You Are Here: Home » సినిమా » పాటలు » సొగసు చూడతరమా (1995)-సీతాకోకచిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా

సొగసు చూడతరమా (1995)-సీతాకోకచిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా

పల్లవి :
సీతాకోకచిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
సీతాకోకచిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా
పొంగి పారేటి సెలయేరులమ్మా
పాత్తిళ్లలో చిట్టి పుత్తడిబొమ్మను
పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందమేదో తెలియాలంటే
ఎత్తాలి తను ఆడజన్మ బ్రహ్మ ॥

చరణం : 1
కుహు కుహు కూసే కోయిలా
ఏదీ పలకవే ఈ చిన్నారిలా
మిలమిలా మెరిసే వెన్నెలా ఏదీ
నవ్వవే ఈ బుజ్జాయిలా
అందాల పూదోటకన్నా
చిందాడు పసివాడె మిన్న
బుడత అడుగులే నడిచేటి వేళలో
పుడమి తల్లికెన్ని పులకలో ॥

చరణం : 2
గలగలా వీచే గాలిలా సాగే
పసితనం తీయని ఒక వరం
ఎదిగిన ఎదలో ఎప్పుడూ
నిధిలా దాచుకో ఈ చిరుజ్ఞాపకం
చిరునవ్వుతో చెయ్యి నేస్తం
చీమంత అయిపోదా కష్టం
పరుగు ఆపినా పడిపోయి లేచినా
అలుపు సొలుపు లేని ఏ అలా

చిత్రం : సొగసు చూడతరమా (1995)
రచన : సిరివెన్నెల, సంగీతం : రమణీ భరద్వాజ్
గానం : అనురాధా శ్రీరామ్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top