You Are Here: Home » ఇతర » సుమధుర గాయని ఎస్‌.పి.శైలజ

సుమధుర గాయని ఎస్‌.పి.శైలజ

ప్రొఫైల్
Unta

పూర్తి పేరు 	: శ్రీపతి పండితారాధ్యుల శైలజ
పుట్టిన స్థలం : కోనేటమ్మపేట, నెల్లూరు జిల్లా
వృత్తి : గాయని, ప్లేబ్యాక్‌ సింగర్‌,
డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌
ప్రత్యేకతలు : భారతీయ శాస్ర్తీయ సంగీతం
కెరీర్‌ ప్రారంభం : 1968
పాడిన భాషలు : తమిళం, తెలుగు, కన్నడ,
మళయాలంలో
5 వేలకు పైగా పాటలు.

తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని గాయని ఎస్‌.పి.శైలజ. సాగరసంగమం చిత్రంలో నృత్యకళారిణి పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించారు.ఆమె తండ్రి సాంబమూర్తి హరికథలో ఉద్దండుడు. ప్రముఖగాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఆమె సోదరుడు.ఆమె ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్‌ను వివాహం చేసుకున్నారు.

డబ్బింగ్‌ అర్టిస్ట్‌గా..
శైలజ తన కెరీర్‌ ప్రారంభంలో అనేక మంది నటీమణులకు తన గళాన్నందించారు. అందులో శ్రీదేవి,టబూ, సోనాలి బింద్రే వంటి ప్రముఖ కథానాయికలు కూడా ఉన్నారు. అమె డబ్బింగ్‌ చెప్పిన చిత్రాల్లో వసంతకోకిల (శ్రీదేవి పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు), గుణ (రేఖకు డబ్బింగ్‌ చెప్పారు), నిన్నేపెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే (టబూ) వంటి చిత్రాలు ప్రముమైనవి.

సాగరసంగమం….
SPa కే విశ్వనాథ్‌ తెరెక్కించిన ‘సాగరసంగమం’ చిత్రంలో కథానాయిక జయప్రద కూతురిగా నిటించింది శైలజ.ఈ చిత్రంలో భరతనాట్యంలో తనకున్నంత ప్రావీణ్యం మరొకరికి లేదు అనే విధంగా పాత్రాధారణ చేసింది. నిజానికి శైల మంచి భరతనాట్య నృత్యకారిణియే. ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో కమల్‌ హాసన్‌ ఆమె నృత్యాన్ని చూసి, అది భరతనాట్య నృత్యానికే అవమానరమైన నృత్య ప్రదర్శనగా రాసి పెపర్‌లో వెలువరిస్తాడు.మరిసటి రోజు ఇది చూసిన ఆమె తనకు క్షమాపన చెప్పాలంటుంది. దానికి కమలహాసన్‌ నృత్యం అంటే ఎంటో తెలుసా అని అడుగుతాడు.

నాకు తెలుసు నీకు తెలుసా అసలు అని తిరిగి ప్రశ్నిస్తుంది. అప్పుడు కమల్‌ టేప్‌రికార్డర్‌ని ఆన్‌ చేసి ఒకే పాటపై భరతనాట్యం, కూచిపూరి,కథకలి ఆడి అందరినీ ఆశ్చర్య పరుస్తాడు. అది చూసిన శైలజ (పాత్ర) అవమాన భారంతో అక్కడికి వెళ్లిపోతుంది. ఈ చిత్రంలో కమల్‌ వద్దే నాట్యం నేర్చుకుని చివరికి చక్కని ప్రర్శననిస్తుంది. ఈ చిత్రంలో శైలజ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం తమిళంలో ‘సాలంగై ఓలి’ గా అనువాదం కాగా అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది.

సుధాకర్‌తో వివాహం…
శైలజ వివాహం ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్‌తో జరిగింది. చక్కని నటుడిగా తెలుగు తెరపై హాస్యాన్ని,అద్భుతమైన పాత్రలలో కనిపించారు సుధాకర్‌.నేటికి ఆయన నటనను ప్రేక్షకులు మరి పోలేరు. అయితే ఈ వివాహాన్ని ఆమె సోదరుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రస్తావించాడు. ఇరు వురు సమ్మతి తెలుపడంతో ఈ వివాహం జరిగింది. శైలజ-సుధాకర్‌కు శ్రీకర్‌ అనే కుమారుడు కూడా కలడు.

ఎస్‌.పి.బాలుతో అనుబంధం..
శైలజ ప్రముఖ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం సోదరి. వీరిరువురు కలిసి అనేక చిత్రాలలో యుగళగీతాలను పాడారు. అందులో సితార చిత్రం నుంచి కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నల పైటేసి అనే పాట ఒకిటి. ఒకానోక సందర్భంలో తన సోదరి శైలజ గురించి బాలు మాట్లాడుతూ ‘తెలుగు వారు గర్వించ దగ్గ సింగర్స్‌లో శైలజ ఒకరు. నా సోదరి అవడం ఎంతో గర్వంగా ఉంది.’ అని తెలిపారు.

శైలజ టాప్‌ -5
Untitla

పాట                 చిత్రం 
వూటే మంత్రము మనసే బంధము సీతాకోక చిలుక
వేదం అణువణువున నాదం సాగర సంగమం
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నల పైటేసి సితార
నిగమా నిగమాంతర అన్నమయ్య
దమ్మం శరణం గచ్ఛామి స్వాతిముత్యం
వేవేలా గోపమ్మలా మువ్వా గోపాలుడే సాగర సంగమం
నాంపల్లి స్టేషన్‌ కాడా రాజాలింగం ఎర్రమల్లెలు
లాలూ దర్వాజ కాడా లష్కర్‌ మొండి మొగుడు పెంకి పెళ్లాం
మాఘమాస వేళలో జాతర
ముడు బురుజుల కోట మురిపాల తోట సూత్రధారి

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా…

చిత్రం 			 నటి
వసంత కోకిల(83) శ్రీదేవి
గుణ (1991) రేఖ
నిన్నే పెళ్లాడతా(1996) టబూ
ఆవిడ మా ఆవిడే(1998) టబూ
మురారి(2001) సొనాలి బింద్రే
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top