You Are Here: Home » విశేషం » సాలీడు తన గూటిలో ఎందుకు చిక్కుకోదు?

సాలీడు తన గూటిలో ఎందుకు చిక్కుకోదు?

సాలీడు తన గూటిలో ఎందుకు చిక్కుకోదు?

 సాలీడు తన గూటిలో ఎందుకు చిక్కుకోదు?

పాడుపడిన భవనాల మూలల్లోనో…చెట్ల కొమ్మల్లోనో…లేక మన ఇంట్లో మూలల్లోనో వలలాంటి చక్కని గూటిని చూస్తాం!అదే ‘సాలెగూడు.’ దానిని నేసే పురుగును ఆంగ్లంలో ‘స్పైడర్‌’ అంటున్నాం. వస్త్రంలా నేత నేస్తుంది. కాబట్టి తెలుగులో ‘సాలీడు’ అంటున్నాం.

సాలీడు తన గూటిని ఆహారం కోసం నిర్మించుకుంటుంది అంటే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. అసలు నిజంగా ఇదే జరుగు తున్నది.

శ్రమపడి తన గూడును అల్లుకుంటుంది. ఏ ఈగో…దోమో వస్తుందని కాచుక్కూర్చుంటుంది. అది ఎదురుచూస్తున్నట్లుగానే ఏదో ఒక కీటకం గూటిపైన వాలుతుంది. అంతే పైకి లేవలేక పోతుంది. లేవటానికి ప్రయత్నం చేసేకొద్దీ గూడు చిక్కుబడిపోయి కీటకం దానిలో చిక్కుకుంటుంది. ఇంతలో సాలీడు నింపాదిగా వచ్చి కీటకాన్ని భోంచేస్తుంది. ఇక్కడ మనం సాలెగూటిలో కీటకం చిక్కుపడటం చూశాం. సాలీడు మాత్రం చిక్కక పోవటమూ చూశాము…

ఇలా ఎందుకు జరిగింది? ఈ ‘ట్రిక్కు’ సాలెగూడు నిర్మాణంలోనే ఉన్నది…సాలెపురుగు పొట్టలో కొన్ని ప్రత్యేకమైన గ్రంథులున్నాయి. వీటిల్లో దారపుపోగుల తయారీకి అవసరమైన ద్రవం తయారవుతుంది.

పొట్ట క్రిందిభాగంలో చివర రంధ్రాలు

ఉన్నాయి…ఈ రంధ్రాలలో నుండి ద్రవం బయటికి దారంలా గెంటబడుతుంది. అలా గెంటబడిన ద్రవం గాలికి గట్టిపడుతుంది. దీనితో ద్రవం దారంలా తయారవుతుంది. గట్టిపడిపోతుంది…ఈ దారానికి జిగురుకూడా కల్పిస్తుంది సాలీడు.

ఆ దారాలు కూడా గూటిలో కలిసిపోయి

ఉంటాయి. జిగురు దారాలు ఏవో..జిగురులేనివి ఏవో సాలీడుకు బాగా తెలుస్తుంది. అందుకనే అది జిగురు లేని వాటిపైనే పయనిస్తుంది…కాని పాపం కీటకాలకు ఈ విషయం తెలియదుగా! అందుకే జిగురు దారాలలో చిక్కుకుంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top