You Are Here: Home » ఇతర » సీడీలో సృజన చూపండి

సీడీలో సృజన చూపండి

ఇంట్లో కంప్యూటరుండి, పిల్లలు ఉంటే అనేక రకాల సినిమా సీడీలు, వీడియో గేములు తెచ్చి అక్కడక్కడా పారేస్తూవుంటారు. కొన్నాళ్ళకి అవి పాడైపోయి ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ఇంటి పనులతో సతమతమయ్యే ఇల్లాలు చిరాగ్గా ఉండే పాత సీడీలు కుప్పతొట్టిలో పారేస్తూవుంటుంది. ఇలా ఒకరిద్దరు కాదు, సాధారణంగా చాలామంది గృహిణులు చేసే పనే.

2filler2అయితే అలాచేయకుండా, వాటిని శుభ్రంగా తుడిచి కాస్త సృజనాత్మకత జోడిస్తే, అవే మంచి గృహాలం కరణలుగా మారతాయి. కాస్తంత ఖాళీస్థలంలోనో, కుండీల్లోనో, చెక్కపెట్టెల్లోనో ధనియాల్లాంటి చిన్న చిన్న మొక్కలు పెంచేవారికి ఈ ఓ మంచి అవకాశం. ఇలాం టి చిన్న మొక్కల తాలూకు మొలకలు రాగానే పక్షులు వాటిని తటాల్న తినేస్తుంటాయి. సాధారణంగా పొలాల్లో ఈ పక్షుల్ని పారదోలడానికి పొడవాటి మెరుపు రంగు కాగితాన్ని వేలాడగడతారు. దానికి బదులు మీ కిచెన్‌ గార్డెన్‌ కోసం చిన్నారి మొక్కలున్న మొలకలపై ఈ పాడైపోయిన సీడీలను వేలాడదీయండి. చూడ్డానికి అందంగానూ, షోగానూ ఉంటాయి. మొల కలను పక్షులనుంచి రక్షిస్తాయి. నేరుగా చెత్తకుండీల్లో పారేయడానికి బదులు దానికి ముందే అది ఉపయోగం లోకి వస్తే మరీ మంచిది. పర్యావరణానికి కూడా.అలాగే వీటి మీద మంచి పెయింటింగ్‌లు వేసి, లేదా మంచి సీనరీలు సీడీలకు ఫెవికాల్‌తో అతికించి గోడలకి అలంకరిస్తే చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇలా మీకు తోచిన కళాత్మకతని సీడీల మీద ఉపయోగించండి.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top