You Are Here: Home » సినిమా » పాటలు » సిరిసంపదలు (1962)- ఈ పగలు రేయిగా

సిరిసంపదలు (1962)- ఈ పగలు రేయిగా

పల్లవి :
ఈ పగలు రేయిగా
పండు వెన్నెలగ మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ ఆ… ఊఁ..
వింతకాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి… ఓ ఓ ఓ…

చరణం : 1
మనసున తొణికే చిరునవ్వెందుకు
పెదవుల మీదికి రానీవు
అహా ఓహో అహా… ఆ…

పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు ఊఁ…

చరణం : 2
కన్నులు తెలిపే కథలనెందుకు
రెప్పలార్చి ఏమార్చేవు
ఆఁ… ఆఁ… ఓ ఓ ఓ…

చెంపలు పూచే కెంపులు
నాతో నిజము తెలుపునని జడిసేవు
ఓహోహో…

చరణం : 3
అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకుని నవ్వేవు ఉహుహు…

నల్లని జడలో మల్లెపూలు
నీ నవ్వునకద్దము చూపేను ఆహా…

ఆహహాహా… ఆహహాహా…
ఆహహాహా… ఆహహాహా…
ఊహుహూ…

చిత్రం : సిరిసంపదలు (1962)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, ఎస్.జానకి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top