You Are Here: Home » ఇతర » సాహిత్య సేవలో ఉత్తరాంధ్ర..

సాహిత్య సేవలో ఉత్తరాంధ్ర..

తెలుగు సాహిత్యాన్ని ఆధునికతవైపు నడిపించిన గురజాడ…
దీనజనోద్ధారక కవి, రచయిత పురిపండా అప్పలస్వామి
కవిత అంటే ప్రజాస్పర్శ, విప్లవం అని చాటిన శ్రీశ్రీ…
కూనలమ్మ పదాలతో తెలుగువెలుగులు విరజిమ్మిన ఆరుద్ర…
తెలుగుకథకు హాస్య చతురతనేర్పిన భరాగో…
పేదబడుగుల సమస్యలనే కథలుగా మలిచిన రావిశాస్త్రి
వ్యంగ్యం అంటే ఎలావుంటుందో రుచి చూపించిన పతంజలి…
హరికథా పితామహులు…నారాయణదాసు
జనపదాల జానపదబ్రహ్మ వంగపండు
ఇలా ఒకరేమిటి ఎందరో కవులు, రచయితలు,
ఉత్తరాంధ్ర నుంచి తెలుగుసాహిత్య సేవలో తరించారు.

srisriగోదావరి గొప్పతనం చెప్పాలన్నా, ఆ నది బతకాలన్నా ఉపనదుల మీదే ఆధారపడి వుంటుంది. తెలుగుభాష గొప్పతనం అలాంటిదే. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, నాలుగు ప్రాంతాల కవులు, రచయితల సాహిత్య సంగమమే సమగ్ర తెలుగు సాహిత్యం .ఏ భాష అయినా బతికిబట్టకట్టిందంటే మాండలికాల అస్తిత్వం పైనే వుంటుంది. కథ, నవల, కవిత ఏదైనా సజీవ భాష వుంటేనే అది పదికాలాలు నిలిచి వుంటుంది. ఉద్దానం నుం చి వాల్తేరు వరకు ఎందరో మహానుభావులు తెలుగు సాహిత్యా ఙనికి తమ వంతు సాయాన్ని అందించారు. తెలుగు సాహిత్యా న్ని ఆధునికత వైపు నడిపించిన గురజాడ అప్పారావు విశాఖజిల్లా యలమంచిలిలో జన్మించారు. ఆయన జీవితంలో ఎక్కువకాలం విజయనగరంలోనే వున్నా రు.

గ్రాంధికం నుంచి వాడుకభాషలో కన్యాశుల్కం నాటకాన్ని రాసి తెలుగు సాహిత్యానికీ,ఆనాటి దురాచారాల సమాజానికీ ఒక దిశానిర్దేశం చేశారు. తెలుగు ఛందస్సును కొత్త పుంతలు తొక్కిస్తూ ‘ముత్యాల సరాలు’ పేర్చారు. నాటి సామాజిక రుగ్మతలను తన రచనల ద్వారా ఎండగట్టారు. ‘అభ్యుదయ కవితా పితామహు డు’గా పేరొందారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వాతంత్ర సమరయోధులు పురిపండా అప్పలస్వామి ఉత్తరాంధ్ర సాహిత్యంలో మేలి కలికితురాయి. వృత్తిరీత్యా పాత్రికేయుడైనా ఎన్నో రచనలు చేశారు. మహాకవి శ్రీశ్రీ లాంటి ఎందరో యువకవు లను ప్రోత్సాహించారు. శ్రీమద్భా గవతం, సౌదామిని, శ్రీదేవి భాగవతం ఆయన పేరొందిన రచనలు. భాగవతుల సదాశివశంకరశాస్ర్తి అంటే చాలామందికి తెలియ పోవచ్చు.

