You Are Here: Home » చిన్నారి » కవితలు » సూర్య చంద్రులు

సూర్య చంద్రులు

ఉషోదయం తో పరుగులు పెడ్తూ వచ్చాడు నా స్నేహితుడు
కిటికీ గుండా వేడి వేడి చూపులతో నా కేసి చిరునవ్వు చిందిస్తున్నాడు
చురుక్కు మానటం తో చటుక్కున్న నన్ను లేపింది మా “వాడి” చూపులు
ఆనందం తో గంతులేస్తుంది తలచుకుంటే నా నేస్తం తో నేను ఆడే ఆటలు

భగభగ మండే తన చూపులతో బంగారంలా మెరిసింది మా లోగిలి
ఆనందం తో కూడిన ఆటలతో కాలం చెప్పలేదు వచ్చిందని జాబిలి
అరుస్తున్న అమ్మ మాటను ఖాతరు చేయలేదు మా నేస్తాలిద్దరం
తన అమ్మ రమ్మందన్న సాకు తో వడి వడి గ దిగి పోయాడు ఆ సాయంత్రం

ఆడి ఆడి అలసి పోయి పడుకున్నాను మా అమ్మ ఒడిలో వెచ్చగా
కిటికీ కుండ చిరునవ్వుతో వచ్చింది నా చెల్లెలు, వెన్నెలలు పంచుతు చల్లగా
తన చల్లని చూపులతో నాపైన కురుపిస్తున్నది మల్లెలు మెల్లమెల్లగా
చెల్లెలి చల్లని చిరునవ్వుతో, నెమ్మది గ నిద్రలో కి జారాను మత్తుగ

అమ్మ చెప్పే కధలు గోరుముద్దల రుచులు చేస్తున్నది పరవశం
రేపటి నా ఉషోదయ స్నేహితుని కోసం పరితపిస్తున్నది నా శరీరం
పగలు చురుక్కుమనే నేస్తం చేయీ, కలిగిస్తుంది రేయీ చల్లని చెల్లెలు హాయీ
ఈరెంటి నడుమ అయింది నా జీవితం నిత్య పున్నమి వెన్నెల లొయీ!!!

-శ్యాం సుందర్ కాట్రపాటి, OHIO, USA

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top