You Are Here: Home » చిన్నారి » సోప్ సీరియల్స్ అంటే ఏమిటి?

సోప్ సీరియల్స్ అంటే ఏమిటి?

సోప్ అంటే సబ్బు అని అందరికీ తెలుసు. కానీ సోప్ ఒపెరా అంటే ఏమిటో కొంతమందికి తెలియకపోవచ్చు. సోప్‌ఒపెరా అంటే టీవీ సీరియళ్లు. 1930 నుంచి యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొదట్లో రేడియోలో, ఆ తర్వాత టెలివిజన్లో ప్రసారమయిన సీరియళ్లని సబ్బులు తయారుచేసే కంపెనీలు స్పాన్సర్ చేసేవి. కుటుంబ కథలకు స్ర్తీల ఆదరణ ఉండడంతో ఆ సీరియళ్లు ప్రసారమయ్యేటప్పుడు సబ్బుల తయారీదారులు తమ ఉత్పత్తుల అమ్మకాలు పెరగడానికి ప్రకటనలు ఇచ్చేవారు. అందుకే ఆ సీరియళ్లని సోప్‌ఒపెరా అనడం మొదలుపెట్టారు. కొన్నిచోట్ల ఈ సీరియళ్లని సోప్స్ అని కూడా అంటుంటారు. 1943 తర్వాత సోప్‌ఒపెరా అనే మాటని సోప్స్‌గా కుదించారు. భారతదేశంలో 1980 దశకం చివర్లో సోప్‌ఒపెరా (టీవీ సీరియళ్ల) హవా మొదలయింది. చాలా ప్రాంతాల్లో క్రికెట్ కన్నా, సినిమాల కన్నా సోప్‌ఒపెరాకే ఆదరణ ఎక్కువ.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top