కానీ ఆరుద్ర అంటే తెలియని వారుండరు. ఆరుద్ర విశాఖ పట్నంలో 1925 ఆగస్టు 31న జన్మించారు. ఎన్నో పార్శ్వాలున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆరుద్ర. కవి, రచయిత, పరిశోధకుడు, సినీ గేయరచయిత, అనువాదకుడు, ఇలా ఎన్నో రంగాలలో తన నైపుణ్యా న్ని ప్రదర్శించారు. సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని పన్నెండు భాగాలుగా రచించిన గొప్ప పరిశోధకులు. చాళుక్యుల కాలం నాటి నుంచి 19వ శతాబ్ధం వరకు తెలుగుసాహిత్య వైభవాన్ని గ్రంధీకరించారు. ఆయన రచించిన త్వమేవాహం, కూనలమ్మ పదాలు తెలుగు సాహితీరంగాన ఓ గొప్ప ప్రయోగాలు. విశాఖలోనే పుట్టి, విశాఖ సాగరతీరాన నడయాడి సముద్రమంత ఎత్తుకు ఎదిగి ఆకాశంలో గర్జించిన మహాకవి శ్రీశ్రీ ఇక్కడివారే.

ఈ శతాబ్ధం నాది అని గర్వంగా ప్రకటించుకున్న శ్రీశ్రీ విశాఖ పాతనగరం లోని విస్పర్తివారి వీధిలో నివసించారు. కవిత అంటే మనసును ఓలలా డించే పదప్రయోగంగా ఆయన భావించ లేదు. కవిత అంటే ప్రజా స్పర్శ. కవితతో విప్లవం అంటూ గర్జించారు. మహాకవిగా ఎది గారు. ఎన్ని అవార్డులు, రివార్డులు వరించినా శ్రీశ్రీ మహాప్రస్థానం జనానికి చేరువైనంతగా మరే రచనా చేరువకాలేదు. శ్రీశ్రీ స్ఫూర్తితో కొన్ని వేలమంది తెనుగుదేశంలో కలం చేతబూనారంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాంధ్ర యాసలో కథలు రచించిన రావిశాస్ర్తి ఇక్కడి రచయితలకు ఓ దారి చూపించారు.

ravaపీడిత, తాడిత ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలు, సామాజిక రుగ్మతలపై ప్రధానంగా రచనలు సాగించారు. శ్రీకాకుళం జిల్లాలో 1922 జూలై 30న జన్మించిన రాచకొండ విశ్వనాధ శాస్ర్తి రావిశాస్ర్తిగా ప్రసిద్ధులయ్యారు. పట్టణ జీవనంలో చోటు చేసు కుంటున్న మార్పులు పేద, మధ్యతరగతి ప్రజల్లో ఎటువంటి ప్రభావం చూపాయో తన రచనల్లో ప్రస్ఫుటంగా చెప్పారు. సొమ్ములు పోనాయండి, అల్పజీవి, ఆరుసారా కథలు, ఇల్లు , కథాసాగరం, బానిస కథ లు లాంటి అనేక రచనలు చేశారు. తన రచనల్లో, కథల్లో ఉత్తరాంధ్ర మాండలికానికి పెద్దపీట వేశారు. వ్యంగ్యం అంటే ఏమిటో తన రచనల ద్వారా కుండబద్దలు గొట్టిన రచయిత కె.ఎన్‌.వై.పతంజలి . ఉత్తరాంధ్ర యాసతో, ఇక్కడి పేర్లతో, నానుడులతో ఆయన తన రచనలు చేశారు.

ఖాకీవనం, పిలక తిరుగు డుపువ్వు, గోపాత్రుడు, ఒక దెయ్యం ఆత్మకథ రచనలు చదివితే ఆయనలోని రచయిత మనకు అచ్చెరువొందు తాడు. బతకడమెలా అంటూ వ్యంగ్యాన్ని జోడిస్తూ ఆయన రాసిన మరో పుస్తకం మనల్ని నిలబడనీయదు. పతంజలి రాసిన వేటకథలు చదివితే మనమే వేటకు వెళ్లిన అనుభూతి కలు గుతుంది. హరికథ పితామహుడు నారాయణ దాసు, హాస్యకథల చక్రవర్తి భమిడిపాటి రామ గోపాలం (భరాగో), జానపదకవి వంగపండు ఇక్కడివారే. తెలుగు కళామతల్లి సేవలో తమ జీవి తాలను అర్పించిన ఈ మహానుభావులు తెలుగు సాహిత్యం బతికన్నంతకాలం చిరంజీవులే..

– బి. రవికాంత్‌, మేజర్‌న్యూస్‌ బ్యూరో, విశాఖపట్నం

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top