You Are Here: Home » యువ » సోషల్‌ మీడియా నీడలో…

సోషల్‌ మీడియా నీడలో…

ఒకప్పుడు విద్యార్థులు, యూత్‌కే పరిమితమైన ఈ సోషల్‌ మీడియా ఇప్పుడు ప్రముఖులకు కూడా అనధికార పబ్లిసి టీ కేంద్రంగా మారిపోయింది. రాజకీయనాయకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కూడా ఫేస్‌బుక్‌లలో తమ అకౌంట్లు క్రియే ట్‌ చేసుకుంటున్నాయి. ఇలా రోజురోజుకీ వీటి సంఖ్య లక్షల్లో పెరిగిపోతుండడం వల్ల… డూప్లికేట్‌ అకౌంట్లు కూడా పుట్టుకొస్తు న్నాయి. ప్రముఖుల పేర్లతో కొందరు ఆకతాయిలు అకౌంట్లు ఓపెన్‌ చేసి వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తుండడంతో… అసలు ప్రముఖులు అవాక్కవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. డ్యామేజ్‌ అంతా జరిగిపోయినాక తేరుకొని అవి తమ అకౌంట్లు కాదని ఎవరో సృష్టించినవి చెప్పుకోవాల్సిన పరిస్థితులు దాపు రిస్తున్నాయి.

సోషల్‌ నెట్‌వర్క్‌లు ప్రముఖుల అభిప్రాయాలను, సూచనలు సాధారణ ప్రజలతో పంచుకునేందుకు వారధిగా ఉపయోగపడు తుండడం… వారికి ఉచితంగా పబ్లిసిటీ పెరుగుతుండడంతో చాలామంది సెలబ్రిటీలు వాటిని ఆశ్రయిస్తున్నారు. వీటి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో… డూప్లికేషన్‌కు కూడా అవకాశం ఏర్పడుతోంది.

బాలీవుడ్‌ ప్రముఖుల గురించి చెప్పాలంటే… ముఖ్యంగా రామ్‌గోపాల్‌ వర్మ గురించే చెప్పాలి. అసలే ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఆయన సోషల్‌ మీడియా పుణ్యమా అని రోజుకో ట్వీట్‌ చేస్తూ… మూడు ట్వీట్‌లు, ఆరు వివాదాలుగా ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.
అమితాబ్‌ బచ్చన్‌ వంటి ప్రముఖులు కూడా ప్రతి రోజు ఏదో ఒక అంశంపెై తరుచూ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఇప్పుడు ఈ సోషల్‌ మీడియాలో తెలుగు ప్రముఖుల అకౌంట్లు కూడా పెరిగి పోతున్నాయి. ఇటీవల వచ్చిన ‘ఈగ’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఇప్పుడు ఫేస్‌బుక్‌, ట్విటర్లలతో సైతం ఈగ రొద వినపడుతోంది. ఈగ సినిమా గురించి ఎందరో సినీప్రముఖులు తమ అభిప్రాయాలను ఫేస్‌బు్‌, ట్విటర్ల ద్వారా పంచుకున్నారు.

ఫేస్‌బుక్‌లో ‘ఈగ’ రొద…
ఇప్పుడు ఏ సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్లను ఓపెన్‌ చేసినా ఈగ రొద విని పిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతోన్న ఈగ మూవీ గురించి అనేకమంది అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా ఆ సినిమా డెైరెక్టర్‌ ఎస్‌. ఎస్‌.రాజమౌళి కూడా ఈగ గురించి ట్వీట్‌ చేశాడు. ఈగ సిని మా చూసి ప్రముఖ దర్శకుడు శంకర్‌ దాదాపు 10 నిమిషాల పాటు తనతో మాట్లాడినట్లు తెలిపాడు. అలాగే శంకర్‌ పిల్లలు కూడా ఈగ సినిమాను ఎలా ఎంజాయ్‌ చేసింది కూడా రాజ మౌళికి వివరించారట శంకర్‌. ఇదిలావుంటే ఓ అజ్ఞాత వ్యక్తి ఈగ సినిమా అట్టర్‌ఫ్లాప్‌ మూవీ అని ఫేస్‌బుక్‌లో వెలువరిం చాడట. ఈగ సినిమాను సీన్‌ బెై సీన్‌ వివరిస్తూ…. ఇది చాలా చెత్త మూవీ అని ట్వీట్‌ చేశాడట. అయితే… ఇలాంటి నెగెటివ్‌ మెసేజ్‌లను కూడా స్వాగతిస్తున్నట్టు రాజమౌళి చెప్పడం విశేషం.

