You Are Here: Home » భవిత » విద్య » సేవల జీడీపీలో ప్రపంచంలో భారత్ స్థానం?

సేవల జీడీపీలో ప్రపంచంలో భారత్ స్థానం?

ఇండియన్ ఎకానమీ

భారత్‌లో సేవా రంగ అభివృద్ధి

1990ల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపొందడానికి సేవా రంగంలో వృద్ధే కారణం. ఈ దశకంలో సేవా రంగం సగటు వార్షిక వృద్ధి 7.9 శాతంగా నమోదు కాగా, తర్వాత కాలంలో స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా 60 శాతం పైగా చేరుకుంది.
భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారిత వ్యవస్థ నుంచి నాలెడ్‌‌జ బే్‌స్డ్ వ్యవస్థగా రూపాం తరం చెందడానికి కూడా సేవారంగం సాధించిన ప్రగతి ఎంతో కారణమైంది.

సేవా రంగానికి సంబంధించి వాణిజ్యం, రవాణా, టెలీక మ్యూనికేషన్లు, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, ఐటీ, కమ్యూనిటీ, సాంఘిక సేవలను ఉప రంగాలుగా పేర్కొనొచ్చు. ఆర్థిక సరళీకరణ విధానాల నేపథ్యంలో సేవా రంగం ప్రగతి సాధించింది. కేంద్ర గణాంక సంస్థ వర్గీకరణ ప్రకారం సేవా రంగాన్ని నాలుగు ముఖ్య రంగాలుగా విభజించొచ్చు. అవి.. 1. వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు; 2. రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్లు; 3. ఫైనాన్సింగ్, బీమా, రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు; 4. కమ్యూనిటీ, సాంఘిక, వ్యక్తిగత సేవలు.

ప్రజల వ్యయార్హ ఆదాయంలో వృద్ధి, పట్టణీకరణ, పెరుగుతున్న మధ్యతరగతి జనాభా.. వంటివి సేవారంగ అభివృద్ధికి దోహదపడ్డాయి. సేవల జీడీపీలో మొదటి 12 దేశాల్లో భారత్ 11వ స్థానంలో ఉంది.

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..
త్రిపుర, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, మహారాష్ర్ట, బీహార్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, చంఢీగఢ్‌ల జీఎస్‌డీపీ సేవారంగ వాటా జీడీపీలో సేవారంగ వాటా కంటే ఎక్కువ. ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, త్రిపుర, మణిపూర్‌ల్లో సేవారంగంలో ఉపాధి ఎక్కువ. చంఢీగఢ్, ఢిల్లీ లాంటి నగరాల్లో ప్రతి వెయ్యి మందికి 820 మందికి పైగా, కేరళలో ప్రతి వెయ్యి మందిలో 511 మంది సేవా రంగంలో ఉపాధి పొందుతున్నారు. నిర్మాణ రంగం, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ పాలన, విద్య, కమ్యూనిటీ సేవలు లాంటివి వివిధ రాష్ట్రాల్లో అధిక ఉపాధిని కల్పిస్తున్నాయి.
2011-12లో సేవారంగంలో వృద్ధి నిర్మాణ రంగంతో కలుపుకొని 8.8 శాతం. నిర్మాణ రంగాన్ని మినహాయిస్తే 9.4 శాతంగా నమోదైంది. ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధిస్తున్న దశలో డిమాండ్, సప్లయ్ వైపు కారకాల ప్రభావం వల్ల సేవా రంగంలో అభివృద్ధి చోటు చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.

డిమాండ్ వైపు కారకాలు:
1) అంతిమ వస్తు సేవలకున్న అధిక డిమాండ్ వ్యాకోచత్వం.
2) సేవల ఉత్పాదకతాభివృద్ధి తక్కువగా ఉన్నందువల్ల అధిక ఉపాధి సామర్థ్యానికి దారితీయడం.
3) తయారీ రంగానికి సంబంధించిన నిర్మాణాత్మక మార్పులు.
సప్లయ్ వైపు కారకాలు:
1) విదేశీ వాణిజ్యంలో పెరుగుదల.
2) సేవల రంగంలో అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
3) సాంకేతిక పరిజ్ఞానంలో ప్రగతి.

