You Are Here: Home » ఇతర » సొరంగమార్గాలు ఆశ్చర్యపరిచే అద్భుత నిర్మాణాలు

సొరంగమార్గాలు ఆశ్చర్యపరిచే అద్భుత నిర్మాణాలు

అగ్రరాజ్యం అమెరికా ఓ చిన్నిదేశం వియత్నాంతో యుద్ధం చేసి ఓటమి చవిచూసింది. ఆ దేశ చరిత్రలో అది చెరిగిపోని మచ్చ. ఇంతకీ ఆ చిన్నిదేశం వియత్నాం విజయరహస్యం ఏమిటి. ఓ సొరంగమార్గం. అంతుచిక్కని అద్భుత యుద్ధతంత్రానికి మేలైన నిర్మాణం. వెదురుముల్లులతో కూడిన మారణాయుధాల గుట్టలతో నిర్మించిన ఎరలు, గోతులు, అరలు, ఎగుడుదిగుడుగా, దగ్గరిదగ్గరిగా మలుపులు, విశాలమూ, పొడవుగా నిర్మించిన భారీ సొరంగం కుచీ. దీని రహస్యం…వియత్నాం సైనికుల సాహసం కలసి అమెరికా తలలు వంచేలా చేశారుు. ఇప్పుడు ఇది స్మారకచిహ్నం. పర్యాటక ప్రాంతం. మన ఉపరాష్టప్రతి అన్సారీ ఇప్పుడు అక్కడ పర్యటించి ఆ సొరంగ రహస్యాలను అడిగి తెలుసుకుని అచ్చెరువొందారు.


మహాభారతంలో లక్కఇంటిని తగలబెట్టినపుడు అన్నదమ్ములను భీముడు రక్షించి ఓ సొరంగమార్గం ద్వారా వారిని బయటకు తీసుకువస్తాడు. అంటే ఆనాటిేక సొరంగమార్గాల తవ్వకం, వినియోగం మనకు అలవాటన్నమాట. మన రాజులు నిర్మించిన కోటలనుంచి అపాయకర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడేందుకు తప్పనిసరిగా రహస్యమార్గాలు సొరంగాలు. చరిత్రలో కొన్ని ఎప్పుడో బయటపడగా తరచూ పురావస్తుశాఖ తవ్వకాల్లో వార్తల్లోకి వస్తూనే ఉన్నారుు. విజయనగరం కోటలోనూ ఈ సొరంగమార్గం ప్రారంభమయ్యే గదిని చూడవచ్చు. బొబ్బిలికోటకు ఇక్కడినుంచి రహస్యమార్గం ఉందని అంటారు.

అలనాడు ప్రాణరక్షణకు, విలు వైన సంపదను భద్రపరిచేందుకు సొరంగ మార్గాల ను తవ్వించేవారు. రాజులు, ఆంతరంగికులకు తప్ప వేరెవ్వరి కీ ఆ మార్గరహస్యాలు తెలిసేవికావు. ఇప్పడు రోజులు మారారుు. దూరాభారం తగ్గించేందుకు, ప్రజారవాణా సౌకర్యాలు మెరుగుపరి చేందుకు, మెరుగైన నీటిసరఫరాకు టన్నెల్స్‌ నిర్మిస్తున్నారు. సుదూర రైల్వేలైన్లు, పైపింగ్‌ సిస్టవ్గు, మురుగునీటిపారుదల వ్యవస్థ, ేకబులింగ్‌ వంటివాటికోసం సొరంగాల తవ్వకం ఎక్కువైంది. భూగర్భంలో రైళ్ల రాకపోకలు సాగిపోతున్నారుు. కిలోమీటర్ల పొడవైన కొండలను తొలిచి టన్నెల్స్‌ నిర్మిస్తున్నారు. మంచినీటి తరలింపూ సురక్షితంగా సాగిపోతోంది. మానవమేధస్సుకు ఇవి దర్పణాలుగా నిలుస్తున్నారుు.

