You Are Here: Home » చిన్నారి » సెమఫోర్ పద్ధతి అంటే ఏమిటి?

సెమఫోర్ పద్ధతి అంటే ఏమిటి?

సెమఫోర్ అనేది ఒక సిగ్నలింగ్ పద్ధ్దతి. దీనిని ఫ్రెంచికి చెందిన క్లాడ్ చాప్ (1763-1805) అనే వ్యక్తి తన సోదరులతో కలిసి 1791లో రూపొందించాడు. వాళ్లు రెండు చెక్క చేతులను ఈ పద్ధతిలో ఉపయోగించారు. వాటిని ఏడు స్థానాల్లో అమర్చటం వల్ల మొత్తం నూట తొంభై ఆరు రకాల సంజ్ఞలను ఉపయోగించేవారు. ఈ సంజ్ఞలు ఇంగ్లిష్ అక్షరాలతో పాటు కొన్ని అంకెలను, పదాలను కూడా సూచించేవి.

ఒక ఎతె్తైన భవనం మీద ఈ పరికరాన్ని అమర్చి సంకేతాలు పంపేవారు. వీటిని దూరంగా ఉన్న మరో కేంద్రం నుంచి టెలిస్కోప్‌తో అక్కడ ఉన్న ఆపరేటర్ గమనించి, సమాచారాన్ని అందుకునేవాడు. ఆ తర్వాత కాలంలో ఈ పద్ధతిలో మనుషులు రెండు చేతుల్లో జెండాలు పట్టుకుని సిగ్నల్స్ పంపించేవారు. సముద్ర ప్రయాణంలో ఒక షిప్ నుంచి ఇంకొక షిప్‌కి సమాచారం అందించుకోవటానికి సెమఫోర్ సిగ్నల్ పద్ధ్దతినే అనుసరించేవారు. రేడియో ద్వారా సమాచారం పంపించే వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా కొంతకాలం వరకు ఈ పద్ధతి కొనసాగింది. దాదాపు 1960 వరకు ఈ పద్ధతి కొనసాగింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top