You Are Here: Home » సినిమా » పాటలు » సుఖదుఃఖాలు (1968)- మేడంటే మేడా కాదు

సుఖదుఃఖాలు (1968)- మేడంటే మేడా కాదు

పల్లవి :
మేడంటే మేడా కాదు
గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాదీ
పొదరిల్లు మాదీ…

చరణం : 1
నేనైతే ఆకూ కొమ్మా… ఆ…
తానైతే వెన్నెల వెల్లా… ఆ… ॥
పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాదీ

చరణం : 2
కోవెల్లో వెలిగే దీపం దేవీ మా తల్లి
కోవెల్లో తిరిగే పాటల గువ్వ నా చెల్లి
గువ్వంటే గువ్వా కాదు గొరవంక గానీ
వంకంటే వంకాగాదు నెలవంక గానీ

చరణం : 3
గోరింక పెళ్లైపోతే ఏ వంకో వెళ్లిపోతే (2)
గూడంతా గుబులై పోదా
గుండెల్లో దిగులై పోదా

చిత్రం : సుఖదుఃఖాలు (1968)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top