You Are Here: Home » ఇతర » సోయాబాల్స్‌

సోయాబాల్స్‌

ఇవి కావాలి:

ఉడికించిన మీల్‌మేకర్‌	: ఒక కప్పు
కార్‌‌నఫ్లోర్‌ : ఒక టీ.
Unaఅల్లం వెల్లుల్లి ముద్ద : ఒక టీ.
గరం మసాలా : ఒక టీ.
సోయాసాస్‌ : రెండు టీ.
పచ్చిమిర్చి : రెండు
అల్లం, వెల్లుల్లి ముక్కలు : తగినన్ని
నూనె : సరిపడా
పదీనా, జీడిపప్పు,
కొత్తిమీర : తగినన్ని రౌండ్‌గా తరిగిన
టొమోటో ముక్కలు : ఐదు

ఇలా చేయాలి:
బాణలిలో నూనె కాగిన తరువాత చీల్చిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కల్ని వేసి వేగించాలి. అందులోనే పుదీనా కూడా వేసి కాసేపు వేయించి ఆపెై ఉడికించిన మీల్‌మేకర్‌ వేయాలి. సోయాసాస్‌ కూడా కలిపి చివర్లో ఒక టీస్పూన్‌ నీటిని జతచేసి కలియదిప్పాలి. తరువాత ఈ పదార్థాన్ని ఒక సర్వింగ్‌ డిష్‌లోకి మార్చి.. వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, గుండ్రంగా తరిగిన టొమోటో ముక్కలతో అందంగా సర్ది వడ్డించాలి. దీనికి అవసరమయితే కాబేజీ తరుగు, కీరా ముక్కలు, చిప్స్‌ కూడా జత చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. పోషకాలకీ ఏ మాత్రం కొదవ ఉండదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top