You Are Here: Home » సినిమా » పాటలు » సైనికుడు (2006)- ఓరుగల్లుకే పిల్లా పిల్లా

సైనికుడు (2006)- ఓరుగల్లుకే పిల్లా పిల్లా

సాకీ :

ఓ చిలక నా రాచిలక
రావే రావే రాచిలక
నా చిలక రాచిలక
రావే రావే నా చిలక
ఓ సయ్యోరే సయ్యోరే సయ్యా హోరే
అరె సయ్యోరే సయ్యోరే
సయ్యా హోరే

పల్లవి :

ఓరుగల్లుకే పిల్లా పిల్లా
ఎన్నుపూస ఘల్లు ఘల్లుమన్నాదే
ఓరచూపులే రువ్వే పిల్లా
ఏకవీర నువ్వులా ఉన్నావే

జవ్వనాల ఓ మధుబాల (2)
ఇవి జగడాల ముద్దు పగడాలా
అగ్గిమీద ఆడ గుగ్గిలాల
చిందులేస్తున్న చిత్తరాంగిరా

చరణం : 1

లాలాలా పండు వెన్నెలా
తొలివలపు పిలుపులే వెన్నలా
ఇకనైనా కలనైనా ఎదకు చేరగలనా
అందాల దొండపండుకు
మిసమిసల కొసరు కాకికెందుకు
అది ఈడా సరిజోడా
తెలుసుకొనవే తులసి
చెలి మనసును గెలిచిన వరుడికి
నరుడికి పోటీ ఎవరు (2)
చలి చెడుగుడు విరుగుడు
తప్పేవి కావు తిప్పలు… ఛల్

చరణం : 2

కాకాకా కస్సుబుస్సులా
తెగ కలలు కనకు గోరువెచ్చగా
తలనిండా మునిగాకా
తమకు వలదు వణుకు
దా దా దా దమ్ములున్నవా
మగసిరిగా ఎదురు పడగలవా
లంకేశా లవ్ చేశా
రాముడంటి జతగాణ్ణి
ఎద ముసిరిన మసకల
మకమకలాడిన మాయే తెలుసా
ఒడిదుడుకులు ఉడుకులు
ఈ ప్రేమకెన్ని తిప్పలు… ఛల్

చిత్రం : సైనికుడు (2006)
రచన : వేటూరి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : కార్తీక్, కారుణ్య, హరిణి,మాలతి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top