ప్రపంచంలోని పెద్ద సోరంగం…
Delawareప్రపంచంలోని అతిపెద్ద సొరంగం దెలవేర్‌ అక్విడెక్ట్‌ న్యూయార్క్‌ నగరంలో ఉంది. దీని పొడవు 137కిమీలు కాగా వెడల్పు 13.5 అడుగులు. పెద్ద కొండను తొలిచి దీని నిర్మాణం చేపట్టారు. 1939లో ప్రారంభమైన ఈ సొరంగ నిర్మాణం 1945లో పూర్తయింది. న్యూయార్క్‌ ప్రజల అవసరాల కోసం 1.3 బిలియన్‌ సంయుక్త గ్యాలన్ల నీటి తరలింపునకు వినియోగిస్తున్నారు. 1970 నుంచి న్యూయార్క్‌ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ఈ నీటి తరలింపును నిర్వహిస్తోంది…

మార్చుటన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం)తో సొరంగాలు
వెలిగొండ ప్రాజెక్టులో 18 కిలోమీటర్ల సొరంగాన్ని, శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాజెక్టులో 44 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వటానికి దీనిని ఉపయోగిస్తున్నారు.స్విట్జర్లాండ్‌లో 3 వేల మీటర్ల ఎత్తె్తన పర్వతశ్రేణుల అడుగున 75 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని తవ్వుతున్నారు. ఈ సొరంగం ద్వారా జూరిచ్‌- మిలన్‌ పట్టణాల మధ్య ప్రయాణ దూరం 250 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. బ్రిటన్లో థేమ్స్‌ నదికి 40 మీటర్ల అడుగున రెండున్నర కిలోమీటర్ల పొడవున రెండు సొరంగాలు తవ్వుతున్నారు. దీనివల్ల లండన్‌- పారిస్‌ మధ్య దూరం తగ్గుతుంది.

హైదరాబాద్‌లో…
పాతబస్తీలోని డబీర్‌పురా, చౌ మహల్లా ప్యాలెస్‌తో పాటు గోల్కొండ టు చార్మినార్‌, సైఫాబాద్‌లోని హౌం సైన్స్‌ కాలేజీ తదితర ప్రాంతాలలోనూ సొరంగాలు బయటపడ్డాయి. ఈ మధ్యే నగరం నడిబొడ్డున గల బిర్లా మందిర్‌ దిగువ భాగంలో భారీ సొరంగం బయటపడింది. ఇక్కడ సొరంగం వున్న విషయాన్ని స్థానికులు గమనించి ఈ విషయాన్ని పురావస్తు శాఖ అధికారులకు తెలియచేయడంతో తవ్వకాలు మొదలయ్యాయి. రాజుల కాలంలో ఖజానా దాచడానికి, శత్రువులు కోటను చుట్టుముట్టినప్పుడు తప్పించుకోవడానికి సొంరంగాలను నిర్మించేవారు.

భారత్‌లో
YelowLineభారత్‌లో అతిపెద్ద సొరంగం ఎల్లోలైన్‌. ఇది ఢిల్లీలో ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించడానికి వీలుగా దీని నిర్మాణం జరిగింది. ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌ నుంచి గుర్గావ్‌లోని హుడా సిటీ సెంటర్‌ వరకు ఉన్న ఈ సొరంగంలో 34 మెట్రో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 45 కిలోమీటర్లు ఉంటుంది.

11,200 కిలోమీటర్ల పొడవైన పిర్‌ పంజల్‌ సొరంగం ఎత్తు 1.760మీ. ఇది ఆసియాలో మూడవ అతి పెద్ద రైల్వే సొరంగం. క్వాజిగుండ్‌ నుంచి మొదలై బనిహల్‌ వద్ద ముగుస్తుంది. ఈ సొరంగం జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రంలో ఉంది. శీతాకాలంలో మంచు కురిసి జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్లే రహదారిని మూసివేస్తారు. ఈ సమయంలో ఈ రైల్వే లైన్‌ ప్రధాన ఆధారం… ప్రయాణికులకు, సరుకుల రవాణాకు రైళ్లనే వినియోగిస్తారు. కాశ్మీర్‌ వ్యాలీ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ను నిర్మించారు.


Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top