You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » సౌశీల్య

సౌశీల్య

సౌశీల్య


సౌశీల్యప్రహ్లాదుని శీలాన్ని దానంగా గ్రహించిన ఇంద్రు డు వెనుదిరగగానే తన శరీరము నుండి దివ్య మైన తేజస్సు రూపంలో బయటకు వెళ్తున్న ఆకా రాన్ని చూచి ప్రహ్లాదుడు నివ్వెరపడి నువ్వెవరివి అని అడిగితే ‘రాజా! నేను నీ శీలాన్ని! ఆ వేద పండితునికి నన్ను దానమిచ్చిన కారణాన అతని దగ్గరకు తరలిపోతున్నా’నని చెబుతుంది. వెను వెంటనే లక్ష్మీదేవి కూడా ప్రత్యక్షమై ‘నేను కూడా వెళ్ళిపోతున్నా’నని చెబుతుంది. ఎందుకు తల్లీ అని ప్రహ్లాదుడు అడిగితే… ‘రాజా! ఇంతకాలం శీలం కలిగి ఉన్నందువల్లనే నేను నీవద్ద ఉన్నాను. శీలాన్ని దానమివ్వడం వలన, శీలహితుడవైన నీ వద్ద ఉండలే’నని ఖచ్చితంగా చెప్పి వెళ్ళి పోతుం ది. అప్పటికీ శీలం విలువ ఏమిటో ప్రహ్లాదునికి అవగతమై ఆశ్చర్యపోతాడు.

శీలము యొక్క వైశిష్ట్యతను మహాకవి వేమన అద్భుతంగా విశ్లేషిస్తాడు. శీలాన్ని మించిన సిరు లు, సంపదలు లేవు. శీలాన్ని జయించగలిన అధునాతన ఆణ్వాయుధాలైన ‘క్షిప ణులు’ తయారు చేయబడలేవు. నరుని శీలమొకటే నరుల లో శ్రేష్ఠతముని చేస్తుందని వేమన చెబుతాడు. మంగళకర మైన వస్తువుల సంపర్కం, చిత్త వృత్తి నిరోధము, శాస్త్ర అధ్య యనము, ఆర్జవము, సత్పురుషుల నిత్యదర్శనం శీల సంప దను పెంపొందించి అభ్యుదయమును కలుగ చేస్తుంటాయని విదురుడంటాడు. కన్యాదాన సమయంలో వరునితో వధువు తండ్రి ఇలా చెబుతూ ఎంతో సంతోషంలో, ఆత్మవిశ్వాసంతో తన కుమార్తె సుగుణాలన్ని వర్ణిస్తూ కన్యాదానం చేస్తాడు.

‘నా కుమార్తె సర్వాలంకార శోభిత, సాధ్వి, సుశీల! దయార్థ హృదయంతో పతినే దైవంగా భావించే పతివ్రత. క్షమ, అం తరంగ శుద్ధి, స్థిరచిత్తంగల సుశీల! ఈమెను ధర్మార్థకామా లనే మూడు పురుషార్థాలు సిద్ధించుకోవడానికి నియమపూ ర్వకంగా, ఈ బుద్ధిమంతునికి దానం చేస్తున్నా’నంటూ కన్యా దాన ఫలాపేక్షర్థం వధువును దానమిస్తాడు.మహాపతివ్రత అయిన సీతాదేవి శీలాన్ని పరీక్షించడానికి శ్రీరామచంద్రుడే ఆమెను అగ్ని పర్గీక్ష చేయించాడని అనుకోవడం అవాస్తవమని విజ్ఞులు చెబుతారు.

అయోధ్యా ప్రవేశం చేసిన తరువాత తనకు లోకనింద కలుగకుండా ఉండేందుకే సీతా దేవిని లక్ష్మణ, భరత, శతృఘు్నల వద్దగానీ, సుగ్రీవ విభీషణుల సంరక్షణలో గాని ఉంచేం దుకు రాముడు ప్రయత్నిస్తాడు. భర్త తోడు లేకుండా భార్య జీవించడం సాధ్వీమణుల లక్షణం కాదని సీతమ్మే అగ్ని ప్రవేశం చేస్తుంది.ఒక మానవుని సౌశీల్య సంపద సిద్ధింపచేయ డానికి కొన్ని ప్రత్యేకమైన కర్మలు నిర్దేశించబ డ్డాయి. వానిని యమ, నియమాలని యాజ్ఞ వల్కస్మృతి వివరిస్తుంది.

మనోవాక్కాయ కర్మబద్ధమైన, త్రికరణ శుద్ధ మైన, బ్రహ్మచర్యము, దయ, శీతోష్ణాదులను, నిందావమానాలను ఓర్చుకోగల క్షాంతి అనబ డు శక్తి, పరమేశ్వర ధ్యానం, సత్యము, కౌటీ ల్యం లేకుంటుటనబడు ఆర్జనం, అహింస ఇత రుల సొత్తును అపహరించకుండా ఉండుట మధురముగా మాట్లాడటం, సత్ప్రవర్తనను ప్రదర్శించటం, ఇంద్రియానిగ్రహాలు ‘యమము’లని నిర్వచించ బడినవి. స్నానము, మౌనము, ఉపవాసము, యజ్ఞ ము చేయుట, వేదాభ్యాసం, బ్రహ్మచర్యం, గురు శుశ్రూష, శౌచం, కోపం లేకుండుట, కర్తవ్యనిర్వహణ పట్ల ఏమరుపాటు లేకుండు ‘నియమ’ ములని పిలువబ డుచున్నవి. 

సౌశీల్య లక్షణాలను విదురుడు కూడా చక్కగా వివరాస్తాడు. శ్రమించి పోయిన లేక శాంతించి పోయిన వైరమును తిరిగి రగిలిం పనివాడు, గర్వమును ఆరో హించుకొని అహంకారాన్ని ప్రదర్శించని వాడు, ఎప్పటికీ హీనత్వమును పొందని వాడు, కష్టము లందు కూడా అనుచితంగా ప్రదర్శించని వాడు, మంచి నడవడిక కలిగిన సౌశీల్యవం తుడౌతాడని, అట్టి పురుషుడే ఉత్తముడని విదుర నీతి చెబుతుంది.

యమనియమాలను పాటిస్తూ, అభ్యుదయ మును సాధించే మంగళ కార్యాలను చేస్తూ, దైవీలక్షణాలను పెంపొందించుకుంటూ సక ల సద్గుణాలను దిన దిన ప్రవర్థ మానంగా ఆవాహన చేసుకుంటూ తనకు, తన కుటుం బానికి సమాజానికి, రాష్ట్రానికి దేశానికి ఆదర్శ ప్రాయుడిగా ప్రతి పౌరుడు మనగలి గితే చాలు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top