మెడికల్ టూరిజం:
మెడికల్ టూరిజం ప్రపంచ మార్కెట్ 100 నుంచి 150 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆసియా దేశాల్లో మెడికల్ టూరిజం అభివృద్ధికి ఆయా దేశాలు తీసుకొన్న చర్యలు దోహదపడ్డాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ నివేదిక ప్రకారం థాయ్‌లాండ్, ఇండియా, సింగపూర్, మలేషియా, హంగేరీ, పోలెండ్, మాల్టాలు మెడికల్ టూరిస్ట్ కేంద్రాలుగా తులనాత్మక ప్రయోజనం పొందుతున్నాయి.

అత్యాధునిక చికిత్స కేంద్రంగా రూపొందే క్రమంలో ప్రభుత్వ ప్రైవేట్, భాగస్వామ్యంతో ఆరోగ్య సంరక్షణకు సింగపూర్ చర్యలు తీసుకొంది. మలేషియా ఆరోగ్య సంరక్షణ, పర్యాటక రంగాభివృద్ధికి మలేషియా హెల్త్ కేర్ ట్రావెల్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ప్రణాళికా పరమైన పెట్టుబడి విధానాల్లో ఫిలిప్పీన్‌‌స మెడికల్ టూరిజాన్ని చేర్చింది. భారత్‌లో హెల్త్ సర్వీసుల వృద్ధి 2010-11లో 25.4 శాతం నమోదైంది. ఇది 2011-12లో 18.6 శాతం, 2012-13లో 20.5 శాతంగా ఉంటుందని అంచనా.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు:
ఐఎంఎఫ్ ప్రకారం ఈక్విటీ మూలధనం, స్వల్ప, దీర్ఘకాల రుణాలు, ఫైనాన్షియల్ లీజింగ్, ట్రేడ్ క్రెడిట్స్, గ్రాంట్లు, విదేశీ పెట్టుబడిదారుల నుంచి వెంచర్ కాపిటల్, కంపెనీల మధ్య జరిగే రుణ లావాదేవీలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భాగమే. జీడీఆర్, ఏడీఆర్, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్, బాండ్‌ల రూపంలో పెట్టుబడులన్నీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా నిర్వచించొచ్చు. సరళీకరణ విధానాల అమలు కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో వివిధ రంగాల వాటాలో మార్పులు వచ్చాయి. సరళీకరణ విధానాల అమలుకు ముందు కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా తయారీరంగం ఆకర్షించేది.

1990లో దేశంలో మొత్తం ఎఫ్‌డీఐల్లో 85 శాతం తయారీ రంగానివే. 1991 తర్వాత సేవలు, అవస్థాపన సౌకర్యాలకు విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. దీంతో 2009లో మొత్తం పెట్టుబడుల్లో తయారీ రంగం 21 శాతం మాత్రమే పొందింది. సంస్కరణల కాలంలో సేవా రంగం ముఖ్య రంగంగా రూపొందింది. అందువల్ల 2011లో మొత్తం ఎఫ్‌డీఐల్లో 60 శాతానికి పైగా ఈ రంగం ఆకర్షించింది.

భారత్‌లో మార్కెట్ విస్తృతమవడం, నేర్పరితనం ఉన్న శ్రామికశక్తిలో వృద్ధి, నియంత్రణతో కూడిన సంస్కరణలు, ప్రజాస్వామ్య ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించడానికి కారణాలు. ఎఫ్‌డీఐల కారణంగా దేశంలో ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియ ల్ రంగం, టెలీకమ్యూనికేషన్లు, హోటల్, టూ రిజం రంగాల్లో వృద్ధి పెరిగింది. ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ రంగం ఆకర్షించిన ఎఫ్‌డీఐల మొత్తం 2003-04లో రూ.1235 కోట్లు, కాగా 2010-11 లో రూ.15,539 కోట్లకు పెరిగింది.