100 కోట్ల క్లబ్‌లో ఈగ: రామ్‌గోపాల్‌ వర్మ…
సోషల్‌ మీడియా ట్విటర్‌లో రామ్‌గోపాల్‌వర్మ ఈగ సినిమా పెై ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి 100 కోట్ల క్లబ్‌లో చేరే తొలి సినిమాగా ఈగ రికార్డు సృష్టిస్తుం దని జోస్యం చెప్పారు. అంతేకాకుండా కేవలం తెలుగు వెర్షెన్‌లో నే ఈగ సినిమాకు 100 కోట్లు కొల్లగొట్టే సత్తా ఉంద న్నాడు.

ఆ అకౌంట్లు మావి కాదు…
ఇదిలావుంటే… ఇలాంటి సోషల్‌ మీడియా పట్ల కొందమంది సెలబ్రిటీలకు అంతగా ఇంట్రెస్ట్‌ ఉండదు… ఉదాహరణకు తెలుగు స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ఉదంతాన్నే తీసుకుంటే… ఆమె పేరుమీద ఫేస్‌బుక్‌, ట్విటర్లలో అకౌంట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఆ అకౌంట్లు తనవి కాదని, ఎవరో పనిగట్టుకొని క్రియేట్‌ చేశారని సమాధానం చెప్పుకోవాల్సివచ్చింది.

కాజల్‌ పేరిట ఫేస్‌బుక్‌ లోనూ, ట్విటర్‌ లోనూ ఉన్న ఎకౌంట్స్‌కీ తనకీ సంభందం లేదని… అలాగే భవిష్యత్‌లో కూడా తాను ఎటువంటి ఎకౌంట్‌ ఓపెన్‌ చేసి రాస్తానని ఎక్స్‌పెక్ట్‌ చేయవద్దు అంటోందామె. రీసెంట్‌గా ఆమె మీడియాతో మాట్లాడుతూ… చిన్నప్పుడు పరీక్షల్లో రాయడం తప్ప వేరే ఏమీ రాయటం నాకు అలవాటు లేదు. అయినా కంటిన్యూగా అలా రాసుకుంటూ పోవాలంటే భలే బోరు… అందుకే ట్విట్టర్‌లు, ఫేస్‌బుక్‌లోనూ నేనెప్పుడూ ఏమీ రాయను. అసలు వాటిలో నాకు ఎకౌంట్‌ కూ డా లేదు. ఓపెన్‌ కూడా చేయను. వీటితో పాటు ఎస్‌.ఎమ్‌.ఎస్‌. లు కూడా చాలా అరుగుదానే పంపుతుంటాను అని తేల్చేసింది కాజల్‌.

సోషల్‌ నెట్‌వర్క్‌లు ప్రముఖుల అభిప్రాయాలను, సూచనలు సాధారణ ప్రజలతో పంచుకునేందుకు వారధిగా ఉపయోగపడుతుండడం… వారికి ఉచితంగా పబ్లిసిటీ పెరుగుతుండడంతో చాలామంది సెలబ్రిటీలు వాటిని ఆశ్రయిస్తున్నారు. అయితే వీటి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో… డూప్లికేషన్‌కు కూడా అవకాశం ఏర్పడుతోంది.

వివాదాలూ తక్కువేం కాదు…
కొన్ని రోజుల క్రితం బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కారుకు యాక్సిడెంట్‌ అయి ఆయన మరణించారంటూ బ్లాగు ల్లో పుకార్లు గుప్పుమన్నాయి. జ్ట్టిఞ://24ఝఠటజీఛిఠిఛీౌ. ఛజూౌటఞౌ్ట.జీ/2012/06/ ్చఝజ్ట్చీఛజిఛ్చఛిజ్చిఛీజ్ఛీఛీజీటజీజ్ఛూఠ్ఛిజిజీఛిజ్ఛూ.జ్టిఝజూ బ్లాగులో ఈ వార్త వెలువడింది. ఇందులో యాక్సిడెంట్‌ అయిన కారు ఫోటోను కూడా పెట్టారు.
ఇది కాస్తా సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచం అంతా వ్యాపిం చింది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇదంతా ఫాల్స్‌ న్యూస్‌ అని తేలింది. బిగ్‌-బి వ్యవహారాలు చూసే పి.ఆర్‌.ఓ. ఈ వార్తను ఖండించారు. ఆయన ఇంట్లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్లాగర్స్‌, మొబెైల్‌ మీడియా ఇలాంటి వార్తలు కావాలని పుట్టిస్తోంది తెలుస్తోంది. ఆ మధ్య లతా మంగేష్కర్‌, రాష్‌ ఖన్నాలపెై కూడా ఇలాంటి వార్తలే చక్కర్లు కొట్టిన విష యం తెలిసిందే.

