You Are Here: Home » ఇతర » సినిమా కథలు

సినిమా కథలు

1512aఒకప్పుడు సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్నవారు ఇంట్లో చెప్పకుండా మద్రాసు పారిపోయి ఎవరినో ఒకరిని ఆశ్రయించి అవకాశాలు పొందేవారు. అలాంటి వారిలో కొందరు తారలుగా మంచి స్థాయిలో స్థిరపడితే, మరికొందరు రెంటికి చెడ్డ రేవడి అన్నట్టు జీవితాలు పాడుచేసుకున్నవారు కూడా ఉన్నారు. అలా పారిపోయి తారాపథంలో వెలిగినవారిలో గయ్యాళి పాత్రలతో తెలుగు హృదయాల్ని దోచుకున్న సూర్యకాంతం నుంచి సిల్క్‌స్మిత దాకా ఈ ఇంట్లోంచి పారిపోవడం అనేది నేటికీ జరుగుతూనే ఉంది. అయితే ఇలా సినిమా మోజులో పడి వచ్చేస్తున్న యువతులు ఏ విధంగా తమ బ్రతుకులు బలిపెట్టుకుంటున్నారో మీడియాల్లోను, వార్తలోను చూస్తుంటే జాలి, అసహ్యం కూడా కలుగుతోంది.

సినిమా అనేది కేవలం పదిమందికి వినోదాన్ని అందించే ఒక పరిశ్రమ మాత్రమే. అందులో ప్రవేసించాలంటే సరైన మార్గంలో ప్రయత్నిస్తే తప్పులేదు. అందులోను అప్పటి కళాతృష్ణ వేరు. కళాకారులు గౌరవ మర్యాదలు పొందే రోజులవి. ఆ రోజుల్లో వారు అలా వచ్చినా తొటి సినీ కళాకారులు ఆదరించి, ఆదరణ కురిపించేవారు. ఇప్పుడు ఆడది ఒంటరిగా అర్ధరాత్రి తిరిగే రోజులు వచ్చాయి కానీ భద్రత మాత్రం ఇంకా రాలేదు, రాదు కూడా. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చక్కగా చదువుకుని జీవితంలో గౌరవ ప్రదంగా ముందు స్థిరపడితే, మన కళాత్మకతకి తగిన ప్రయత్నాలు అప్పుడు చేయవచ్చు. అంతేకానీ సినిమాల్లో నటించాలన్న కోరికని పెంచుకోవడంలో అర్ధం లేదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top