ఉప రంగాల్లో పెట్టుబడి:
సేవారంగ ఉప రంగాల్లో పెట్టుబడుల ప్రవాహం ఒకే రకంగా లేదు. ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ సర్వీసులు, టెలీకమ్యూనికేషన్, కంప్యూటర్ సాప్ట్‌వేర్, హార్‌‌డవేర్, నిర్మాణ రంగం, హౌసింగ్, రియల్ ఎస్టేట్‌లు అధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న మొదటి ఐదు ఉప రంగాలు. UNCTAD అంచనా ప్రకారం 2010-11లో భారత్ ఆకర్షించిన ఎఫ్‌డీఐల్లో 31 శాతం తగ్గాయి. 2010-11లో భారత్‌లోకి ప్రవేశించి మొత్తం ఎఫ్‌డీఐల్లో 18 శాతం ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ సర్వీసులు పొందగా, టెలీకమ్యూనికేషన్లు 8 శాతం, శక్తి, నిర్మాణ, హౌసింగ్, రియల్ ఎస్టేట్ రంగాల వాటా 6 శాతం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ వాటా 4 శాతం.

దేశాల వాటాలు:
మన దేశంలో 1991 నుంచి 2005, 2000- 2011 మధ్య కాలంలో మారిషస్ అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచింది. మారిషస్ ఆధారిత సంస్థలు 1991-2005 మధ్య కాలంలో భారత్‌లోకి మొత్తం ఎఫ్‌డీఐల్లో 35.55 శాతం, 2000-2011 మధ్య కాలంలో 41.90 శాతం వాటాను పొందాయి. 1991-2005 మధ్య కాలంలో భారత్‌లో ఎఫ్‌డీఐల్లో అమెరికా వాటా 16.49 శాతం, కాగా 2000-2011 కాలంలో అమెరికా వాటా 7.36 శాతానికి తగ్గింది. సింగపూర్ వాటా 2000-2011 మధ్య కాలంలో పెరిగింది.

ఇదే కాలంలో సైప్రస్ వాటాలో పెరుగుదల, దక్షిణ కొరియా వాటాలో తగ్గుదల వచ్చింది. మారిషస్, అమెరికా, ఇంగ్లండ్, జర్మనీల నుంచి లభించే ఎఫ్‌డీఐలు ఎక్కువగా విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లు, అవస్థాపనా సౌకర్యాల రంగానికి లభిస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రింట్ మీడియాలో 26 శాతం, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, ఐటీ, ఇ- కామర్‌‌స, అవస్థాపనా రంగాల్లో 100 శాతం వరకు అనుమతిస్తారు.

ఐటీ రంగం, సంబంధిత సేవలు:
ఈ రంగాన్ని ఐటీ సర్వీసులు, బీపీఓ, ఇంజనీరింగ్ సర్వీసులు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు అనే ఉప రంగాలుగా విభజించొచ్చు. నాస్కామ్ నివేదిక ప్రకారం భారత్ ఐటీ, బీపీఓ (హార్‌‌డవేర్‌ను మినహాయించి) రంగ ఆదాయం 2011-12లో 87.6 బిలియన్ డాలర్లగా ఉండగలదు. ప్రత్యక్షంగా 2.8 మిలియన్లు, పరోక్షంగా 8.9 బిలియన్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. జీడీపీలో ఈ రంగం వాటా 1987-88లో 1.2 శాతం. ఇది 2011-12లో 7.5 శాతంగా ఉంది.

సాఫ్ట్‌వేర్ ఎగుమతుల విలువ 2010-11లో 59 బిలియన్ డాలర్లు, కాగా ఈ విలువ 2011-12లో 69 బిలియన్ డాలర్లకు పెరిగింది. అమెరికానుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున భారత్ ఐటీ, అనుబంధ సర్వీసుల ఎగుమతుల్లో అమెరికా వాటా 2011-12లో 62 శాతానికి చేరుకుంది.

సౌదీ అరేబియాకు చమురు, తైవాన్‌కు ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ పరిశ్రమలు ఆయా దేశాల అభివృద్ధికి ఉపకరిస్తున్నట్టే భారత్ అభివృద్ధికి ఐటీ, బీపీఓలు దోహదపడతాయని నాస్కామ్ అభిప్రాయపడింది. భౌతిక సాంఘిక అవస్థాపనల కొరత, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు, రూపాయి విలువలో ఒడిదుడుకులు, అమెరికాలోని సబ్ ప్రైమ్ సంక్షోభం.. వంటి కారణాలతో ఐటీ రంగ అభివృద్ధిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భవిష్యత్‌లో ఈ రంగం స్థిర వృద్ధి కనబర్చే అవకాశం ఉంది.