ఫేస్‌బుక్‌లో మన ముఖ్యమంత్రి..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేరుమీద కూడా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందంటూ… ఆమధ్య ఆయన ఫేస్‌బుక్‌కు సంబంధించి యు.ఆర్‌.ఎల్‌. ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిం చింది. అది కాస్తా ఫేక్‌ న్యూస్‌ అని తెలియడంతో… ఆ వార్తను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖండించింది. ముఖ్యమంత్రి కార్యాల యం ఆ వార్త ఖండిస్తూ లేఖ విడుదల చేసిన కారణంగా చాలా సైట్లు ఆ వార్తను తొలగించాయి.

మమత మాయాజాలం…
రాష్టప్రతి ఎన్నికల్లో యూపిఏకి షాకిచ్చే పనిలో ఉన్న తృణ మూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ దీదీ మమతాబెనర్జీ దాని కోసం సోషల్‌ మీడియాను వాడుకుంటోంది. రాష్టప్రతి అభ్యర్థిగా కలాం వెైపు మొగ్గుచూపుతున్న తృణమూల్‌ పార్టీ ఆయనకు మద్దతును కూడగట్టేందుకు రెడీ అయ్యింది. అయితే ముందుగా పార్టీల మద్దతు కన్నా ప్రజల మద్దతు ముఖ్యమనుకున్నా దీదీ.. సోషల్‌నెట్‌ వర్క్‌ పెై దృష్టి పెట్టింది. రాష్టప్రతి అభ్యర్థిగా కలాంకి మద్దతునివ్వాలని కోరతూ ఫేస్‌బుక్‌లో పేజ్‌ని ప్రారంభించారు. రాష్టప్రతి పదవి… అత్యుత్తమమైనదని దానికి… మాజీ రాష్టప్రతి కలామే న్యాయం చేయగలరంటూ.. పేజ్‌లో ఆమె పోస్ట్‌ చేశారు. విద్యావేత్త, మేధావి, దేశం గర్వించదగ్గ వక్తి కలాం అని.. అందుకే ఆయనకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని తెలి పారు.

దేశ ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు తెలపాలని కోరారు. కలాంపెై అభిప్రాయాలను తెలుపుతూ బ్లాగ్‌లో పోస్ట్‌ చేయమని విజ్ఞప్తి చేశారు. సైబర్‌వార్‌తో యూపిఏతో పోటీకి సై అంటున్న దీదీ… కలాంకి మద్దతు కూడగట్టేందుకు ఇదే సరెైన పద్ధతని భావిస్తోంది.

ఇలా చెప్పుకుంటూపోతే సోషల్‌ మీడియా వల్ల ఎంత ప్రయో జనం ఉందో… అంతే ప్రమాదం కూడా ఉందని చెప్పవచ్చు. ఏదేమైనా ఇప్పుడు స్కూల్‌ పిల్లాడు మొదలుకొని వీఐపీ, సెల బ్రిటీల వరకు ఈ సోషల్‌ మీడియా క్రేజీ సోర్స్‌ మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
ఇదిలావుంటే… ఇలాంటి సోషల్‌ మీడియా పట్ల కొంతమంది సెలబ్రిటీలకు అంతగా ఇంట్రెస్ట్‌ ఉండదు… ఉదాహరణకు తెలుగు స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ఉదంతాన్నే తీసుకుంటే… ఆమె పేరుమీద ఫేస్‌బుక్‌, ట్విటర్లలో అకౌంట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఆ అకౌంట్లు తనవి కాదని, ఎవరో పనిగట్టుకొని క్రియేట్‌ చేశారని సమాధానం చెప్పుకోవాల్సివచ్చింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top