You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » సూర్య నమస్కారం

సూర్య నమస్కారం

సూర్య నమస్కారం

యోగసనాలు, ప్రాణాయామం కలగలిసిన సంయుక్త క్రియే సూర్యనమస్కారం. దీనిలో 12 స్థాయిలుంటాయి. ప్రతి స్థితిలోనూ ఒక్కొక్క మంత్రము జపిస్తూ, ఆచరించవలసి ఉంటుంది.

దీనిలో శరీరంలోని ప్రతి ఒక్క భాగానికి వ్యాయామం అవుతుంది. మనం ఇతర ఆసనాలు చెయ్యడానికి శరీరాన్ని సంసిద్ధం చేయడంలో సూర్య నమస్కారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీనిలో మనం ముందుకు, వెనకకు శరీరాన్ని వంచినప్పుడు కండరాల్లో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. శ్వాస క్రమబద్దంగా లోపలికి, బయటికి పీల్చి, వదలడం వలన మన శరీరంలోని ‘నాడీవ్యవస్థ’ ఉత్తేజితం చేయబడడమే కాక, రక్తవూపసరణ క్రమబద్దీకరించబడుతుంది. ఈ ఆసనాలను ఒకటి నుంచి ఆరువరకు చేసి, తిరిగి ఆరు నుంచి ఒకటో ఆసనానికిరావాలి.

సమయం : సూర్యోదయ సమయంలో స్నానం చేసిన తర్వాత చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. చేసే ప్రదేశం.. గాలి, వెలుతురు ఉన్న ప్రదేశం అయ్యిండాలి. పన్నెండు
ఆసనాలు ఒకసారి పూర్తి చేసినట్లయితే దానిని ఒక ‘ఆవృతం’ అంటారు. ముందు మూడు ఆవృతాలతో మొదలుపెట్టి 12వరకు చేయవచ్చు.

మంత్రాలు : ఓం మిత్రాయ నమః
ఓం రవయే నమః
ఓం సూర్యాయ నమః
ఓం భానవే నమః
ఓం ఖగాయ నమః
ఓం పూష్లే నమః
ఓం హిరణ్య గర్భాయ నమః
ఓం మరీచయే నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం సవిత్రే నమః
ఓం అర్కాయ నమః
ఓం భాస్కరాయ నమః

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top