గత పదేళ్లలో సేవా రంగంలో వృద్ధిరేటు అధికంగా ఉన్నప్పటికీ, ఉపాధి కల్పనలో ఈ రంగం వెనుకబడింది. కమ్యూనికేషన్లు, వ్యాపార సేవల్లో గత దశాబ్దంలో రెండంకెల వృద్ధి నమోదైతే, రైల్వేలు, రియల్ ఎస్టేట్‌ల్లో వృద్ధి క్షీణించింది. ఆరోగ్య సేవలపై రాష్ట్రాలు అనేక నిబంధనలు విధించాయి.

ఆరోగ్య సేవలపై ఎఫ్‌డీఐల్లో ఎలాంటి పరిమితి విధించలేదు. ఐనప్పటికీ ఈ రంగం మొత్తం ఎఫ్‌డీఐల్లో 0.4 శాతం మాత్రమే ఆకర్షించింది. విద్యా సర్వీసుల వాణిజ్యానికి సంబంధించి విదేశాల్లో విద్యా సంస్థలపై నియంత్రణ, గుర్తింపుకు అనుసరించే పద్ధతులు పరిశీలించి మన దేశంలో సొంతంగా అక్రిడిటేషన్ పద్ధతిని వృద్ధి చేయాలి. GRE, GMAT, TOFELకు పోటీగా CAT, GATE, JEEలను ఆధునీకరించాలి.

ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల్లో నిర్మాణాత్మక మార్పుల వల్ల ఇతర రంగాల్లోని సేవలకు డిమాండ్ పెరగుతుంది. తక్కువ దిగుమతి సుంకం విధించి, ఈ రంగ అభివృద్ధికి దోహదపడే సర్వీసుల దిగుమతులను అనుమతించాలి. ప్రస్తుతం సేవారంగంలో అధిక ఉపాధి సామర్థ్య సేవల వృద్ధి తక్కువ, అధిక వృద్ధి ఉన్న సేవల్లో శ్రామిక ఉత్పాదకత అధికంగా ఉంది. దాంతో ఆయా రంగాల్లో ఉపాధి సామర్థ్యం తక్కువగా ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఏర్పడుతున్న పరిణామాలు కొన్ని సేవల్లోని వృద్ధిపై ప్రభావం చూపే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

మాదిరి ప్రశ్నలు

1. సేవల జీడీపీలో ప్రపంచంలో భారత్ స్థానం?
జ: 11

2. సేవారంగంలో ఉపాధి ఎక్కువగా ఉన్న దక్షిణాది రాష్ర్టం?
జ: కేరళ

3. భారత్‌లో 2011-12లో నిర్మాణ రంగాన్ని మినహాయించి సేవారంగ వృద్ధి?
జ: 9.4 శాతం

4. కేంద్ర గణాంక సంస్థ సేవా రంగాన్ని ఎన్ని ముఖ్యరంగాలుగా విభజించింది?
జ: 4

5. సంస్కరణలకు ముందు కాలంలో ఏ రంగం ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత్ ఆకర్షించింది?
జ: తయారీ

6. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షిస్తున్న సర్వీసులు?
జ: ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్

7. భారత్‌లో ఇంగ్లండ్, జర్మనీల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ రంగాలకు లభిస్తున్నాయి?
జ: విద్యుత్, టెలీకమ్యూనికేషన్లు, అవస్థాపన సౌకర్యాలు

8. భారత్‌కు ఏ దేశం నుంచి ఎక్కువగా ఎఫ్‌డీఐలు లభిస్తున్నాయి? జ: మారిషస్

9. 2011-12లో నిర్మాణ రంగంలో వృద్ధి తగ్గడానికి కారణం?
జ: యూరోపియన్ దేశాల్లో తిరోగమనం, వడ్డీరేటు విధానం అనుకూలంగా ఉండకపోవడం

10. ఏ దేశాల జీడీపీలో సేవారంగం వాటా 78 శాతం కంటే ఎక్కువ?
జ: యూకే, అమెరికా, ఫ్రాన్‌‌స

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top