You Are Here: Home » సఖి » అందం » సౌందర్య సాధనాలు

సౌందర్య సాధనాలు

స్ర్తీలందరూ సౌందర్యవతులే. కానీ అక్కడక్కడా కొంతమంది ముఖార విందాల్లో చిన్న చిన్న లోపాలు కనిపించడం సహజమే. ఈ లోపాలు చిన్నవే అయినప్పటికీ అవి చంద్రునిలో మచ్చలా ఇబ్బంది కలిగిస్తుంటాయి.ఇలాంటి లోపాలను కనుగొని వాటిని మేకప్‌ పొరల కింద దాచి పెడుతూ ముఖంలో సౌందర్యం మాత్రం ప్రతిబింబించేలా చెయ్యడం సాధ్యమైన విషయమే. ప్రస్తుతం మార్కెట్లో సందర్భం ఏదెైనా సరే సౌందర్యాన్ని మరింతగా వృద్ధి చేసి పర్సనాలిటీకి మరింత వన్నె చేకూర్చే సౌందర్య సాధనాలు ఎన్నో లభిస్తున్నాయి.

Beaకన్సీలర్‌…
మేకప్‌ వేసుకునే ముందు ముఖాన్ని చక్కగా శుభ్రం చేసుకుని ముందుగా కన్సీలింగ్‌ చేసుకోవాలి. దీనికోసం చర్మం రంగుతో మ్యాచ్‌ అయ్యే కన్సీలర్‌ ఉపయోగిస్తే బాగుంటుంది. నిజానికి కళ్ళ కింద కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చలను కవర్‌ చేసేం దుకు దీన్ని ఉపయోగిస్తారు. కానీ దీన్ని ముఖంపెై ఉన్న మచ్చలపెైన ఉపయోగించవచ్చు. ఇది స్కిన్‌ టోన్‌తో పోలిస్తే ఒకటి లేదా రెండు టోన్లు లేతగా ఉంటుంది.
ట్రాన్స్‌లూసెంట్‌ పౌడర్‌…
ట్రాన్స్‌లూసెంట్‌ పౌడర్‌ ట్రాన్స్‌ఫరెంట్‌గా ఉంటుంది. ఇది అన్ని స్కిన్‌టోన్‌లపెై ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ట్రాన్స్‌లూసెంట్‌ పౌడర్‌ ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది.
బ్లషర్‌…
బ్లషర్‌ను ఉపయోగించి ముఖంలో నిగారింపు వచ్చేలా చెయ్యవచ్చు. ప్రస్తుతం షెైనింగ్‌ బ్లషర్స్‌ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిలో ఎక్స్‌ట్రా షెైనింగ్‌ ఉంటుంది. స్ప్రే ఫౌండేషన్‌ను ఉపయోగించి చర్మం రంగుతో మ్యాచ్‌ అ య్యేలా ఫౌండేషన్‌ చేసుకోవాలి. ఫౌండేషన్‌ని కాసేపు ఆరనిచ్చి చీక్‌బోన్స్‌పెై బ్లషర్‌ని సెట్టింగ్‌ చెయ్యాలి.
‘ఐ’ లెైనర్‌, ‘ఐ’ షాడోలు
చిక్కని, నల్లని కనురెప్పలకు మస్కారా చక్కటి అందాన్ని చేకూరుస్తుంది. న్యూడ్‌ మేకప్‌లో ట్రాన్స్‌పరెంట్‌ మస్కా రా మగువల మనసును దోచుకంటోంది. పెై ‘ఐ’ షాడో కళ్ళకు చక్కటి ఆకర్షణ ఇస్తుంది. వేసుకున్న దుస్తులకు అనుగుణంగా మ్యాచ్‌ అయ్యే ‘ఐ’ షాడో ఉపయోగించ వచ్చు.
లిప్‌లెైనర్‌…
లిప్‌స్టిక్స్‌లో గ్లాసీ టచ్‌ ఇచ్చేవి లభిస్తున్నాయి. వీటిలో గ్లాసీ గోల్డెన్‌, గ్లాసీ సిల్వర్‌ వంటివి మగువలు చెప్పుకోదగినవి. గ్లాసీగా ఉండడంతో రంగు మరింత కొట్టొచ్చిన ట్టు కనిపిస్తుంది. లిప్‌ లెైనర్‌ను ఉపయోగించి పెదవుల షేప్‌ను తీర్చిదిద్దుకోవాలన్నా గ్లాస్‌ను ఉపయోగించి చేసుకోవచ్చు.
ఆయుర్‌ ెహెర్బల్‌ కాస్మటిక్స్‌ నుంచి విడుదల చేస్తున్న కొత్త బ్రాండ్‌ మహిళలకు ఒక కొత్త హెర్బల్‌ లుక్‌ ఇస్తుందని ఉత్పత్తిదారులు అంటున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top