదినిమిషాలయ్యాక ముఖం కాంతివం తమవుతుంది.
  • దంతాలపై పడే టీ, కాఫీ మరకల్ని తొలగించేం దుకు ఒక స్ట్రాబెర్రీని తీసుకుని గుజ్జులా చేసి దం తాలపై రుద్దుకోవాలి.
  • ఎనిమిది తాజా స్ట్రాబెర్రీలను తీసుకుని గుజ్జులా చేసి దానికి టేబుల్‌ స్పూను మయోనైజ్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి షవర్‌క్యాప్‌ పెట్టు కోవాలి. పది నిమిషాలయ్యాక షాంపుతో తలస్నా నం చేసుకొంటే కురులు పట్టుకుచ్చులా అందంగా కనిపిస్తాయి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top